Friday, 18 October 2013

అత్తారింటికి దారేది సినిమాలో అన్నమాచార్య కీర్తన : దేవ దేవం భజే

త్తారింటికి దారేది సినిమాలో ఒకటిన్నర నిమిషంపాటు నేపథ్యంలో వచ్చే పాట పాలక్కాడ్ శ్రీరాం గళంలో అందంగా వచ్చింది. మరో కంఠం రీటాది కూడా వినిపిస్తుంది.  పాటకి."దేవదేవం భజే" అని వినిపించే పల్లవి అన్నమయ్య రాసిన సంస్కృతకీర్తన. మిగతా చరణాలు రాసింది రామజోగయ్య శాస్త్రి గారు. సంకీర్తన పల్లవిని, మిగతా చరణాల్ని దేవిశ్రీప్రసాద్ జోడించిన తీరు చాలా బాగుంది.మనదైన భాష, సంస్కృతి, శాస్త్రీయ, జానపద గీతాల మీద ఎంతో అభిరుచి, కొంత అభినివేశం ఉన్న త్రివిక్రమ్ ప్రయత్నం వల్లనే ఇలాంటి మంచిపాట మనకి మరోసారి చేరువయ్యిందని చెప్పుకోవచ్చు.ఇది మనకు సినిమాలో వినిపించే పాట

దేవ దేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి రణపుంగవం (War expert/War Master , in this context "who can win the war...")
రామం దేవ దేవం భజే దివ్య ప్రభావం

వేల సుమ గంధముల గాలి అలలా
కలల చిరునవ్వులతో కదిలినాడు
రాల(Stone ) హృదయాల తడిమేటి తడిలా
కరుణ గల వరుణుడై కరిగినాడు

అతనొక ఆకాశం అంతెరగని శూన్యం
ఆవిరి మేఘాలే ఆతని సోంతం
అరమరికల వైరం కాల్చెడి అంగారం (Charcoal or burning substance.. )

వెలుగుల వైభోగం ఆతని నయనం
ప్రాణరుణ బంధముల తనువును పుడమిగ
నిలుపుట తన గుణం

దేవ దేవం భజే దివ్య ప్రభావం.

ఈ క్రింది చరణం సినిమా చివరిలో ఎండ్ క్రెడిట్స్ వచ్చేప్పుడు ప్లే అవుతుంది ఆడియో లో లేదు

ఆఆఆఅ...

కనుల తుది అంచునొక నీటి మెరుపూ..
కలలు కలగన్న నిజమైన గెలుపూ..
పెదవి తుది అంచునొక తీపి పిలుపూ..
సెగల ఏడబాటుకది మేలి మలుపూ..

భళ్ళున తెల్లారే తళ తళ తూరుపులా
వెలుగులు కురిసిందీ ఈ ఆనందం..
ఋతువులు గడిదాటే చెరగని చైత్రములా
నవ్వులు పూసిందీ ఈ ఆనందం..

జీవనల మాధురిగ మమతలు
చిలికెను మనసను మధువనం.

దేవ దేవం భజే దివ్య ప్రభావం
దేవ దేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి రణపుంగవం
రామం
దేవ దేవం భజే దివ్య ప్రభావం.

అన్నమాచార్య కీర్తనగా అసలు పాట ఇది(రాగం:ధన్నాసి ) (తాళం : )

దేవదేవం భజే దివ్య ప్రభావం
రావణాసురవైరి రఘుపుంగవం // రామం //

రాజవరశేఖరం రవికుల సుధాకరం
ఆజానుబాహుంనీలాభ్రకాయం
రాజారి కోదండ రాజ దీక్షాగురుం
రాజీవలోచనం రామచంద్రం // రామం //

నీలజీమూత సన్నిభశరీరం ఘన వి-
శాలవక్షం విమల జలజనాభం
తాలాహినగహరం ధర్మసంస్థాపనం
భూలలాధిపం భోగిశయనం // రామం //

పంకజాసన వినుత పరమనారాయణం
శంకరార్జితజనకచాప దళనం
లంకా విశోషణం లాలితవిభీషణం
వెంకటేశం సాధు విబ్ధ వినుతం // రామం //
యం.ఎస్. సుబ్బులక్ష్మి గారి గొంతులో ఈ పాట వింటారా??
మాంబళం సోదరీ మణుల కంఠంనుండి.. ఎస్వీబిసి ప్రసారాలలో భాగంగా
ముఖ్యమైన పదాలకు అర్ధాలు ఇలా వున్నాయి...దేవ దేవ: దేవదేవుడు
దివ్యప్రభావ: దివ్య ప్రభావుడు
రావణాసురవైరి: రావణాసురుని శత్రువు (రాముడు)
రణపుంగవ: ( యుద్ధరంగమునందు వీరుడు ) పుంగవ> పుంభవేత్ గవగుణాశ్రయీ>గవ>ఆవు... పౌరుష సంబంధమైన పురుష రూపంలో పుట్టిన సాధుగుణం గలవాడు.
భజే: భజింపుము


రాజవరశేఖర: రాజవరులలో ఉత్తముడు
రవికులసుధాకర: రఘువంశమనే సముద్రంలో ఉద్భవించిన సూర్యుడి వంటి వాడు??(సుధాకర: అంటే అమృతానికి నిలయుడు, కాబట్టి సముద్రుడు)
ఆజానుబాహు: పొడవైన చేతులు కలవాడు (నిలబడినప్పుడు చేతి వ్రేళ్ళు మోకాలికి తగులుతుంటే వాళ్లని ఆజానుబాహుడు అంటారు ట)
  • one whose hands reach to his knees, on who is longimanous.
నీలాభ్రకాయ: నీలాకాశం వలే నల్లని దేహం కలవాడు
రాజారి కోదండ రాజ దీక్షాగురు : రాజులకు శత్రువైన పరశురాముని శివధనస్సును విరిచి ఆతని గర్వము భంగము చేసినవాడు
రాజీవలోచన: రాజీవం అంటే నీలం రంగులో నున్న కలువ. అంటే నీలపు కలువ కన్నులు గలవాడు
రామచంద్ర: రామచంద్రుడు Also, a large fish called Cyprinus niloticus విశాలనేత్రమీనము.


నీలజీమూత సన్నిభశరీర : వర్షాకాలపు నల్లని మబ్బు (నీల జీమూత) తో సమానమైన (సన్నిభ) శరీరం కలవాడు
ఘనవిశాలవక్షం : గొప్ప విశాలమైన చాతీ కలవాడు
విమల : స్వచ్చమైన
జలజనాభ : పద్మమును నాభి (బొడ్డు) యందు కలిగిన వాడు
తాలాహి నగధరం (నగ హరం)-తాలా..బొటన వేలు మధ్యవేలు చాచినప్పుడు వచ్చే భాగం>ఆభాగం చేత నగ>పర్వతం(గోవర్ధనం)ధరించిన వాడు
ధర్మసంస్థాపన : ధర్మ సంస్థాపకుడు
భూలలనాధిప : భూదేవతను పాలించే అధిపుడు. (ఉభౌ యోగ్యావహం మన్యే రక్షితుం పృథివీమిమాం-అని వాల్మీకి రామాయణం) "అన్నమయ్య అన్ని కీర్తనలలో రామ,కృష్ణ,వెంకటేశాధి అవతారాలకు అభావం చూస్తాడు. 
 భూమి కి పతి ((సీత కూడా భూమి నుంచి పుట్టింది కాబట్టి- సీతాపతి)
భోగిశయ : భోగి అంటే పాము. శేషశయన అని అర్ధం .


పంకజాసనవినుత : పంకజము (పంకము అంటే బురద, జ అంటే పుట్టినది =పద్మము), పద్మాసనుడు బ్రహ్మ. బ్రహ్మగారిచే నిత్యము కీర్తింపబడేవాడు
పరమనారాయణ : నారాయణుడు
శంకరార్జిత జనక చాపదళనం : శంకరుని వద్దనుండి పొందబడిన జనకుని యొక్క దనస్సును ఎక్కుబెట్టినవాడు/విరిచినవాడు
లంకా విశోషణ  లంకను జయించిన వాడు
లాలితవిభీషణ : విభీషణుని రక్షించినవాడు
వేంకటేశం సాధు విబుధ వినుతం : సాధువులు, పండితులచే కీర్తింపబడే వేంకటేశుడు

( నేను పొరబడ్డ ముఖ్యమైన అర్ధాలను విపులంగా తెలిపిన మిత్రులు Narayana Sharma Mallavajjala గారికి కృతజ్ఞతలతో )

ఫేస్ బుక్

Tweets

లంకెలు