జరా కాలా హోగయా

ఒక పండుటాకు
రంగుమార్పు సహించుకోలేక...
పచ్చరంగు పులుముకుంది.

తృణం తడారి తునక్కుండా,
పచ్చనోటు ఫణంగా పెడుతోంది.

కొత్త మొక్కలకు
ఎదిగే చిట్కాలు చెప్పకుండా
తనవైపే చూసుకుంటూ
తపనాసక్తతతో దహనమవుతోంది.

అటువైపు
చిరుమొక్కలన్నీ
భవిష్యత్ భావబీజాలనేరుకుంటూ.
నడకనేర్చుకుంటూ
పండుటాకువైపుగా అడుగులేస్తున్నాయి.

► 15-04-2015
కవిసంగమంలో 

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి