Who is ద కాట్రవల్లి

కష్టమే, నిజంగా కష్టమే
నిటారుగా నిలవటం
సూటిగా నడవటం
దుస్సాధ్యమే, దుర్లభమే
ముసుగేయక మనగలగటం
మురికంటక తినగలగటం,
దుస్సాహసమే, దురంతమే

2

నీకు కావలసింది నీదగ్గరకు రాదు.
నీవెళ్ళాల్సిన దారి నీకెప్పుడూకనపడదు.
మాచింగ్ మే దడ్ దడ్
గుండెదడను జేబులోని కార్డులూ, కాగితాలూ కప్పేస్తుంటాయి.
గాలివాటం చేర్చిన చోటునే గురిచూసి కొట్టానని బొంకు.
గాలికొచ్చి తగులుకున్నదే ప్రశంసాపత్రమనేందుకేమిటి జంకు.

3
దుమ్ములెత్తిపోసుకోవటం ఒక సచ్చు నిచ్చెనలాట,
నేను బ్యాడ్డయితే సరే నువ్వొట్టి వరస్టనేదే కొట్లాట మూలసూత్రం.
ఎంద చాటఇదే ఎన్నుకోవలసిన బాట.
టన్నుల కొద్దీ మాటలు బాటలలో ఎత్తిపోయి.
ఎంత పొల్లుంటే అంత విస్త్రుతంగా ప్రసరిస్తుంది.
ఎంత సొల్లుంటే అంత శాస్త్రోక్తంగా అంటుకుంటుంది.

4
కాస్కోనా మాస పత్రి
కూర్చున్న పీఠం ఎన్నిసార్లు విసిరేస్తున్నా
కావలించుకునే కావాల్ననుకుని కూచో
పడ్డావంటే లేచేందుకు ఐదేళ్ళకు పైగానే పడుతుంది.

5
కళ్ళలోకి కళ్ళు పెట్టిచూసే ఖాళీలేంలేవు.
ఆసనమో, ఆస్తులో,
ఆడగాలో వాటిని అష్టదిగ్భందం చేసేశాయి.
ఐటెమ్సేవీ దొరక్కపోవచ్చు కానీ నువ్వే పెద్ద ఐటంరాజా.
కళ్ళార్పకు, కునుకు తీయకు
24 X 7
X  365 సెలవులకే ఇక సెలవు
పనులేం ఆపాల్సిన పనిలేదు.
ఎరుకో, దోచుకో, దాచుకో
పగలే రంగుల కలలెన్నో కనేందుకు,
ఎదురు చూస్తున్న చోట్లెన్నో వున్నాయ్.

6
కానీ
రంగాలన్నీ సమసిపోయి
రంగులన్నీ వెలిసిపోయి
ఇలానే చివరికొచ్చే ఓ రోజుంటుంది.
సమాధానం చెప్పేందుకు మాత్రం సిద్దంగా వుండు.
ఎవరికో కాదు నీకే
అచ్చంగా నీకంటే నీకే.
ఇక ఈ మధ్యలో
కాట్రవల్లి ఎవరో కనుక్కుంటూ వుండు.

కవిసంగమం గ్రూపులింకు


కామెంట్‌లు