సెల్ ఫోన్ రేడియేషన్ : కొన్ని జాగ్రత్తలు

సెల్ ఫోన్లు వాడటం ఇవ్వాళ ఒక తప్పనిసని అవసరమైపోయింది. వాడుతూనే వాటిలో రేడియేషన్ గురించి కంగారుపడుతుంటాం. ఏయో ఫోన్ లు ఎంత రేడియేషన్ ప్రభావం ( స్పెసిఫిక్ అబ్జార్ ప్షన్ రేట్ లో కొలుస్తారు ) వుందో. ఈ వెబ్ సైట్ లో సెల్ మోడల్ ను ఎంటర్ చేసి తెలుసు కోవచ్చు.

http://sarshield.com/radiation-chart/

Specific absorption rate (SAR) is a measure of the rate at which energy is absorbed by the body when exposed to a radio frequency (RF) electromagnetic field; although, it can also refer to absorption of other forms of energy by tissue, including ultrasound. It is defined as the power absorbed per mass of tissue and has units of watts per kilogram (W/kg). SAR is usually averaged either over the whole body, or over a small sample volume (typically 1 g or 10 g of tissue). The value cited is then the maximum level measured in the body part studied over the stated volume or mass.

తెలిసినవే అయినా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వలన కొంతలో కొంత ఉపశమనం పొందవచ్చు.

1. తక్కువ రేడియేషన్ ప్రభావం ఉండే ఫోన్లనే కొనండి
వీలైనంత, అతి తక్కువ రేడియేషన్ విడుదల చేస్తూ, మీ అవసరాలను తీర్చ గలిగే దానితో మీ ఫోన్ ను మార్చుకోవడాన్ని పరిశీలించండి.

2. హెడ్ సెట్ ను లేదా స్పీకర్ ను ఉపయోగించండి
ఫోన్ల కంటే హెడ్ సెట్ లు అతి తక్కువ రేడియేషన్ ను విడుదల చేస్తాయి. సెల్ ఫోన్ హెడ్ సెట్ కు సంబంధించిన మార్గదర్శకాలను గమనించి, వైర్ తో ఉండే, లేదా వైర్‌లెస్ రకం హెడ్ సెట్ ను ఎంచుకోండి (ఎటువంటి రకం క్షేమకర మైనది అన్న విషయంపై నిపుణులు భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నారు). కొన్ని వైర్ లెస్ హెడ్ సెట్ లు తక్కువ స్ధాయి రేడియేషన్ ను తెంపులేకుండా విడుదల చేస్తూనే ఉంటాయి అందుచేత, మీరు ఫోన్ మాట్లాడనపుడు హెడ్‌సెట్ ను చెవిదగ్గరనుంచి తీసివేయండి. స్పీకర్‌ను ఉపయోగించి ఫోన్ మాట్లాడడంకూడా మీ తల రేడియేషన్ కు గురికావడాన్ని తగ్గిస్తుంది.

3. ఎక్కువ వినండి, తక్కువ మాట్లాడండి
మీరు మాట్లాడేటప్పుడు, సందేశాలను పంపేటప్పుడు కూడా మీ ఫోన్ రేడియేషన్ ను విడుదల చేస్తూ ఉంటుంది కానీ , మీరు సందేశాలను అందుకునేటప్పుడు మాత్రం కాదు. అందుచేత ఎక్కువగా వినడం, తక్కువగా మాట్లాడడం అన్నది మీరు రేడియేషన్ కు గురికావడాన్ని తగ్గిస్తుంది.

4. ఫోన్ ను మీ శరీరానికి దూరంగా వుంచండి
మీరు మాట్లాడేటప్పుడు (హెడ్ సెట్ తో గాని లేక స్పీకర్ తో గాని) ఫోన్ ను మీ శరీరానికి, అంటే ఛాతిభాగానికి, మొండేనికి దూరంగా వుంచండి , చెవివద్ద వుంచుకోవద్దు జేబులో పెట్టుకున్నా, లేదా బెల్టుకు తగిలించుకున్నా , మీ శరీరంలోని మృదువైన కణాలు రేడియేషన్‌ను తమలో ఇముడ్చుకోగలుగుతాయి.

5. మాట్లాడటం కంటే, సందేశాలను పంపడాన్నే ఎంచుకోండి
మౌఖికంగా కంటే, లిఖితపూర్వకంగా సందేశాలను పంపడానికి ఫోన్లు తక్కువ శక్తిని వినియోగిస్తాయి (అంటే తక్కువ రేడియేషన్). మీ చెవిదగ్గర ఫోన్ ను పెట్టుకుని మాట్లాడటం కన్నా లిఖిత పూర్వకమైన సందేశాలను పంపడం మీ తలను రేడియేషన్ కు దూరంగా ఉంచుతుంది.

6. సంకేతాలు (సిగ్నల్సు) బలహీనంగా ఉన్నాయా? అయితే ఫోన్ ను దూరంగా పెట్టేయండి
మీ ఫోన్ మీద తక్కువ గీతలతో సంకేతాలు కనిపిస్తున్నట్లయితే, సంకేతాలనందుకునే స్ధంబానికి (సిగ్నల్ టవర్) మీ సంకేతాన్ని చేరవేయడానికి అది ఎక్కువ స్ధాయిలో రేడియేషన్ విడుదల చేయడం జరుగుతోందన్న మాట. మీ ఫోన్‌లో సంకేతాలు బలంగా వున్నప్పుడే ఫోన్ చేయండి, లేదా అందుకోండి.

7. పిల్లల ఫోన్ వాడకాన్ని పరిమితం చేయండి
పెద్దలకంటె , చిన్న పిల్లల మెదళ్ళు రెండింతలు రేడియేషన్‌కు గురవుతాయి. అత్యవసరమైన పరిస్థితిలో తప్ప పిల్లల ఫోన్ వినియోగాన్ని పరిమితంచేయాలని కనీసం 6 దేశాలలోని నిపుణులు చేసిన సిఫార్సులతో ఇ.డబ్ల్యు.జీ ఏకీభవిస్తున్నది.

8. ‘రేడియేషన్ కవచాన్ని (షీల్డ్)‘ తీసివేయండి
యాంటెనా క్యాప్స్ , కీ ప్యాడ్ కవర్స్ వంటివి సెల్ ఫోన్ అనుసంధానత (కనెక్టివిటి) నాణ్యతను తగ్గించివేస్తాయి. అందువల్ల అలాంటి ఫోన్లు మరింత శక్తితో , మరింత రేడియేషన్‌తో పనిచేయవలసి వస్తుంది.

9. ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ ధిరపీస్ అనే ఆర్టికల్ లో డేవిస్. ఫోన్ ఉపయోగంలో బ్రెయిన్ లేదా శరీరానికి దూరం పెట్టడం సురక్షితమని తెలిపారు. స్మార్ట్ సెల్ ఫోన్ ల తో వచ్చే పుస్తకాలలో ఇస్తున్న హెచ్చరికలు సైతం ఫోన్ ను బ్రెయిన్ లేదా శరీరానికి దగ్గరగా వుంచవద్దని, లేదా పాకెట్ లో పెట్టవద్దని చెపుతున్నాయని ఆమె తెలిపారు


ఈ సైటు కూడా చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా వుంది.
http://www.electricsense.com/

కామెంట్‌లు