మినీ కవితలు

మదిని అలంకరిస్తేనే
సంతసం హ్రుదిని వరిస్తుంది
నీ అదుపుకు మెదడు
ఇతరులకైతే మనసూ వాడు
జీవితమంటే
నీవేదో ప్రణాళికలోవుండగా గడుస్తూ పోతుండేది.. 
జీవితం ఓ సైకిల్ సవారీ
నడుస్తుంటేనే పడవు మరి ..... 
జీవితం...అంటే
నిన్నునీవు తెలుసుకోడం కాదు మలచుకోవడం. 
అసత్యపు సౌఖ్యం కన్నా
సత్య నిష్ఠూరమే నయం..
ఆలోచనల వేడితో 
రాత్రి కరిగి పోతూనే వుంది.. 
మన ప్రజాస్వామ్యపు ప్రగతి 
మారణాయుధపు సంబరాలతో ...
కొత్త ఫ్యాను కదా 
గాలి గట్టిగానే వీస్తోంది..
పెళ్లి పెద్దది అనుకుంటే
లొల్లి మరీ పెద్దదైంది ...
గులాబి రంగు 
నిలిచిందా .. కొంచెం వెలిసిందా
జనపద్ లో దొరకనిది 
జనపధం లో దొరుకుతున్నట్లుంది 

కామెంట్‌లు