‘రీయూనియన్' గూగుల్ యూట్యూబ్ విడియో : మంచి విషయం తో ప్రభంజనం

గూగుల్ తన మార్కెటింగ్ వ్యూహంలో భాగంగానే చేసి వుండొచ్చుగాక కానీ ఈ ‘‘రీయూనియన్’’ విడియో నిడివి చాలా చిన్నది. కేవలం మూడున్నర నిమిషాలు మూడుగంటల సినిమాకంటే పెద్దవిషయాన్ని చెప్పినట్లు అనిపిస్తుంది. మనసున్న ప్రతిఒక్కరికండ్లలో నీళ్ళు సుడులు తిరిగి పెల్లుబికేలా చేసేసింది.

1947 లో భారత్ పాకిస్థాన్ లు విడిపోయిన తర్వాత వేర్వేరుగా ఇండియాలో, ఒకరూ పాకిస్థాన్ లో ఒకరు స్థిరపడిపోయిన ఇద్దరు మిత్రులు కలయిన దీనిలో ప్రధానాంశం. అడ్రసులు వెతుక్కోవటం, రూట్ మాప్ చూడటం, వేర్వేరు ప్రాంతాల వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడం లాంటి విషయాలలో గూగుల్ ఇప్పుడు ఎంతలా ప్రధానాంశం అయ్యిందో అండర్ కరెంట్ గా చూపించటం ముఖ్యంశమే అయినప్పటికీ.విడియో చూస్తున్నంత సేపు అది గూగుల్ కోసం యాడ్ లా కాకుండా మామూలు విషయమే అన్నట్లు నడుస్తుంది.




ఇక కథాంశానికి వస్తే....

మిస్టర్ మొహ్రా ముసలి తనం లో తన చిన్నప్పటి పాత జ్ఞాపకాలను మనవరాలు సుమన్ తో పంచుకుంటాడు.తన చిన్ననాటి ప్రాణ స్నేహితుడు యూసఫ్ గురించి చెపుతాడు.  పార్క్ గేటు ముందు గాలిపటాలను ఎగరేస్తూ ఆడుకునే వాళ్ళమని, తర్వాత యూసఫ్ వాళ్ళ స్వీట్ షాప్ లో జఝరియా స్వీట్ (ఇది కూడా భలే ఎన్నుకున్నారు, భారతీయ పద్దతిలో తయారు చేసే పాకిస్థానీ తీపి) తినే వాళ్ళమని చెప్పిన ఆధారాలు షాప్ అడ్రస్ ను గూగుల్ పట్టిస్తాయి. మొహ్రా 60వ పుట్టిన రోజు (లాజికల్ గా ఇది తప్పు ఎందుకో మీకు సులభంగానే తెలిసిపోతుంది) బహుమతిగా ఆ ఇద్దరు స్నేహితులనూ కలపాలనుకుంటుంది. సుమన్.

గుగుల్ సహాయంతో అడ్రస్, కాంటాక్ట్ వివరాలు కనుక్కుని ఫోన్ చేసి మాట్లాడుతుంది.( ఇక్కడ కూడా గూగుల్ చాట్ లాంటిది వాడి అతి కమర్షియలైజ్ చేయకుండా సహజంగా ఏంచేస్తామో అదే చూపగలగటం కూడా గూగుల్ గొప్పతనమే). యూసఫ్ మనవడు ఆన్ లైన్ టికెట్ బుక్ చేసి, ఢిల్లి వాతావరణం ఎలావుంటుందో గూగుల్ లో చెక్ చేసుకుని వస్తారు.

చివరికి ిఇంటి తలుపు కొట్టి ముందునిల్చున్న వ్యక్తి తన చిన్ననాటి స్నేహితుడే ననే విషయం తెలుసుకున్న విస్మయంలోంచి వచ్చిన ఆనందం. ఆ ఇద్దరు పెద్దవాళ్ళను కలపగలిగామన్న సంతృప్తినిండిన గర్వంతో సుమన్ కళ్ళు చెమ్మగిల్లటం ఖచ్చితంగా ప్రేక్షకులను కదిలిస్తుంది.

ఏమో ఇలా నన్నా పెద్దవాళ్ళ కోరికలకూ, జ్ఞాపకాలకూ విలువ వుంటుందనే స్పృహ పెరుగుతుందనే, యూట్యూబ్ లో ఈ విడియోను చూస్తున్న మిలియన్ల మిత్రుల సాక్షిగా అనపిస్తోంది.

ఎవరన్నారు మంచికి ఆకట్లుకునే స్వభావం లేదని......


This isn't the first time Google has used a heart-wrenching story from the subcontinent to advertise its products. You may remember the true story of an Australian man adopted from India who used Google Maps to reconnect with his birth family.

ఇటువంటి చక్కటి విడియో తయారు చేయటం యూట్యూబ్ కు ఇదే మొదటి సారి కాదు గతంలో మనసుని మెలిపెట్టే ఖండాంతర కథనం ఒకటి గతంలో తయారు చేసిన విషయం గుర్తుండే వుంటుంది. భారత దేశం నుంచి దత్తత వెళ్ళిన ఆస్ట్రేలియన్ గూగుల్ మేప్ ల సహాయంతో తిరిగి తన పుట్టిన గడ్డకు చేరుకోవడం అనే కధాశం ఇది. అలాగే అది కూడా అంతే కేవలం మూడు నిమిషాల మూడు సెకన్ల విడియో అంటే ిఇప్పటి విడియో కంటే 30 సెకన్లు తక్కువ.

కామెంట్‌లు

  1. "Google Search - Reunion" ఎంత గూగుల్ కి వ్యాపార ప్రకటనా చిత్రమైనా, కళ్ళ నీళ్ళు తెప్పించింది.నేనొక ఎమోషనల్ ఫూల్‌నేమో! తీసినాయన మంచి నటుల్ని ఎన్నుకుని చక్కగా తీశారు.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి