చుక్కల్ని కలపాలి

అక్కడ
గుల్లబారి లేదు.
ఇంకేందుకు అసలు ఖాళీలేం లేవు.
తెగబిగిసిన బీడు తోవ

అందుకే ఆర్ధ్రత
కష్టమైనా ప్రవహిస్తుండాలి.
బండబారటాల మీదుగా
గుండెవాలు వైపుగా

అప్పుడప్పుడైనా 
స్వంతంగా నిర్మించబడు
ముసుగులూ, రంగులూ అశాశ్వతం
చిరిగిపోవటమో కరిగిపోవటమో

అంటే కోప్పడతావుకానీ
ఆకలి దయాళువు
మనసుకైనా సరే
అజీర్తే ప్రమాదం.

మొదలెట్టాం కదా అని
నడిస్తూ పోతే చాలదు
నిలేసినా పర్లేదు సరిచూస్తూ నడూ
లక్ష్యపు దిశ మారకుండా.

ఇక్కడసలు 
చల్లదనం లేదు
కనీసం
నిట్టూర్పులైనా తగ్గించుకోవాలి.

ఇలానే పిపీలికం
పీలికలవుతుంటే
కుట్టుసూది గుచ్చుకోవాలి.
నొప్పిని కొంచెం నచ్చుకోవాలి

చుక్కల్ని కలిపితేనే
చిత్రంలో స్పష్టతొస్తుంది
ఆకాశంలో అవకాశపు
చుక్కలైనా ఓ రోజు అందుతాయి.

https://www.facebook.com/groups/kavisangamam/permalink/580537588665664/




కామెంట్‌లు