కంప్యూటర్లలో తెలుగు వాడకం ఎలా ?


కంప్యూటర్లో తెలుగు-తెలుగు వెబ్‌సైట్లు
తెలుగు భాష దుస్థితికి కర్ణుడి చావుకున్నన్ని కారణాలున్నాయి.కంప్యూటర్లో తెలుగు వ్రాయడం ఎలా? అని ఇప్పటికీ చాలా మంది అడుగుతున్నారు.సాంకేతిక నిపుణులు కంప్యూటర్ లో ,ఇంటర్ నెట్లో తెలుగు వాడకాన్ని పెంచే సులభ సాధనాలు ప్రవేశపెడుతూనే ఉన్నారు.వారందరికీ మనం మనం రుణపడిఉన్నాం.ఇప్పుడు తెలుగుని చాలా సులువుగా టైపు చెయ్యవచ్చు.విండోస్ ఎక్స్ పీ లో తెలుగులో ఎలా పనులు చెయ్యవచ్చో నాకుతెలిసిన విషయాలు మీకూ తెలియజేస్తాను.

విండోస్ XP లో తెలుగును స్ధాపించడం:

1 :Start Menu లోకి వెళ్లి Control Panel క్లిక్ చెయ్యండి
2:Control Panel నుండి Regional and Language Options క్లిక్ చెయ్యండి.
3: Regional and Language Options Dialog లోని Languages టాబ్ లోకి వెళ్లి Install files for complex script and right-to-left languages ని ఎంచుకుని Ok నొక్కండి. reboot చేసిRegional and Language Options Dialog లో Languages టాబ్ Text Services and input languages లో details నొక్కండి.
4:Text Services and input languages Dialog లో Settings టాబ్ లో Installed Services విభాగంలోని Add బటన్ నొక్కండి.
5: Add Input Language Dialog నుండి Telugu ఎంచుకొని Ok నొక్కండి.
6: Text Services and input languages Dialog లో Settings టాబ్ లో Preferences లో Language Bar ని నొక్కండి.
7:Language Bar Settings లో Show the Language bar on the desktop ని ఎంచుకోండి.
8: Language Bar లో Teluguను ఎంచుకుని మీకు కావలసిన చోట తెలుగులో టైపు చేసుకోండి. 

విండోస్ ఎక్స్ పీ లో కాంప్లెక్స్ స్క్రిప్ట్ లని ఎనేబుల్ చేసుకోటం:
* http://omicronlab.com/download/tools/iComplex_2.0.0.exe నుండి గానీhttp://omicronlab.com/download/tools/iComplex_3.0.0.exe నుండి గానీ ఫైల్స్ డౌన్ లోడ్ చేసుకుని మీ సిస్టమ్ లో ఇన్ స్టాల్ చేసుకోండి.

కంప్యూటర్లో తెలుగులో రాసే పరికరాలుః

లేఖిని --http://lekhini.org/
గూగుల్ ఇండిక్ లిప్యంతరీకరణ --http://google.com/transliterate/indic/telugu
క్విల్ పాడ్ --http://quillpad.com/telugu/#
స్వేచ్ఛ – http://swecha.org/input/index.html, http://atcweb.atc.tcs.co.in/opensource-downloads
యంత్రం --http://www.yanthram.com/te/
లిపిక్.ఇన్ -- http://lipik.in/telugu.html
ఇన్ స్కిప్ట్ -- http://telugublog.blogspot.com/2006/03/xp.html
బరహా -- http://www.baraha.com/download.htm
అను మాడ్యూలర్ -- http://crossroads.koodali.org/2007/11/18/typing-unicode-telugu-using-oth...
అను ఆపిల్ -- http://crossroads.koodali.org/2007/12/25/apple-keyboard-layout/
అక్షరమాల -- http://groups.google.com/group/aksharamala
జనగణమన --- http://www.janaganamana.net/TeluguJgm.aspx
లినక్స్ లో -- http://www.swecha.org/wiki/index.php?title=Input
TDIL --http://www.ildc.in/Telugu/TLindex.aspx
Microsoft -Indian language input tool--నేరుగా తెలుగులోనే MS word,Excel లలో టైపు చేసుకోవచ్చు. http://specials.msn.co.in/ilit/Telugu.aspx
ఫైర్‌ఫాక్స్ బ్రౌసర్ లో తెలుగు :
• ఇండిక్ ఇన్‌పుట్ పొడగింత -- https://addons.mozilla.org/en-US/firefox/addon/3972
• పద్మ పొడగింత -- https://addons.mozilla.org/en-US/firefox/addon/873
• తెలుగు టూల్‌బార్ -- http://telugutoolbar.mozdev.org/
• ప్రముఖ్ టైప్ -- https://addons.mozilla.org/en-US/firefox/addon/pramukh-type-pad/ 

ఫాంట్లు:

అక్షర రూపాల్ని ఫాంట్లు అంటారు. బిట్‌మాప్ (Bit Map), ట్రూ టైప్ (True Type) , ఓపెన్ టైప్ (Open Type)ముఖ్యమైన రకాలు. ఈనాడు , వార్త , శ్రీలిపి , ఐ-లీప్ , అనుపమ,సూరి...ఇలా బోల్డన్ని ఫాంట్లు ఉన్నాయి.తెలుగు భాషలో మంచి ఫాంట్లు అభివృద్ధి చేశారు.అందమైన అక్షరాలు రకరకాల సైజుల్లో రూపొందించారు.డీటీపీ వాళ్ళంతా ఇన్నేళ్ళూ ఆ ఫాంట్లలోనే విస్తారమైన సాహిత్యం ముద్రించారు.అదంతా ఇప్పుడు యూనీకోడ్ లోకి మార్చాలన్నా ,తిరిగి యూనీకోడ్ లో టైపు చేయించటమన్నా తలకు మించిన భారం.ఊరికే అడిగితే ఎవరిస్తారు?కాబట్టి ప్రభుత్వమే ప్రజాదరణ పొందిన ఫాంట్లను కొని జాతీయం చెయ్యాలి.ఆయా ఫాంట్లన్నీ యూనీకోడ్ లోకి మళ్ళించేలా ఫాంటు మారకాల తయారీ కోసం పెట్టుబడి పెట్టాలి.నిపుణులను ఇందుకు నియోగించాలి.

ఇదంతా జరగాలంటే చాలాకాలం పడుతుంది.కాబట్టి అప్పటిలోగా ఆయా ఫాంట్లను ఆ పేపర్లనుండే డౌన్లోడ్ చేసుకొని,కాపీ చేసుకుని start-settings-control panel-fonts లోగానీ My computer> C > Windows > Fonts లో గానీ పేస్ట్ చేయండి.అప్పుడు మీకు ఆపత్రికలన్నీ చక్కగా తెలుగులో కనిపిస్తాయి.

ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంలో ప్రభుత్వం విడుదల చేసిన అక్షరరూపాలుఃhttp://teluguvijayam.org/gumi.html
వార్తా పత్రికలను భారతీయ భాషలలో చదవడానికి లేదా కన్ వర్ట్ చేయడానికి:http://uni.medhas.org/

లిప్యంతరీకరణ (ట్రాన్స్ లిటరేషన్) ఉపకరణాలు:
ఇవి మీరు ఇంగ్లీష్ లో టైపు చేస్తూ పోతూ ఉంటే, తెలుగు లోకి మారుస్తాయి. అంటే, "telugu" అని టైపు చేసి స్పేస్ కొట్టగానే "తెలుగు" గా మారుస్తాయి.
1. గూగుల్ ఇండిక్ ట్రాన్స్లిటరేషన్: http://www.google.com/transliterate/indic/telugu
2. క్విల్‌ప్యాడ్: http://www.quillpad.com/telugu/editor.html
3. లేఖిని http://lekhini.org/
లేఖిని ఉపకరణాన్ని offline కూడా వాడుకోవచ్చు. లేఖిని ని తిరగేస్తే నిఖిలే . తెలుగు చదవడం రానివారికి తెలుగు సందేశాన్ని నిఖిలే ఇంగ్లీష్ ఉఛ్ఛారణలోకి మార్చి పెడుతుంది.
http://lekhini.org/nikhile.html

4.పద్మ: వెన్ననాగార్జున గారి (vnagarjuna@gmail.com) పద్మ ఉపకరణం. పద్మ అన్ని భారతీయ భాషల్లోనూ కలిపి దాదాపు 80 ఫాంట్లను యూనీకోడ్ కి మార్చగలదు.http://padma.mozdev.org/.
5.హరివిల్లు: యూనీకోడ్ వెబ్‌పేజీని RTS లోకి మారుస్తుంది:http://plugins.harivillu.org/
6. అను2యూనికోడ్ : http://anu2uni.harivillu.org/ అను 6,7 లలో ఉన్న టెక్స్ట్ ను తెలుగు యూనీకోడ్ లోకి మారుస్తుంది.
7.ఈమాట: సురేశ్ కొలిచాల (suresh.kolichala@gmail.com) గారి Non-Unicode Font to Unicode Converter --http://eemaata.com/font2unicode/index.php5
Anu veekshanam,Anu rahamthulla version,Anu ATA souvenir version,Anu rangesh kona version,Tikkana లాంటి అను ఫాంట్ల ను తెలుగు యూనీకోడ్ లోకి మారుస్తుంది..
8. Unicode converter -
అనేక రకాల ఫాంట్లను తెలుగు యూనీకోడ్ లోకి మార్చే మంచి సాధనం .http://www.innovatrix.co.in/unicode/fileconverterindex.php5

అనువాద ఉపకరణం
http://translate.google.com/?sl=te&tl=en&q=%E0%B0%B8%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%97%E0%B0%A4%E0%B0%82#en/te/where%20is%20mother%3F తర్జుమా పరికరాల తయారీ ప్రారంభదశలో ఉంది గనుక కొన్ని తప్పులు వస్తున్నాయి.అనువాద ఉపకరణాలు, నిఘంటువులు, లెక్కకు మిక్కిలిగా రావాలి. ఆన్‌లైన్‌లోనూ ఆఫ్‌లైన్‌లోనూ వాటిని విరివిగా లెక్సికన్లు వాడుకునే సౌలభ్యాలు కలగాలి.
నిఘంటు శోధన

* http://www.shabdkosh.com/te/లాంటి నిఘంటువు బాగుంది.వాడుకోండి.ఏదైనా విషయాన్ని చెప్పటానికి తెలుగు పదం లేకపోతేనే ఇంగ్లీషు జోలికెళ్ళండి.మీకు తెలిసిన తెలుగు పదాలు నిఘంటువుకు జోడించండి.

* ఆంధ్ర భారతి "నిఘంటు శోధన" లో 18 నిఘంటువుల నుండి పదాలు వెతుక్కునే వీలుంది.ఉపయోగించుకోండి. http://www.andhrabharati.com/dictionary/index.php

తెలుగు మీడియంలో కంప్యూటర్‌ చదువులు
తెలుగు మీడియంలో కంప్యూటర్‌ చదువులు కూడా రావాలి. అలా చదివిన డిగ్రీ విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ప్రోత్సాహకాలు ప్రకటిస్తే తెలుగు చాలాకాలం బ్రతుకుతుంది.యంత్రానువాదాలకూ, లిప్యంతరీకరణకూ, విషయాలకు ఆకారాది సూచికలను తయారు చేయటానికీ, వెతకటానికి అనుకూలంగా తెలుగులో కంప్యూటర్‌ వాడకం పెరగాలి.

సజీవ వాహిని

సజీవ వాహిని నిర్వాహకులు తెలుగు భాషలో గొప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరికి వారే వెతుక్కునేలా మంచి వెబ్‌సైట్‌ రూపొందించారు.తెలుగు భగవద్గీతకు గానీ, తెలుగు కేతలిక్‌ బైబిల్‌కు గానీ, తెలుగు ఖురాన్‌కు గానీ ఇప్పటి వరకు ఇలాంటి సదుపాయం లేదు.http://sajeevavahini.com/telugubible అందరూ చూడదగినది. ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ మిగతా తెలుగు పుస్తకాలకు కూడా లభించేలా కృషి చేస్తే విషయాల పరిశీలన సులభం అవుతుంది. తెలుగు భాష శక్తివంతం కావాలంటే తెలుగులో వెలువడిన అనేక ముఖ్య గ్రంథాలకు ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ ఎంతో అవసరం. కాలంతో పాటు మనం కూడా మారాలి. తెలుగులో తయారైన పి.డి.యఫ్‌. ఫైలును కూడా నేరుగా యూనీకోడ్‌ లోకి మార్చగలిగే స్థాయి రావాలి.


అచ్చులోని తెలుగును యూనీకోడు గా అంతర్జాలం లో మార్చగల ఏమైనా ఓ సైటు గురించి తెలుసు కోవాలి అనుకొనేవారు ఈ రెండు ఉచిత తెలుగు OCR ను పరీక్షించవచ్చు ..కాక పొతే ఇది గుడ్డికన్నా మెల్ల మేలు అనుకొనేవారి కోసం

http://www.ocr-extract.com/
http://www.i2ocr.com/free-online-telugu-ocr



Download iComplex from here : 


Courtesy : నూర్ బాషా రహంతుల్లా ,డిప్యూటీ కలక్టర్ ,విజయవాడ 
ఫోన్. 8886634577 ,9948878833 email:nrahamthulla@yahoo.com

కామెంట్‌లు

  1. తెలుగు ప్రజోపయోగకరమైన టపా!తెలుగును ప్రేమించేవాల్లందరూ మెచ్చుకోవలసిన టపా!కోటానుకోట్లు వృధా చేస్తున్న ప్రభుత్వం ఖతులను కొని జాతీయం చేయాలి!తెలుగు దురవస్థకు చాలావరకు రాష్ట్రప్రభుత్వమే ప్రధాన కారణం!చేయవలసింది సకాలంలో చేయకపోవడమే తెలుగువాళ్ళ తెలివిలేనితనం!తెలుగును ప్రేమించలేని తెగులుతనం తెలుగువాళ్ళలో దినదినం పెరుగుతున్నది!

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి