Friday, 18 March 2016

మరోరెండు వాంగ్మూలాలు

ఒకరాత్రి........జీవనవాక్యగమనంలో కామా కొసలు కత్తుల్లా గుచ్చుకుంటున్నాయని
ఆశలన్నీ సున్నాలా చుట్టి నున్నటి అంచులతో పుల్ స్టాప్ పెట్టేయాలనుకోవడం
పిరికితనమనే అంటారెందుకు?
మరణం కంటే జీవనమే ఎక్కువగా బాధించేదయినప్పుడు
నిరంతరం వర్షంలా పడే రాళ్ళదెబ్బలు కాచుకుంటూ
మట్టిదిబ్బలో దాక్కోవడాన్ని పారిపోవడం అంటారెందుకు?

అయినా ఎంతటి పారడాక్స్ ఇది
ధైర్యంతో కూడిన సాహసోపేతమైన ముగింపు గీతాన్ని
వినగల దమ్మున్నవాళ్ళెప్పుడో వెళ్లిపోయారు.
పిరికివాళ్ళ పొదుపు నత్తగుల్ల జీవితాల్లోంచి లైక్ లూ కామెంట్లు వస్తాయనుకోడమెంత వెర్రితనం.ప్రయాణపు చివరిమజిలీదాకా సీటుకు అంటిపెట్టుకుంటేనే మగాడేరా బుజ్జీ

ఇంతలేసి పసలేని పరుగుల్లో దిగేచోటు వెతుక్కోగలిగితే నేరమేనారా చిట్టీనీదారి నీది నాదారి నాది
నా రాతలో వాక్యాన్నెక్కడ ముగించాలో మీరంతా నిర్దేశించాలనుకునే

మహాస్వామ్యానికో అనంతకోటి నమస్కారాంజలులు

నన్నిలా వదిలేయండ్రాసామీ.మరొకరాత్రి..........కామాలో కత్తినే సమస్యల కోమా చివర్లు కోసేందుకు వాడలేక

సున్నాలా చుట్టుకుపోయి ఊరికే ఉరికే చక్రాలను విరగ్గొట్టుకున్నందుకు పిరికాడివి.

వర్షపుజడిలా కురిసే రాళ్లను నీ కోటగోడలుగా చేసుకోని

ఆనందపు జవరాళ్ళతో వినోదం చూడక దిబ్బలో పడుకోవడం పారుబోతుతనమే.

సాహసమూ, దమ్మూ ధైర్యం ముగింపు గీతానికి ముందువాయిద్యాలు మాత్రమే

పాటంతా ముగిసాక కర్ణభేరులే కరిగాక మిగిలినదానినేదో చూడాల్సింది కూడా లేకుండా పోయినప్పుడు

నీకింకా పారడాక్స్ లే కనిపించడం పారలాక్స్ దోషం కాదట్రా.

నీకంటూ ఓ టిక్కెట్టున్నట్లే, దిగాల్సిన చోటులోనూ, వ..ర..కూ.....నూ పనికూడా వుంటుంది.

తోచినచోటల్లా తోచక దిగిపోతాననడం, జండరంటక తలటించుకోవలసినంత నేరంగా బెదరు.

వాక్యాలెప్పుడూ నీకోసమే వుండవు, అసలు భాషంతా కూడా చెప్పేవాడిదొక్కడిదే కాదు

వినేవాడూ వినాల్సిన వాడు దానిలో భాగస్వాములే

ఈ ముక్కెంకుకోరా అంటూ నీకిదే నా వినమ్రాంజలి
*** అక్షరమాలలో కచటతపలు పరుషాలు గజడదబలు సరళాలు
ఆలోచనలనో జీవనాన్నో కొంచెం సరళం చేసుకోవాలంటే మరికొంచెం లోతైన వివరణలు అద్దాల్సిందే మరి.

కవిసంగమంలో ప్రచురితం

ఫేస్ బుక్

Tweets

లంకెలు