Tuesday, 16 October 2012

మనిషంటే ?మానవుడింతవరకూ క్రుత్రిమంగా జీవకణాన్ని స్రుష్లించలేదు దగ్గరగా వెళ్లాడంతే.
మనకి అందుబాటులో వున్న నాలెడ్జిద్వారా అర్ధం చేసుకోవాలంటే కంప్యూటరో, రోబోనో మరింత అడ్వాన్సుడు కండిషన్లోవున్న సెల్ప్ జనరేటింగ్ యంత్రం మానవుడు.

శరీరం హర్డ్ వేర్ (Hardware).... తెలివితేటలు సాఫ్ట్ వేర్(Software)..

కానీ మనకింకా వున్న సాఫ్ట్ వేర్ లనే పూర్తిగా సరిగా వాడుకోవడమే రాలేదు...
ఇక OS ఇస్టలేషన్ ఎప్పటికి వస్తుందో..

హర్డ్ వేర్ కంపైలేషన్ జరగటంతో పుట్టుక అంటున్నామేమో..
సిస్టమ్ ఇర్రికవరబుల్ డిస్ఠ్రక్షన్ కి లోనవటమే మరణం..

మరణించాక మనకి తెలిసిన జ్ఞానం ప్రకారం హర్డువేరు ఏమవుతుందో మీకు తెలుసు ఖననం లేదా దహనం.. అంతేకదా. అంటే ఏవేవో మిశ్రమాలనుండి ఒకటిగా తయారయిన యంత్రం.. వేరు వేరు విశ్రమాలుగా విడిపోతోంది. ద్రవ్యనిత్యత్వ నియమం ప్రకారం చూసినా నాశనం కాలేదు. మరి శక్తిరూపం లోని సాప్ల్ వేర్ ఏమయింది. తెలివితేటలు శక్లిరూపమేనా కాదా..ఇది చూడాలి..

ఇక ఈ యంత్రం పనిచేయటానికి పనికి అర్ధం ఏమిటి ? అతివిశాల స్వజాతి మనుగడను నిలబెట్టుకోవడమా ? నాశనం దిశగా నెట్టడమా ? రెండుకొసలలో ఏవైపుకు.. వెళుతున్న కొసలో ఎంత ఎత్తుకు ఇవే కనిపిస్లున్నాయి సోదరా మానవ జాతి చరిత్రలో..

ఏమన్నా అర్ధం అయ్యిందో లేదో... చెప్పండి..

ఫేస్ బుక్

Tweets

లంకెలు