కట్టా శ్రీనివాస్ || అద్వైతం ||


1.
బాల్కనీలోంచి 
చెత్తబుట్టలో ఏరుకుంటున్న దీనుడిని చూస్తూ
బ్రతికిపోయాన్రా దేవుడా
చెత్తలో ఏరుకునేంతలా పలచబరచలేదు
పదిసార్లు మొక్కుతున్నారు ఒకరు.
బాల్కనీ వైపు చూస్తూ
బ్రతికించావుపో భగవంతుడా నిన్నే చెత్తలో పడేసేంతగా
నన్ను మందంగా చేయలేదు.
చేతిలోది తుడుచుకుంటూ మరొకరు.
2.
అద్దాలు మూసిన కారులోంచి
మురికి వాడ పక్కగా వెళుతూ
వ్యధా జీవితం గడపాల్సి రానందుకు
గుండెలన్నీండా గాలిపీల్చుకుని
హమ్మయా అనుకున్నారొకరు.
ఖళ్ళున దగ్గుతున్న పుళ్ళుపడిన
తాతమ్మను తుడుస్తూ
హాయిగా నిశ్వాసించారొకరు
మనసు అద్దాలు మూసుకుని
షోపీసులా బ్రతకక మనిషిలానే వున్నందుకు.
3.
అభిప్రాయం బలంగా కుదిపేసినప్పుడల్లా
దిక్కులు చూస్తున్నానిప్పుడు

కామెంట్‌లు