మిత్రులకు నమస్తే... బ్లాగులోకి సాదర స్వాగతం... ఇవి నాకు నచ్చినవి, నేను రాసినవీనూ.. మీ అభిప్రాయాన్ని చెపితే సంతోషిస్తాను

Friday, 15 August 2014

ఈ కాయలేమిటో మీకు తెలుసా?

వాక్కాయ or వాకల్వికాయ,పెద్ద కలివికాయ. లేకరక్కాయము వాకల్వికాయము చిరినెల్లికాయము చిల్లకాయ, కలింకాయ,KARONDA, Carissa spinarum, the Conkerberry , Bush Plum వీటిలో గులాబీ ఎరుపులో వుండే ఈ రకమే కాకుండా ఆకుపచ్చటి రకం కూడా వున్నాయి.

కలే చెట్టు వృక్ష శాస్త్రీయ నామం Carissa carandas. కలే చెట్టును కరండ, కలే కాయలు, కలేక్కాయలు, కలివి కాయలు అని కూడా అంటారు. ఇవి ఆంధ్రప్రదేశ్ లోని ఆన్ని ప్రాంతాల చిట్టడవులలో, కొండ ప్రాంతాలలో సహజసిద్ధంగా పెరుగుతాయి. ఈ చెట్ల పండ్లు తినవచ్చు. అడవులలో సహజసిద్ధంగా పెరిగే ఈ చెట్ల నుండి పండ్లు వానకాలంలో కొన్నిరోజులు మాత్రమే లభిస్తాయి. ఇది అపోసైనేసికుటుంబానికి చెందిన పుష్పించే మొక్క. ఇది బెర్రీ పరిమాణంలో పండ్లు ఉత్పత్తి చేస్తుంది, వీటిని సాధారణంగా భారతీయ ఊరగాయలు మరియు సుగంధ ద్రవ్యాలు లో ఒక రుచికోసం కలిపే పదార్థంగా ఉపయోగిస్తున్నారు. ఈ మొక్క కరువు పరిస్థితులను తట్టుకుని నేలల యొక్క విస్తృత శ్రేణిలో బాగా దృఢంగా పెరుగుతుంది.


కరండ హిమాలయాలలో 300 నుంచి 1800 మీటర్ల ఎత్తులో, షివాలిక్ కొండలలో, పశ్చిమ కనుమలు మరియు నేపాల్,శ్రీలంక, మరియు ఆఫ్ఘనిస్తాన్ లలో సహజంగా పెరుగుతుంది.

సాగు :రాజస్థాన్,బీహారు,గుజరాత్,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో కొందరు రైతులు వ్యవసాయపంటగా సాగు చేస్తున్నారు.

ఫేస్ బుక్

Tweets

లంకెలు