మైఖేల్ జోభీమ్ మేరీ రేమండ్స్ వల్ల మూసారాం బాగ్ పేరొచ్చింది

Post by Katta Srinivas.

బుధవారం (14-08-2014) సాయంత్రం Vasireddy Venugopal గారూ, Siva Racharlaగారూ Nanda Kishore నేను మూసారాం బాగ్ పేరుకు కారణం అయినటువంటి,
హిందువులు గొప్ప సాధువుగా భావించి మూసారాముడు గా చూసుకునేటువంటి,
ముస్లింలకు మూసారహీం గా అర్ధం అయ్యే లాంటి
పుట్టుకతో మైఖేల్ జోభీమ్ మేరీ రేమండ్స్
పిలుపుకి రేమండ్స్ అనబడే చారిత్రక వ్యక్తి నిద్రిస్తున్న చోటుని చూసొచ్చాం.
(25 September 1755 – 25 March 1798)
దిల్ షుక్ నగర్ నుండి మలక్ పేల వెళ్ళే రోడ్డులో టీవి టవర్ వున్న కొండ ప్రాంతం ఏరియాలో కోణార్క్ డయాగ్నాస్టిక్స్ నుంచి పైకి వెళితే కొన్ని చిన్న మెలికల తర్వాత కనిపిస్తుంది ఈ ప్రాంతం. ఆ బోర్డును కూడా తెలంగాణా ప్రభుత్వ చిహ్నంతో కొత్తగా రాస్తున్నారు కాకపోతే చాలా అక్షరదోషాలతో...
రెండవ నిజాం ప్రభువు నిజాం ఆలీఖాన్ దగ్గర కంట్రోలర్ ఆఫ్ ఆర్డినెన్స్ శాఖాధి పతిగా పనిచేసారు. ఈ ఆధ్యర్యంలో తుపాకులు కూడా సరిగా లేని ఆరోజుల్లో పిరంగులను వాడేందుకు కావలసిన ఏర్పాట్లను చేసారు. గన్ ఫౌండ్రీ నిర్మాత ఇతడే.
నిజాం మనసు గెలిచాడు. రేమండ్స్ మందుగుండు సామగ్రి తయారీలో సుశిక్షితుడు. అంతకంటే మిన్నగా గొప్ప స్నేహశీలి. ఐతే, దురదృష్టవశాత్తు.. 42 ఏళ్ల వయసులోనే, 1798 మార్చి 25న కన్నుమూశాడు. ఆ మహనీయుని గుర్తుగా రేమండ్స్ జ్ఞాపకాన్ని మలక్‌పేటలో, టీవీ టవర్ వెనకాల ఉన్న ఓ చిన్న గుట్టపై నిర్మించారు. 180 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పుతో ఒక చూడచక్కని కట్టడాన్ని సమాధి చుట్టూతా నిర్మించారు.


కామెంట్‌లు