జాతీయములు

• "జాతీయములు" లేదా జాతీయాలు ఒక జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు.

• ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. 

• మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. 

• వేటూరి ప్రభాకర శాస్త్రి, నేదునూరి గంగాధరం, బూదరాజు రాధాకృష్ణ వంటి సంకలనకర్తలు అనేక జాతీయాలను అర్ధ వివరణలతో సేకరించి ప్రచురించారు.


• ఆంగ్ల భాషలో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు.

• జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిద్దుకొన్న భాషా విశేషం.

• ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్ధం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్ధం వేరు.

• ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్ధం "ఎముక లేని చేయి.

• అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్ధం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని.

• జాన్ సయీద్ అనే భాషావేత్త చెప్పిన అర్ధం - idiom as words collocated together happen to become fossilized, becoming fixed over time.

• అనగా తరతరాల వాడుక వలన భాషలో కొన్ని పదాల వాడుక శిలావశేషంగా ఘనీభవించింది. కనుక భాషతో పరిచయం ఉన్నవారికే ఆ భాషలో ఉన్న జాతీయం అర్ధమవుతుంది.

• "నీళ్ళోసుకోవడం", "అరికాలి మంట నెత్తికెక్కడం", "డైలాగు పేలడం", "తు చ తప్పకుండా" - ఇవన్నీ జాతీయాలుగా చెప్పవచ్చును.

• జాతీయాలు సంస్కృతికి అద్దం పట్టే భాషా రూపాలు అనవచ్చును.



జాతీయములు
     
 ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ 
త, థ ద, ధ 
ప, ఫ బ, భ 
   
   
 క్ష 


సౌజన్యం : వికీ పిడియా, మరియు 
Telugu Prapancham

కామెంట్‌లు