Thursday, 26 June 2014

పినిక్స్ అట్ ద ఫినిషింగ్ లైన్

అప్పడదేదో ఆటగెలిస్తే
వలువలొదిలేస్తానంటు ఒకరు
ఇప్పుడెవర్నో వదిలేస్తే
శరీరాన్నిచ్చేస్తానంటూ మరోెకరు.


వెలుతురు కావాలంటే
ఎక్కుతూ రావల్సిందే.
గోతుల్లో గగ్గోలుపై
వాలే మెరుపే శాశ్వతమా?

పంజరం చుట్టూ కిలోలకొద్దీ మాంసం
పొట్లంలా చుట్టిన రంగుచర్మం.
దీన్నంతా నడిపించే
ముఖ్యమైన దాన్నే మర్చిపోతే.

గురుత్వాకర్షణను రాల్చుకున్న విశ్వంలాగా
అంటిపెట్టుకోని అణువుల్లాగా
మొత్తం విడిగా వెదజల్లబడటమే....
‘కట్టు’ అనేదొకటి మిగిలే ఆశలేమీ
దోసిట్లో మిగల్లేదు.

బెట్టు అటు ఎత్తులోకే కాదు
ఇటు సాధించాలనే మత్తుకోసంకూడా.

నీవు నీవులుగా ముందుకు జరిగే పనికి
పెట్టుబడిశ్రమని మరిపించేలా
నరాలు తీగలు మీటుతూ
తీయని సంగీతంలాంటి మనసుకి తినిపించే ఆహారాన్ని
అజీర్తిగానో, సెమీవిషంగానో మార్చుకుంటే
ఇక
జరిగేదెలాగూ ముందుకయితే కాదు.

పాట్రియాటిజం రంగేసుకున్న ప్యాషన్
అగ్గిపెట్టెల్లోని నేతల కంటే
తేలికైన వస్త్రాలను నేస్తూ
హృదయాన్ని మాత్రం బరువెక్కిస్తోంది.

మేల్ చావనిజం కాదు
మేలనుకుంటేనే నిజం
నీవయినా నేనయినా
వేలాడుతున్న దారాలను వదిలేస్తే
ఎగిరేందుకు రెక్కలు రాలేదుగా
పడిపోవడమే మిగుల్తుంది.► 26-06-2014

***** ఈరోజు నైజీరియన్ పాప్ సింగర్ Adokiye మాటలకోసమే కాదు.
ఇండియన్ క్రికెట్ క్రేజ్ వెలుతురు పట్టుకోవాలనుకున్న పిట్ట పూనమ్ పాండె గురించీ మాత్రమే కాదు.

ఫేస్ బుక్

Tweets

లంకెలు