Monday, 22 April 2013

తేట తెలుగు లిపి సంస్కరణలు - మదుసూదన్ రెడ్డి కాకులవరం

ఈ మద్య తెలుగును ప్రాచీన బాషగా గుర్తించాలని చాలా వ్యాసాలు వచ్చాయి. ఉద్యమాలు చేసారు. నిరాహారదీక్షలు పూనారు. ఇవన్నీ చాలా సంతోషించదగ్గ విషయాలు. ఇంతకు ఏది తెలుగు బాష అన్న విష యం ఎవ్వరు చెప్పడం లేదు. తెలుగు లిపిలో రాసినదం త తెలుగు సాహిత్యమా? లేక ఇతర బాష పదాలను గుడ్డిగా తెలుగు లిపిలో రాసి దానిని తెలుగు సాహిత్యం అందామా? బూదరాజు రాదాక్షికిష్ణ ‘గ్రాందిక, వ్యవహారిక బాషా వాదాలు 1900 నుంచి నేటి వరకు’ అన్న వ్యాసం లో గ్రాందిక బాషావాదులు తెలుగు బాషాబివ్రుద్దికి కలిగించిన ఆటంకాల గురించి చక్కగా వివరించారు. గిడుగు రాంమూ ర్తి, వీరేశలింగం, గురజాడ అప్పారావు వ్యవహారిక బాష వాడడానికి చాలా పోరాటం చేసారు. 1913లో గిడుగు రాంమూర్తి ‘ఇంట్లో వాడుకునే’ బాషను ప్రబుత్వ యంత్రాంగంలో వాడాలని బ్రిటిష్ ప్రబుత్వానికి నివేదిక సమర్పించాడు. వీరేశ లింగం సామాజిక మార్పులకు వ్యవహారిక బాష అత్యవసరమని చాటి చెప్పారు. గురజాడ స్వాతంత్య్ర సమరంలో ప్రజలలో చైతన్యం తీసుకరావడానికి తేట తెలుగులో కవితలు రాసారు. కాశినాదుని నాగేశ్వరరావు ఆంద్ర పత్రికను స్తాపించి తెలుగు బాషాబివ్రుద్దికి తోడ్పడ్డారు. కొంతవరకు వ్యవహారిక బాషావాదుల శ్రమ పలించిందని చెప్పుకోవచ్చు. 1915 నుండి 190 వరకు తేట తెలుగు పదాల వాడుక పెరిగింది. కమ్యూనిస్టులు తేట తెలుగు పదాలు వాడి వారి ప్రబావం పెంపొందించుకున్నారు. తెలుగు సినిమా దర్శకులు ప్రజల అబిమానం చూరగొనడానికి తేటతెలుగు పదాలను పాటలు, మాటలలో ఎక్కువ వాడారు. 


గ్రాందిక బాషావాదులు చివరకు తమ ఓటమిని అంగీకరించి వెనుకకు పుంజుకున్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాత బారత దేశంలో హిందీ బాష వాడకం పెరిగింది. హిందిలో సంస్క్రుత పదాల వాడకం పెరిగింది. 25 సంవత్సరాలుగా హింది టివి ప్రచారం కూడ పెరిగింది. తెలుగు విలేకర్లు, హింది టివి వార్తలు విని, వాటిలోని సంస్క్రుత పదాలను తెలుగు పత్రికలలో వాడడం మొదలుపెట్టారు. మన దురవూదుష్టం కొద్ది తెలుగు రచయితలు తెలుగు విలేకర్ల బాషను అవలంబిస్తున్నారు. గ్రాందిక బాషా వాదం తిరిగి మొదటికొచ్చింది. నేను ‘తెలుగీకరణ- తేట తెలుగు’ (అష్టదిగ్గజాలు కాదు అష్ట దరివూదులు) వ్యాసంలో ‘నన్నయ మహాబారత అనువాదంలో సంస్క్రుత పదాలను తెలుగు లిపిలో వాడి, తెలుగును సం స్క్రుత బాషకు ఎల్లప్పటికి బానిసగా మార్చాడు’ అని తెలిపాను. వెయ్యి సం వత్సరముల తరువాత కూడ మన తెలు గు కవులు, రచయితలు, విలేకర్లు ఈ ప్రబావం నుండి బయట పడడం లేదు. ఇది ఎంతో విచారించదగ్గ విషయం. పదిహేను సంవత్సరాలుగ, మన రాష్ట్రం లో ఐటి బ్రమ చాలా పెరిగింది. మద్యతరగతి కుటింబీకులు తమ పిల్లలను ఇం గ్లీషు మీడియం స్కూల్లో చేర్పిస్తున్నారు. ప్రబుత్వం పబ్లిక్ స్కూల్లో కూడ ఇంగ్లీషు మీడియం పెట్టాలని సంసిద్దమౌతున్నది. ఇంగ్లీషు మీడియంలో చదివిన చాలా మంది పిల్లలకు తెలుగు చదవడం, రా యడం తెలియదు. ‘తెలుగు చాలా కటినమైన బాష, సంస్క్రుతంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు’అని విద్యార్థు ల అబివూపాయం. గ్లోబలైజేషన్ పున్యమా అని ఇంగ్లీషు టీవీ చానెల్సు చాలా వచ్చినవి. ప్రబుత్వ యంత్రాంగం ఇంగ్లీషులో నడుస్తున్నందున చదువుకున్న వాళ్లు ఇంగ్లీషు పదాలను ఎక్కువగా వాడుతున్నారు. తెలుగు బాష ఒక దిక్కు సంస్క్రు త పదాలతో,మరొక దిక్కు ఇంగ్లీషు, ఉరుదు పదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. తెలుగు దిన పత్రికలో ఈనాడు మనం చదివేది 70 శాతం పైగా తెలుగేతర పదాలు. మన విశ్వవిద్యాలయాలు సంస్క్రుతంలో పరిశోదన చేసిన వారికి తెలుగు ‘పిహెచ్‌డి’ పట్టాలు ఇస్తున్నారు. యాబై సంవత్సరాలుగా మన తెలుగు పిహెచ్‌డిలు తల్లి బాషకు చేసిన సేవ మ చ్చుకైన కనిపించదు. తెలుగు అకాడమి వారు కొత్తగా వచ్చిన సాంకేతిక పదాల కు సంస్క్రుతంలో పదం పుట్టించి, దానిని తెలు గు లిపిలో రాసి అది తెలుగు పదం అని పుండుపై కారం పోసినట్లు చెపుతారు. తెలుగు బాషా రక్షకులు ఉన్నారా? ఉంటే ఎవరు వారు? అని ప్రశ్నించుకోవలసిన సమయం వచ్చింది.

తెలుగు లిపి సంస్కరణ
నేను ‘తెలుగీకరణ - తేట తెలుగు’ వ్యాసంలో తెలుగు ద్రవిడ బాష కుటుంబానికి చెందినదని, సంస్క్రుతం ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందినదని,ఒక చిన్న పదం మూలం తెలుగా, సంస్క్రుతమా అని చెప్పవచ్చు అని తెలిపాను. రచయితలు, కవులు, విలేకర్లు 70 శాతం పైగా తేట తెలుగు పదాలను వాడే క్రమశిక్షన ఏర్పరుచుకోవాలని కోరాను. తెలుగు పదాల వాడుకతో పాటు తెలుగు లిపి సంస్కరణ కూడ జరగాలి. ముప్పై సంవత్సరాలుగ తెలుగు లిపిని కంప్యూటర్‌లు వాడటానికి చేయవలసిన మార్పుల గురిం చి పరిశోదన చేసి , తెలుగు అకాడమి, తెలుగు యూనివర్సిటి, కాకతీయ యూనివర్సిటిలో ప్ర జం ఇచ్చాను. తెలుగు బాష నేర్చుకోవడం కష్టం అనే వాళ్ళు ఇతర బాషా పదాలతో పాటు, తెలు గు లిపిలో అనవసర అక్షరాలు చాలా ఉన్నవి అంటారు. ‘తెలుగు’ను ‘టెలుగు’ అని ఇంగ్లీషులో రాస్తాము. కారణం ఇంగ్లీషులో ‘త’ హల్లు లేదు. అంత మాత్రాన ఇంగ్లీషు వారు ‘త’ హల్లును వారి బాషలో కొత్తగా కల్పించలేదు. అలాగే మనం సంస్క్రుత, ఇంగ్లీషు పదాలను తప్పక అరువు తెచ్చుకోవలసిన పరిస్తితి ఏర్పడితె, మనం ఆ పదాల ఉచ్చారణ తెలుగు లిపిలో ఇమిడి పోయేలా మార్చుకోవాలి. కాని అలా అది జరగలేదు. సంస్క్రుత శబ్దాల కొరకు తెలుగులో ఖ,ఘ, ఛ, ఝ, ఠ, ఢ, ధ, భ, మహా ప్రాణాలను; ఋ,ౠ,... ఞ, ఱ, ః, ృ, ... మొదలగు మొత్తం 19 అక్షరాలను కలుపుతూ వచ్చారు. తెలుగు బాషను సులబం చేయాలంటె ఈ 19 అక్షరాలను తీసివేయాలి. దీనితో తెలుగు బాషకు జరిగే నష్టం ఏమిలేదు. దిన పత్రికలలో ఈ మార్పులు అక్కడక్కడ ఇప్పుడు కనిపిస్తునే ఉన్నవి. తేటతెలుగు లిపిలో 25 హల్లులు, 12 అచ్చులు వున్నవి.

పాత కంప్యూటర్లలో ఎనిమిది bit ascil code వాడేవారు. కొత్త కంప్యూటర్లలో (Microsoft XP)లో 16 bit యూనికోడ్ వాడుతున్నా రు. తెలుగు యూనికోడ్‌లో ‘క్ష’ అక్షరం తొలగించారు. క్ష అక్షరం రాయాలంటె క+ నకారం+...షతో కలిపి రాయాలి, దానికి మూడు కీ స్ట్రోకులు అవసరం. దేవనాగరి లిపిలో క్ష అక్షరం లేదు, వారి బాష లాగ తెలుగు బాష కూడా రాయాలని వారి ఉద్దేశం. మనం చిన్ననాటి నుంచి ‘క్ష’ను ఒక అక్షరంగా నేర్చుకున్నాం. యూనికోడ్ సంస్తవారు ‘క్ష’ను కల్పమని ప్రబుత్వం నుంచో లేక లేక బాషా సంస్తల నుంచో ఆపీల్ వస్తే కలుపుతాము అని తెలిపారు. ‘క్ష’తో పాటు మనం ‘దిత్తు’ అనే కొత్త అక్షరాన్ని కూడ కలపాలి. తెలుగు బాసలో రెండు హల్లులు మిలి తం అయినప్పుడు, ఒకే హల్లు అవుతే తప్ప కలవవు అని తెలుగీకరణ-తేటతెలుగు వ్యాసంలో తెలిపాను. దీనిని ద్వితాక్షరం అందాము. ముప్పై (30) శాతం తేటతెలుగు పదాలలో ఈ ద్వితాక్షరం కనిపిస్తుంది. ఉదాహరణకు ‘అన్న’ అనే పదంలో ‘న్న’ ద్వితాక్షరం. సంయుక్తాక్షరం ‘ద్య’ రాయడానికి ‘ద’+ నకారం +‘య’ మూడు కీ స్ట్రోక్స్ కావాలి. ‘న్న’ అన్న ద్వితాక్షరలో ‘న’+‘దిత్తు key ’ రెండు keystrokes మాత్రమే కావాలి. దీనితో ద్వితాక్షరం వచ్చిన ప్రతి పదంలో ఒక keystroke తగ్గించవచ్చు. ఇతర ఉదాహరణ క+దిత్తు-క్క, చ+దిత్తు=చ్చ. దిత్తు అక్షరంలో 3 నుంచి 5 శాతం keystrokes తగ్గించె అవకాశం ఉంది. ఇది తెలుగు లిపికి చాలా లాబదాయకము.తేటతెలుగు ‘పదాలు’ వాడె క్రమశిక్ష ణ, తేటతెలుగు ‘లిపి’ సంస్కరణలతో తెలుగు సమాజం ముందుకుపోయే అవకాశం చాలా వుంది. పిల్లలు తెలుగు నేర్చుకుని సమయాన్ని సగానికి తగ్గించవచ్చు. వయోజనులకు తక్కువ కర్చుతో చదవడం, రాయడం నేర్పవచ్చు.

నిరక్షరాస్యాన్ని నిర్మూలించవచ్చు. ఇంగ్లీషు మీడియంలొ చదివిన పిల్లలు తెలుగు నేర్చుకోవడానికి ఉత్సాహన్ని చూపించగలరు. తేటతెలుగు లిపి ఈ మేయిల్ (email), Win Word, Excel, Databese లో వాడుకోవచ్చు. తెలుగు పదాలను alphabetical orderలో sort చేయొచ్చు, Databaseలో Primary keyగా వాడుకోవచ్చు. ఇంగ్లీ షులో వచ్చె కొత్త సాఫ్టువేర్ తెలుగులో ఏ మార్పులు లేకుండ వాడుకోవచ్చు. ఇక్క డ తెలుగు బాషారక్షకులు చేసేవి రెండు పను లు. 1) 70 శాతం పైగా తేటతెలుగు పదాలను వాడిన సాహిత్యాన్నే తెలుగు సాహిత్యంగా గుర్తించాలి, గౌరవించాలి. 2) తేటతెలుగు లిపిలో రాసిన రచనలను typographical పొరపాట్లుకావు, అది అదికార బాష spellingగా గుర్తించాలి. ఈ రెండు మార్పులతో తెలుగు సమాజం ముందడుగు వేయడాన్ని ఎవరు ఆపలేరు. నేను చేసిన సలహాలు పాటించకపోతె కొత్త సంవత్సరములలో మనము దిన పత్రికలలో చదివేది 45 శాతం సంస్కృతపదాలు, 45 శాతం ఇంగ్లీషు పదా లు, 10 శాతం మాత్రమే తేటతెలుగు పదాలు. అది తెలుగు బాష అని చెప్పుకోవడం సిగ్గుచేటు. 20వ శతాబ్ది ఆరంబంలో గ్రాందిక, వ్యవహారిక బాషా వాదాలు జరిగిని. 21వ శతాబ్ద ఆరంబంలో తెలుగు లిపిలో రాసిన సంస్కృత పదాలు, తెలుగు లిపిలో రాసిన ఇంగ్లిషు పదాల మద్య వాదాలు జరిగే అవకాశం వున్నది. ప్రపంచంలో ఎనమిది కోట్ల మంది తెలుగు బాష మాట్లాడెవారు ఉన్నారు. అతి ఎక్కువగా మాట్లా డే బాషలలో తెలుగు బాష పన్నెండవ రాంక్. తెలుగు బాషారక్షకులు, మరి మీరేమంటారు?
(రచయిత ప్రామాణికంగా ఉన్న భాషా విధానం మీద, లిపి మీద చర్చ చేసి, ఆ మేరకు లిపిని ఆయన వాదానికనుగుణంగా రాశారు. ఉదాహ రణకు సాధారణంగా భాష అని రాసేదానిని బాష అని రాశారు. అలాగే సంస్క్రుతం, ఆంద్ర, ప్రబావం, బ్రమ, దురద్రుష్టం వంటి పదాలను రచయిత ఈ వ్యాసంలో తనదైన వాదం నేపథ్యంలో రాశారు. వ్యాసంలో ఉన్నవి అచ్చులు తప్పులు కాదు. గమనించగలరు.)

తెలుగు లిపి, తేటతెలుగు లిపి బేదాలు:
తెలుగు లిపి అక్షరాలు (56)
అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ,... ఎ, ఏ, ఒ, ఓ, ఔ, క, ఖ, గ, ఘ, చ, ఛ, జ, ఝ, ఞ, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, క్ష, ఱ, సున్న(ం), విసర్గ (ః), రుత్వం (ృ).....
తేటతెలుగు లిపి: అక్షరాలు (37)
అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఓ, ఔ, క, గ, చ, జ, ట, డ, ణ, త, ద, న, ప, ఫ, బ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, క్ష, సున్న (ం)
తొలగించిన అక్షరాలు (19)
ఋ, ౠ, .... ఖ, ఘ, ... ఛ, ఝ, ఞ, ఠ, ఢ, థ, ధ, భ, ఱ, విసర్గ(ః), రుత్వం, (ృ) .....తొలగించిన అక్షరాల స్తానంలతో ఏ అక్షరాలు వాడాలి ఉదాహరణలు:
Removed Substitution Examples
letter(s) letter
ఋ, ౠ ర రిషి, రుగ్వేదం
-- ల
ఖ క ముక్యం, కడ్గం
ఘ గ గంట
ఞ న లేక ణ విగ్నానం లేక వాగ్ణానం,
శాస్త్రగ్న్యులు లేక శాస్త్రగ్ణ్యులు
ఛ చ చందస్సు
ఝ జ జాన్సి
ఠ ట కంటం, పాటశాల
ఢ డ డంక
థ త కత, పరిస్తితి
ధ ద దర్మం, దనస్సు
భ బ బాష, బయం
ఱ ర బర్రె
విసర్గ (ః) హ దుక్కం లేక దుహక్కం
రుత్వం (ృ) కొమ్ము, ర వత్తు మ్రుగం, క్రుష్ణుడు
‘తెలుగు’ను ‘టెలుగు’ అని ఇంగ్లీషులో రాస్తాము. కారణం ఇంగ్లీషులో ‘త’ హల్లు లేదు. అంత మాత్రాన ఇంగ్లీషు వారు ‘త’ హల్లును వారి బాషలో కొత్తగా కల్పించలేదు. అలాగే మనం సంస్క్రుత, ఇంగ్లీషు పదాలను తప్పక అరువు తెచ్చుకోవలసిన పరిస్తితి ఏర్పడితె, మనం ఆ పదాల ఉచ్చారణ తెలుగు లిపిలో ఇమిడి పోయేలా మార్చు కోవాలి. కాని అలా అది జరగలేదు.

ఫేస్ బుక్

Tweets

లంకెలు