Monday, 5 November 2012

నీవెవరు ?

మరణమంత దృఢమైన నిజం

దేవుడంత జటిలమైన నిర్వచనం.


అమ్మతో మొదలయ్యి, అమ్మాయి మీదుగా

అంతంవరకూ నీడైవెంటాడేదీ.


ఏదో కావాలనుకున్నపుడు దానిపైనే కలిగేది.

మరోదో వద్దను కుంటే అదికానిదానిపై నిలిచేదీ


మెదడులో అనుభూతో, నరాలలో హార్మోనో

ప్రపంచపు నడతకే హార్మనీనో


ఒక్కోసారి రహస్యావయవమంత సిగ్గుతో చీకట్లలో కుంచించుకునేదీ

మరోసారి భువనభోనాతరాలూ వెలుతురై విలసిల్లేదీ.


ఏవరా తానెవ్వరా అనివెదికితే

లోనోసారీ, బయటోసారీ దోబూచులాడుతూ

దొరకకుండా ఆడుకుంటున్న తనపేరు ప్రేమేనా...


http://www.facebook.com/groups/168167829932021/permalink/375703259178476/

ఫేస్ బుక్

Tweets

లంకెలు