తురుంఖాన్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?


నువ్వేమైనా తురుంఖాన్ వా? సాధారణంగా వాడే మాట ఇంతకీ ఈ తురుంఖాన్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది. చారిత్రక పురుషుడా పౌరాణికా పాత్రా అనే విషయాలను ఒకసారి చూద్దాం.

బ్రిటీష్‌పై తిరగబడ్డ పోరుబిడ్డ పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ సాహసానికి గుర్తుగా సంక్షిప్తంగా ఎదిరించి నిలబడే గుండెధైర్యానికీ హీరోయిజానికీ మారుపేరుగా తురుంఖాన్ అనే మాట ఈ నాటికీ నిలబడివుంది. కనీసం ఆ మాట వుండటం వల్ల చరిత్రను తవ్వి చూసుకునైనా ఆ వీరుడిని స్పురణలోకి తెచ్చుకుందాం.

భారత స్వాతంత్య్ర పోరాటవీరుడు, ధైర్యశాలి పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ పరాక్రమాలకు పెట్టింది పేరైన రొహిల్లా సైనిక పటాలానికి చెందిన నాయకుడు. ప్రఖ్యాతి చెందిన అరబ్బులు, రొహి ల్లాలు గల సైనిక దళానికి నాయకత్వం వహించిన తుర్రేబాజ్‌ ఖాన్‌, హైదరాబాద్‌ నివాసి పఠాన్‌ రుస్తుం ఖాన్‌ కుమారుడు. ఆయన బ్రిటీష్‌ సైన్యంలో చేరి ఔరంగాబాదు బ్రిటీష్‌ కంటోన్మెం టులో జమేదారుగా పనిచేశారు.

నిజాం నవాబు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీతో ఆర్థిక, వ్యాపార సంబంధ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. దీంతో సంస్థానంలో ఆయనకు తీవ్ర వ్యతిరేకత తలెత్తింది. 1857లో దేశంలో తొలి స్వాతంత్య్ర పొలికేక ‘సిపాయిల తిరుగుబాటు’ ప్రారంభమైంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని తుర్రేబాజ్ ఖాన్ స్వాతంత్య్ర పోరాటంలోకి దూకారు.భారతదేశమంతటా తిరుగుబాటు బావు టాలు ఆకాశవీధుల్లో రెపరెప లాడు తున్న రోజులవి. ఆ రోజుల్లో ధార్మిక పెద్దలు కూడా బ్రిటీష్‌ పాలకుల నుండి మాతృగడ్డను విముక్తి చేయమని యువతీ యువకులను, భారతీయ సైని కులను, స్వదేశీ పాలకులను ప్రోత్సహి స్తున్న వాతా వరణం. ఆ సమయంలో బానిసత్వం నుండి విముక్తికై పోరాడ మని మౌల్వీ సయ్యద్‌ అల్లావుద్దీన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ను ఉద్భోదిం చారు. ఆ ధార్మిక పెద్దల ప్రభావంతో ఫిరంగీలను హత మార్చమంటూ, హైదరాబాద్‌ నగరంలోని గోడల మీద ప్రకటనలు వెలువ డ్డాయి. ఆ వాతావరణానికి ప్రభావితులైన కొందరు నైజాం సంస్థానం పరగణాలోని బ్రిటీషు అధికారులను కాల్చివేశారు. ఈ విషయమై మాట్లాడేందుకు నిజాం అనుమతి కోరిన రొహిల్లా లను ఆయన బ్రిటీష్‌ అధికారులకు అప్పగించాడు. ఈ చర్యకు ఆగ్రహించిన మౌల్వీలు ధర్యపోరాటానికి పిలుపు నిచ్చారు. ఆ పిలుపును అందుకున్న పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ మాల్లిd అల్లావుద్ధీన్‌ సహకారంతో బ్రిటీష్‌ ఆధిపత్యానికి నిలయమైన హైదరాబాద్‌ రెసిడెన్సీ మీద ఐదువందల మంది సాహసికులతో 1857 జులై 17న దాడి చేశారు. ఈ దాడిలో పలువురు సహచరులను కోల్పోయిన ఖాన్‌, బ్రిటీష్‌ -నిజాం బలగాలకు 1857 జులై 22న పట్టుపడ్డాడు.

తిరుగుబాటుకు నాయత్వం వహించి ప్రజలను రెచ్చగొడు తున్నాడన్న నేరారోపణ మీద ఆయనకు ద్వీపాంతర వాస శిక్షను విధించి, ఆయన యావదాస్తిని బ్రిటీష్‌ పాలకులు స్వాధీనం చేసుకు న్నారు. తుర్రేబాజ్‌ ఖాన్‌ ను బంధిఖానాలో నిర్భందిం చారు.


బ్రిటీష్‌ పాలకులు విధించిన ఆ శిక్ష అమలు జరిగేలోగా సాహసవంతుడైన ఖాన్‌ తనకు కాపలాగా పెట్టిన సెంట్రీలలో
కూడా మాతృభూమి పట్ల గౌరవాభిమానాలను ప్రోదిచేసి 1859 జనవరి 18న జైలు నుండి తప్పించుకున్నారు. ఆయన తప్పించుకునే సరికి ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామంగా ఖ్యాతిగాంచిన తిరుగుబాట్లను బ్రిటీషు పాలకులు అణచి వేశారు. అయినప్పటికి తిరుగుబాటు నాటి స్ఫూర్తిని గుండెల నిండా నింపుకుని ఖాన్‌ పోరు కొనసాగించేందుకు ఆయత్త మయ్యారు. అది పసికట్టిన నిజాం ప్రభుత్వం తుర్రేబాజ్‌ ఖాన్‌ను సజీవంగా గాని నిర్జీవంగా గాని పట్టితెచ్చిన వారికి 1859 జనవరి 19న అయిదువేల రూపాయల నజరానను ప్రకటించింది. ఆనాటి కాలంలో ఐదు వేల రూపాయలు చాలావిలువైన నగదు నజరానా అంతటి నజరాను తుర్రేబాజ్‌ ఖాన్‌తలకు ఖరీదు కట్టారంటే పాలకులకు ఆయన ఎంతగా సింహస్వప్నం ఆయ్యాడో ఊహించవచ్చు.

ఈప్రకటనతో అప్రమత్తుడై రహస్యంగా తిరుగుతూ, బ్రిటీష్‌ సేనలపై తిరిగి దాడులను తుర్రేబాజ్‌ ఖాన్‌ శతవిధాల ప్రయత్నాలు చేయసాగారు. ఖైదు నుండి తప్పించుకున్న ఖాన్‌ను ఎలాగైనా పట్టుకుని అంతం చేయాలన్న పట్టుదలతో బ్రిటీషు సైన్యాలు-నిజాం సేనలు నిఘాను తీవ్రతరం చేశాయి.  చివరకు నిజాం నవాబు ప్రకటించిన నగదు బహుమతికి ఆశపడిన కుర్‌బాన్‌ అలీ అను నమ్మకద్రోహి తుర్రేబాజ్‌ ఖాన్‌ ఆచూకిని నిజాం సైనికులకు చేరవేశాడు. ఆ సమాచారంతో తుర్రేబాజ్‌ ఖాన్‌ మీద నిఘాను పెంచిన బ్రిటీష్‌ బలగాలకు 1859 జనవరి 24న మెదక్‌ జిల్లా పరిసర ప్రాంతాలలోని తుఫ్రాన్‌ గ్రామం వద్ద ఆయన ఉన్నాడని ఉప్పు అందింది. ఆ సమాచారంతో ఆఘ మేఘాల మీద తుఫ్రాన్‌ చేరుకున్న సైనికులు గ్రామం మీద విరుచుకు పడ్డారు. బ్రిటీష్‌ సైన్యాలు, నిజాం బలగాలు తుర్రేబాజ్‌ ఖాన్‌ ఉంటున్న ప్రాంతాన్ని చుట్టు ముట్టాయి. గతంలో చిట్టెలుకలా సైనిక బలగాల కళ్లల్లో మన్నుకొట్టి తప్పించుకున్న ఆయనకు ఈసారి అది సాధ్యం కాలేదు.

విజయమో- వీరస్వర్గమో తేల్చు కోవాల్సిన పరిస్థితి. చీమల దండులా వచ్చిపడిన శతృ సైనికు లను ఒంటరిగా నిలువరించ డం తుర్రేబాజ్‌ ఖాన్‌కు అసాధ్యమైంది. చివరకు బ్రిటీష్‌ సైనికులు ఆయనను చుట్టు ముట్టి నిరా యుధుడ్ని చేశాయి. శత్రువు కళ్లుకప్పి తప్పించుకునేందుకు ప్రయ త్నించారు. అది సాధ్యం కాలేదు. ఆ ప్రయత్నంలో జరిగిన పెనుగు లాటలో పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ జనవరి 24న శత్రు సైని కులు కాల్చి చంపారు. స్వదేశీ పాలకుల మీద ఆంగ్లేయుల పెత్తనానికి చరమగీతం పాడాలన్న లక్ష్యంతో ఆంగ్ల-నైజాం సైనిక బలగాల మీద అవి శ్రాంత పోరాటాన్ని సాగించిన తుర్రే బాజ్‌ ఖాన్‌ మృతదేహాన్ని తూఫ్రాన్‌ నుండి హైదరాబాద్‌కు తరలించారు. ఆ తరువాత తుర్రేబాజ్‌ ఖాన్‌ భౌతికకాయాన్ని సంకెళ్లతో కట్టేసి హైదరా బాద్‌ నగరంలో ప్రస్తుతం సుల్తాన్‌ బజారు పోలీసు స్టేషన్‌ ఉన్న చోట బహిరంగంగా వేలాడ దీసారు. ఆ భయంకర దృశ్యాన్ని చూసిన వారెవ్వరూ కూడా భవిష్య త్తులో ఇటు వంటి తిరుగుబాటుకు సాహసించ కూడదని పాల కులు కలలు గంటూ తమలోని క్రౌర్యాన్ని వెల్ల డించుకున్నారు.


బ్రిటీష్‌ సైనికుల గుండెల్లో భయోత్పాతం సృష్టించిన పఠాన్‌ తుర్రే బాజ్‌ ఖాన్‌ భౌతికాయం పట్ల కూడా ఆంగ్లేయులు, ఆంగ్లే యుల తొత్తులు కిరాతకంగా, అవమాన కరంగా వ్యవ హరిం చారు. ఆనాడు పరాయి పాలకులు కన్న కలలను కల్లు చేస్తూ, పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ల లాంటి స్వాతంత్య్ర సంగ్రామ యోధుల వారసత్వాన్ని స్వీకరించిన ప్రజలు, చివరకు ఆంగ్లేయ మూకలను మాతృ భూమి నుండి తరిమి గొట్టి అలనాటి త్యాగధనుల ఆకాంక్షలను నిజంచేశారు. ఈ క్రమం లో పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌, మౌల్వీ అల్లావుద్దీన్‌ తదితర యోధుల సాహసోపేత నాయకత్వంలో బ్రిటీషు రెసిడెన్సీ భవంతి మీద జరిగిన దాడి సంఘట నలకు గుర్తుగా, ఆ నాటి వీరయోధుల స్మారకార్థం, హైదరాబాద్‌ నగరం నడి బొడ్డున గల కోటిలోని సిటీ బస్‌ స్టాండు వద్ద స్వతంత్ర భారత ప్రభు త్వం 1957 లో ఓ స్మారక స్థూపాన్ని నిర్మించింది.కోఠి నుంచి ఆబిడ్స్ వరకూ వెళ్లే రోడ్డుకు ‘ఖాన్ రోడ్’గా నామకరణం చేశారు.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి