Wednesday, 10 April 2013

వెలుతుర్లు నిండుతున్న వేళ

పండుగ వల్ల సంతోషం వస్తుందా? 

సంతోషాలు పల్లవిస్తే  పండుగ అవుతుందా ?

నాకిప్పటికీ సందేహమే.

కేలండర్ గళ్లలో గానీ  మహత్మ్యం వుందా ?

మనసు గుడులలో ఈ మహత్కార్యం జనిస్తుందా?

నాకింకా సందేహంగానే వుంది.

చుట్టూ పరుచుకున్న వెలుతురు వెన్నెల

ఎక్కడి నుంచి వస్తోంది?  బహుశా బయటి నుండైతే కాదు.

ఏదో ప్రవహిస్తోంది మనుషుల మద్య.

ఒకరినుండి ఒకరికి ఒకటే సందేశాన్ని మోసుకుంటూ,

దారంలా దూరాలను అల్లుకుంటూ

ఎక్కడా ఆగకుండా జీవనదిలానే వుంది.

ఎవరీ జీవ జలపు జన్మస్థానాన్ని సృజించింది?

రోజూ భూమి అలాగే తిరుగుతోంది.

సూర్యుడు ఉదయిస్తున్నాడు,

వెలుతురూ చీకటీ ఆస్తుల పంపకంలో కూడా పెద్ద తేడా లేదు.

కానీ ఎందుకో ఈ రోజుమొత్తం అందమైన రంగులా పరుచుకుంది.

చెమ్కీలను అద్దుకుంటూ ఆప్లిక్ వర్క్ చేసుకుంది.

అద్దుతోంది నేనా ? నువ్వా ? మనమా ?https://www.facebook.com/groups/kavisangamam/permalink/542592289126861/


ఫేస్ బుక్

Tweets

లంకెలు