ఇక్కడెందరు అమ్మాయిలున్నారు ?

‘‘బాడీ పెయింటింగ్ అనేది ప్రత్యేక కళ. ఎందుకంటే ఇది కదిలే కళ’’ అంటారు జోహ చమత్కారంగా.

‘‘క్యాన్వాస్ మీద గీసిన కళ చిరకాలం ఉంటుంది. బాడీపెయింటింగ్ మాత్రం అలా కాదు. అది ఉండేది కొన్ని గంటలే. కానీ ఆ కళ ప్రభావం వేరు’’ అంటారు కూడా. పెయింట్ చేయడానికి ‘చర్మం’ అనే క్యాన్వాస్ బెటర్ అంటారు జోహ.
చిత్రానికి, వ్యక్తికి మధ్య సమన్వయాన్ని సాధిస్తూ జోహ సృష్టించిన ఎన్నో రూపాలకు ప్రకృతి స్ఫూర్తిగా నిలిచింది.

‘సీక్రెట్ ఆఫ్ ది గుడ్ వర్క్’ ఏమిటని అడిగితే జోహ ఇచ్చే జవాబు ఇది: ‘పని మీద ప్రేమ’.



ఈ విడియోలో మరింత స్పష్టంగా  ఈ విషయాన్ని గమనించవచ్చు

కామెంట్‌లు