Thursday, 9 January 2014

హైదరాబాద్ రాతి నిర్మాణాలు : ఈ నల్లని రాలలో ఏ చరిత్ర దాగెనోహైదరాబాదు దాదాపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము మధ్యలో ప్రాంతములో ఉన్నది. ఇది దక్కను పీఠభూమిపై సముద్రమట్టము నుండి 541 మీ. (1776 అడుగులు) ఎత్తులో ఉంది. సముద్రమట్టానికి కొంత ఎత్తున ఉండి ఇంచుమించు సమతలంగా ఉన్న ప్రాంతాన్ని పీఠభూమి అని అంటారు. భారత్ లోని పెద్ద పీఠభూమి. ఈ పీఠభూమి దక్షిణభారతాన్నంతటినీ ఆక్రమించింది. దక్కన్ అనే పేరు ప్రాకృత పదమైన దక్ఖిన్, సంస్కృతపదమైన दक्षिणదక్షిణ నుండి ఆవిర్భవించిందట. దక్కన్ పీఠభూమి ఆంగ్లం లో Deccan Plateau అనీ ఇంకా ద్వీపకల్ప పీఠభూమి, మహాద్వీపకల్ప పీఠభూమి అనీ అంటారు. మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్రా, కర్నాటకలలో కూడా దక్కను పీఠభూమి విశాలంగా వ్యాపించి వుంది. ఈ ప్రాంతం భౌగోళికంగా ప్రపంచంలోనే నిలకడ కలిగి, అధిక ద్రవ్యరాశి గలది. అనేక పెద్ద నదులను కలిగివున్న ప్రాంతం.దక్కను పీఠభూమిలో భాగంగానే వున్న హైదరాబాదు ప్రాంతం అనేక రకాలైన శిలలతో కూడి వుంది. జియోలజిస్టుల పరిశీలన ప్రకారం వీటిలో 2500 సంవత్సరాలకు చెందిన రాళ్ళుకూడా వున్నాయి. విశృంఖలంగా రాతి క్వారీలు ఈ రాళ్ళను తవ్వి పారేస్తున్నాయి. నిరంతరం పెరిగే జనావాసాలు రాతికొండలను తొలచి సిమెంటు నిర్మాణాల చెదపట్టిస్తున్నాయి. హైదరాబాదు చరిత్రంటే మనుషులు నిర్మించిన కట్టడాలే కాదు. ప్రకృతి ప్రసాదించిన ప్రత్యేక అందాలు కూడా నని ఈ బండలు కుండబద్దలు కొట్టినట్లు చెపుతుంటాయి. పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న వీటి సహజసౌందర్యం నానాటికీ మసకబారుతోంది. 

Once Banjara Bhavan - House of Rocks now it is No more

రాతి సంపదను కాపాడాలనే ఉద్ధేశ్యంతో ‘సేవ్ రాక్ సొసైటి’ ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించింది. 1996 జనవరి 26న ఏర్పడిన ఈ సంస్థ శిలాసంపదను కాపాడడానికి కృషి చేస్తోంది. వారి కృషి ఫలితంగా కొంతమంది తమ ఇళ్ల నిర్మాణంలో అడ్డు వచ్చిన రాళ్లను అలాగే ఉంచి వాటిని అందమైన అలంకరణగా మార్చుకుని నిర్మాణాలు చేసారు. ఇలాంటి ప్రకృతి ప్రేమికుల ఉద్యమాల ఫలితంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న తొమ్మిది రాతి శిలలను ‘వారసత్వ సంపద’గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్, జర్నలిస్టు కాలనీ, దుర్గం చెరువు చుట్టూ ఉన్న ప్రాంతం, మాదాపూర్‌లోని శిల్పారామం పరిసరాలు, సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతం, హుస్సేన్‌షావలీ చెరువు- ఖాజాగూడా తదితర ప్రాంతాల్లో విధ్వంసం కాగా మిగిలినవి ఇప్పటికీ ఇవి శిల్పతోరణాలుగా మనకు దర్శనమిస్తాయి. వాటిలో కొన్ని ప్రకృతి శిల్పాల వివరాలు ఇక్కడ:


హిల్‌రాక్స్:జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీకి మధ్య నున్న దుర్గం చెరువు చుట్టూ విస్తరించి ఉన్న చిన్న కొండలను ‘హిల్ రాక్స్’ అంటారు. చెరువును ఆనుకుని ఉన్న పెద్ద కొండ పచ్చని చెట్లతో, ప్రకృతి శోభతో ఆలరారుతోంది. ఇక్కడ ఒకదానిపై ఒకటి పేర్చినట్టు కనిపించే రాతికొండలు అద్భుత సహజత్వానికి నిదర్శనాలు.

Hillocks around Durgam Cheruvu,
a lake situated between Jubilee Hills and Hitecity
రాక్ పార్క్:పాత బాంబే రోడ్‌లోని గచ్చిబౌలికి సమీపంలో సహజ సిద్ధంగా ఏర్పడిన శిలల ప్రాంతాన్ని ‘రాక్ పార్క్’గా ప్రకటించారు. రోజూ వందలాది మంది పర్యాటకులు దీనిని దర్శిస్తుంటారు.
ఎలుగుబంటి ముక్కు:హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ వెనుక భాగాన ఉండే శిలలు ఇవి. ఎలుగుబంటి ముక్కును పోలి ఉండి పలువురిని ఆకట్టుకుంటాయి.
Rock Park, Hillock
on Old Bombay Road, near Gachibowli

పుట్ట గొడుగుల రాక్:నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న ఈ శిలలు పుట్ట గొడుగును పోలి ఉంటాయి. చిన్న రాళ్లమీదా పెద్దరాయిని పనిగట్టుకొని పేర్చినట్టు అత్యద్భుత ప్రాకృతిక నిర్మాణంగా ఇవి అలరారుతున్నాయి.


Mushroom Rock inside
the University of Hyderabad Campus

క్లిఫ్ రాక్:ఒకదానిపై ఒకటి పేర్చినట్టు ఉండి గాలికి పడిపోతాయేమోనన్నట్లు కనిపించే ఈ శిల్పాలు జూబ్లీహిల్స్‌లోని రోడ్‌నెంబర్ 45, 46 మధ్య ఉన్నాయి.


Cliff Rock between Road No. 45 & 46, Jubilee Hills

మాన్‌స్టర్ రాక్:కొండలను తొలిచి నిర్మించుకున్న ఇండ్లమధ్య జూబ్లీ హిల్స్‌లోని ఫిలింనగర్ సమీపంలో ఉన్న రోడ్ నెంబర్ 70, 71 మధ్య ఇవి ఉన్నాయి.


Monster Rock near Film Nagar,
between Road No. 70 & 71, Jubilee Hillsy

తాబేలు రాక్స్:జూబ్లీహిల్స్‌కు సమీపంలో ఉన్న నంది హిల్స్‌లో తాబేలును పోలినట్టుండే ఈ అద్భుత శిల్పాలు కనిపిస్తాయి.
Tortoise Rock in
Nandi Hills layout near Jubilee Hills

టోడ్ స్టూల్ రాక్స్:జూబ్లీ హిల్స్ పక్కన బ్లూక్రాస్‌కు సమీపంలో ఉన్న ఈ శిలలు ఒకదానిపై ఒకటి పుట్టగొడుగుల్లా వంగినట్లు ఉండి పడిపోతాయేమోనన్న భ్రాంతిని కలిగిస్తుంటాయి.
Toadstool next to Blue Cross, Jubilee Hills


ఒబెలిస్క్ రాక్స్:జూబ్లీ హిల్స్ ప్రాంతంలోని రోడ్ నెం. 66లో ఏకశిలగా ఉన్న ఈ శిల నాలుగు పక్కల నుంచి ఒకే వరుసలో పైకిపోయే స్తంభంలా కనిపిస్తుంది.
Obelisk on Road No. 66, Jubilee Hills 

Sentinel Rock, near Moula Ali


ఇవేకాక పలు ప్రకృతి శిలలు ఎన్నో మనకు హైదరాబాద్ చుట్టుపట్ల కనిపిస్తాయి.

N. Luther's Rock extends into Rahul's Flat
on the first floor of the house.


Hamburger rock,Gachibowli

Pathar Dil Rock,Gachibowli


Skull Rock, HiTech City Phase II


United-We-Stand Rock Gachibowli

Mahakali Temple in Golconda Fort, built into the rocks


మీకు వీటి ప్రత్యేకతలను గురించి ఆశ్చర్యాన్ని కలిగించే నిజం తెలుసా? దక్కను పీఠభూమిలో వున్న గ్రానైట్ రాళ్ళు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనవి.భూగర్భంలో కొన్ని రసాయనిక చర్యల వల్ల ‘మాగ్మా’ అనే లావాలాంటి ద్రవ పదార్థం భూమ్మీదకు వచ్చి కాలక్షికమంలో గట్టి పడి శిలలుగా మారుతాయన్నది శాస్త్రీయ ధృవీకరణ. ఇవి ప్రపంచంలోనే అరుదైనవనీ, అత్యంత దృఢమైనవనీ శాస్త్రజ్ఞులు స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న ఎన్నో అందాలొలికే రాళ్లు ‘ప్రకృతి ప్రసాదించిన అద్భుత శిల్పాలు’ అనడంలో సందేహం లేదు.


Geologists date these rocks 2,500 million years back. That is the time when the earth's crust solidified. Molten magma then pushed upwards from the interior and hardened under the crust into domes and sheets of granite. Horizontal and vertical cracks developed. When, slowly, the top layers of the crust eroded, and these very hard granites were exposed, they weathered over millions of years into their present forms. This happened along their horizontal and vertical cracks during - what is called - onion peel weathering (or spheroidal weathering), rounding the stones - and the bizarre formations resulted.
బంజారాహిల్స్‌ లోని  దేవిడి మెహిదీ నవాజ్ జంగ్‌కు చెందిన రాతి కట్టడంతో రూపుదాల్చి రాక్ హౌస్‌గా పేరొందిన బంజారా భవన్ ను ఈ మధ్యనే ప్రభుత్వం వారు కూల్చేశారు. అక్కడి రాళ్ళను చెక్కుచెదరనీయకుంటా వాటి ఒంపులకు అనుగుణంగా వాస్తును సరిచేసుకుని నిర్మించిన భవనం ఇది. బంజారాలు ఈ ప్రాంతంలో నివసించారు అనేదానికంటే ఈ బంజారా భవనమే బంజారా హిల్స్ పేరుకు కారణం అనికూడా చెపుతారు. ఇవే కాకుండా అనేక అందమైన ఆహ్లాదకరమైన రాతి రూపాలు, ఎవరో అబ్ స్ట్రాక్ట్ శిల్పి అందంగా మలచి నిలబెట్టినట్లు కనిపిస్తుంటాయి.
అత్యంత విలువైన, మరియూ కఠినమైన గ్రానైట్ నిల్వలున్న ప్రాంతం కావడంతో వ్యాపారులు దీనిని వివరీతంగా తవ్విపోస్తున్నారు.

హైదరాబాద్ లోని రాళ్ళ సౌందర్యాన్ని చూసేందుకు మీరూ ఒక రోజు వెచ్చించాలనుకుంటున్నారా?
ప్రతి మూడవ ఆదివారం సేవ్ రాక్స్ సంస్థనుండి అటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.


తెలుగు వివరణతో ప్రకృతి మిత్ర విడియో

ఫేస్ బుక్

Tweets

లంకెలు