నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రపక్షిగా కలివికోడి ?



► ప్రస్తుత రాష్ట్రపక్షి పాలపిట్ట కొన్ని ఇతర రాష్ట్రాల్లోనేగాక ఇతర దేశాల్లోనూ కూడా అధికార పక్షే. దానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో ప్రత్యేక(unique) అనుబంధమేదీ లేదు. కలివికోడిని మాత్రం అంతరించిపోయిందనుకుంటున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదట కనుగున్నారు. ప్రపంచంలోనే ఇది చాలా ప్రత్యేకత సంతరించుకున్న అంశం అయ్యింది

►కలివి కోడి ఉనికి ప్రమాదంలో పడింది కాబట్టి ప్రజల్లో దాని గురించి అవగాహన పెంచడం అత్యవసరం. రాష్ట్రపక్షిగా ప్రకటించినట్లైతే అది సులువౌతుంది.

► ప్రత్యేక పరిరక్షణ చర్యలు చేపట్టడం, ఆ దిశగా పరిశోధనలు చేయడం, అందుకవసరమైన నిధులు కేటాయించడం ప్రాధాన్యతాంశాలవుతాయి.

► 2006లో Bombay Natural History Society of India (BNHS)కు చెందిన ప్రతినిధి బృందం అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్.ను కలిసి కలివికోడిని రాష్ట్రపక్షిగా ప్రకటించమని కోరింది.


►వాళ్ల అభ్యర్థనకు వై.ఎస్.ఆర్. తనకు అభ్యంతరమేమీ లేదని, ఐతే గత ఇరవై యేళ్ళ కాలంలో కలివికోడిని చూసినవాళ్ళెవరూ లేరని, అసలు కలివికోడి పూర్తిగా అంతరించిపోయిందేమోనని తనకు అనుమానంగా ఉందని, అదే నిజమైన పక్షంలో ఇదంతా వృథాయే కాబట్టి కలివికోడి ఒక్కటైనా ఇంకా బతికే ఉందని నిర్ధారించగలిగితే తప్పనిసరిగా కలివికోడిని రాష్ట్రపక్షిగా ప్రకటిస్తానని చెప్పాడు.

► కలివికోడి అప్పుడైతే కనబడలేదు కానీ. 2009 ఆగస్టు చివరి వారంలో అదే BNHSకు చెందిన శాస్త్రవేత్తకు కలివికోడి కనిపించిందని వార్త వచ్చింది (ఆధారం: http://www.thehindu.com/news/national/article9721.ece).

తదనుగుణంగానే 2010లో రాష్ట్ర అటవీశాఖ కేంద్ర పర్యావరణ, అడవుల మంత్రిత్వశాఖకు పంపిన నివేదిక 20వ పేజీలో (Action 4.4: Medium priority, Medium urgency) ఒకటి నుంచి మూడేళ్ళలోపు కలివికోడిని రాష్ట్రపక్షిగా ప్రకటించాలని ప్రతిపాదించింది .

మూడేళ్ళేమిటి ఇప్పుడు నాలుగేళ్ళు గడిచిపోయాయి. రాష్ట్రం వేరయ్యింది. నవ్వాంధ్రప్రదేశ్ కొత్తనిర్ణయాలుతీసుకోవలసిన అవసరంలోకూడా వుంది

మరిప్పుడు దాన్ని రాష్ట్రపక్షిగా ప్రకటించడానికి ప్రభుత్వం ముందడుగు వేస్తుందా?

**** కలివికోడి గురించిన వివరాలను వికీలో చేర్చుతుంటే ఈ ఇంటరెస్టింగ్ సమాచారం దృష్టికి వచ్చింది..


Post by Katta Srinivas.

కామెంట్‌లు