మృత్యోర్మా


జీవమున్న కామెంట్లకు స్వాగతం,
స్వంత తలతో కువకువ లాడుతున్న అభిప్రాయపు పిట్టలకు సుస్వాగతం.
ఎప్పటినుండో వాసన కొడుతూ ముతక వాసనేస్తున్న మృతభావాలను నాకు తోకలా అంటించకండి.
స్వయం చలనం లేని, కాపీ పేస్టు మార్చురీ డబ్బాలను నా ముంగిట పడేయకండి.
మోహ మాటపు ఆలింగనంతో మురికి కొంచెం అంటించకండి.
బొటన వేలు ఎత్తింది కొరియో గ్రఫీ కోసమయినపుడు,
నా గ్రాఫిటీ గ్రాఫులో సిస్మోగ్రాఫు ఆనందంతో ఎందుకు కదలాడుతుంది.
మన్ను తిన్న పాములా మొద్దునిద్రపోతుంది.
పెకెత్తితే తల కనిపిస్తుందనుకుంటే మాత్రం బుస్సుమంటూ వాడుకలోని థాంక్సుని బంతాటాడుతుంది.
ఒక్కనిప్పురవ్వయినా రగులుకోనపుడు,
ఉరికొచ్చిన ఉత్తేజమైనా ఉస్సురంటూ నిస్తేజమవుతుంది.

ముగ్గులకోసం ముస్తాబయిన నా వాకిట్లో
అరిగించుకోవటం కుదరని అక్షరాల వాంతితోనూ,
పాతబడి పాకుడు పట్టిన వ్యర్ధ పదార్ధాలతోనో,
అడ్డదిడ్డంగా నింపేసిపోతావు.
లేదంటీ మరీ నావే రెండు లైన్లు నామోహాన కొట్టేసిపోతావు.
మరీ మోహం వాసినపుడు మందు అదే నని చదువుకున్న వాడిలా.
వాసి నాసిరకమో కాదో ఈ రాశిమద్యన లెక్కపెట్టుకుంటూ
కళ్ళు తెరవకుండానే అందాన్ని వర్ణిస్తే,
ముక్కుముక్కుమూసుకునే గుబాళింపు వుందంటే.
నిజం ఎప్పుడూ తప్పిపోతుంటుంది.

https://www.facebook.com/groups/kavisangamam/permalink/545777512141672/
► 18-04-2013

కామెంట్‌లు