Sunday, 11 August 2013

ఉచిత సందేశాలతో విసుగెత్తి పోతున్నారోం దేవుడో

ఇంతకు ముందే ఉపయోగపడే సమాచారం ఇస్తామని పేరుపెట్టుకున్న ఓ ఫేసుబుక్ పేజిలో రావిఆకుల్తో సెల్లు బ్యాటరీ ఛార్జింగ్ అని 1,2,3,4, స్టెప్పుల్లో ఓ బొమ్మెట్టి యివరన ఇచ్చేశాడు. ఇంకేముంది. పెట్టి నాలుగ్గంటలు కాకముందే నాలుగు వేలకు పైన షేర్లు, మూడేలకు పైన లైకులూనూ (నిజమే లైకుకంటే షేర్ కోసం ఉరుకులెట్టేశారు) నాలుగు వేలమంది మరో నాలుగు గంటల్లో ఒక్కోక్కరూ కనీసం నలబై మందికి ఈ గజ్జి అంటిస్తారు. ఏంటీ తొందర ఏదో పెద్ద మహత్కార్యం చేస్తున్నట్లు. ఒక పాతసెల్లుకి రావాకులు పెట్టి ఛార్జింగ్ అవుతుందో లేదో ముందు చూస్కోరాదు. అంత ఓపిక లేక పోతే కనీసం దీని గురించి విశ్లేషించిన నిపుణులు ఏమంటున్నారని ఓ సారి సరి చూసుకుని పంచొచ్చు కదా. 


ఐదు తలల పాము కనపడిందంటాడొకడు, ఐదు సెకన్లలో షేర్ చెయ్యపోతే నీ బొంగు పగిలి పోతుందని బ్లాక్ మెయిల్ బెదిరింపు చేస్తాడింకొకడు. ఏం పోయింది వస్తే కామెంట్లు లైకులూ పోతే ఓ క్లిక్కు అనుకుంటారేమో ఇలాంటివైతే ఎడాపెడా పంచేస్తారు. 

మరికొంతమందికి సాంతం చదివే ఓపిక వుండదు నీళ్ళ బాటిల్ కార్లో వుంటే ఖచ్చితంగా ఆడవాళ్ళకి బ్రెస్టు కాన్సరని అదేదో డాట్టర్లు తేల్చేశారంటాడు. ఈయన గారి బుర్రలో ప్లాస్టిక్ మంచిదికాదు కదా అని అప్పటికే ఫీడ్ అయ్యి వుంటుంది. ఒక్క క్షణం కూడా ఆగకుండా ఫోస్టుచేసిపారేస్తారు. ఇప్పటికే ఏదైనా హోదా వున్నవారయితే పరిస్థితి మరీ దారుణం ఈయనే చెపుతున్నాడంటే నిజమే కదా అనుకునే వాళ్ళకిదో సర్టిఫికేట్ అవుతుంది.

ఏం చెపుతున్నారో చూడలేనప్పుడు కనీసం వదిలేయకుండా కొంతమంది రైటే నని నెత్తికెత్తుకోవడం మరికొంత మంది అది ఖచ్చితంగా తప్పే అనుకుని ఏదో ఒక కామెంటు పెట్టటం చూస్తుంటే అంత ఓపిక లేనపుడు ఇది మాత్రం ఎందుకు చేసారా అని జాలేస్తుంటుంది.
ఒక జాతియ నాయకుడి పుట్టిన రోజుకి మరెవరిదో ఫోటో పెట్టి శుభాకాంక్షలు చెపుతారు. కనీసం కామెంట్లో అది తప్పండీ అని చెప్పినా వారి మానన పోస్టు చేసింతర్వాత మళ్ళఅటుచూసే పని పెట్టుకోరు మరికొందరు.

1) వ్యక్తిగతంగా , రాజకీయంగా లేదా తామున్న రంగంలో గుర్తింపు కోసం కొందరు.
2) ప్రమాద కరమైన రహస్య సంకేతాలను గూడుపుటానీలనూ భద్రతా విభాగాల కళ్ళుకప్పి చేరవేసేందుకు ప్రయత్నించేవారు.
3) మేలు చేస్తున్నమనే బ్రమలో ఎడాపెడా నిర్లక్ష్యాన్ని విరజిమ్మే వారు మరికొందరు.
4) బక్తి, వెబ్, ఉత్తత్తుల బ్రాండింగ్ కోసం మరికొందరు.

వినదగు నెవ్వరు చెప్పిన ... విని నంతనే వేగ పడకండి.
ప్రాక్లికల్ సాధ్యమయితే చేసి చూడండి రిజల్ట్ నిజమయితేనే చెప్పండి అది ఉత్తమం.
కనీసం సెర్చ్ లో కానీ లేదా వీటి ఆగడాలను అరికట్టేందుకే తయారు చేసిన http://www.hoax-slayer.com/ లాంటి సైట్ల లోనూ సరిచూడండి.

మంచి చేయలేక పోతే పర్వాలేదు ... కనీసం చెడు చెయ్యకుండా వుండ గలుగుతాం.
ఉచితాన్ని అనుచితంగా వృధాచేయకుండా అగుదాం.

ఫేస్ బుక్

Tweets

లంకెలు