హోళీ నాడు కలలు కలర్లో వస్తాయా? మనిషిని పెనవేసుకున్న రంగుల కథ

హోళీ నాడు కలలు కలర్లో వస్తాయా?
మానవుడితో చారిత్రక కాలమంతా పెనవేసుకున్న రంగులు ఆత్మీయత కురిపిస్తూనే వుంటాయి.

 


మనకి ఐదు జ్ఞానేంద్రియాలున్నా సర్వేద్రియానాం నయనం ప్రధానం అనేంతగా లోపటికి చేరే జ్ఞానంలో సగానికి పైగా కంటితోనే గ్రహిస్తూ వుంటాం. సివి రామన్ ద్వారా మన దేశానికి అందిన నోబెల్ బహుమతి ఈ కాంతిలోని రంగుల రహస్యాన్ని విస్పష్టంగా విప్పిచెప్పినందుకే కదా. సూర్యుడినుంచి వెలువడే కాంతి తెలుపే అనుకుంటాం నిజానికి అందులోనే అన్ని రంగులూ నిక్షిప్తం అయివున్నాయి. కాంతిలో నాలుగు వందల నానో మీటర్ల నుంచి ఏడువందల నానో మీటర్ల వరకూ వ్యాపించి వున్న VIBGYOR లోని రంగులని నింపుకున్న ప్రపంచం వరకూ మాత్రమే మనం చూడగలుగుతున్నాం. వి కి ముందున్న ఆల్ట్రా వైలట్ (అతినీలలోహితం) కానీ, ఆర్ కి తర్వాత వున్న ఇన్ఫారెడ్ (పరారుణ) కానీ ఆ తర్వాతి రంగులు కానీ మనం చూడనే లేము. తినే ఆహారంలో అన్ని రంగులూ వుంటాలంటారు. కూరలూ, కూరగాయలు రూపంలో. చూసే ప్రపంచంలోనూ అన్ని రంగులూ గమనిస్తు వాటి పునఃసృష్టి చేయాలనుకుంటాం. అవే రంగులతో చూసే ప్రపంచంలోని అనుభవాలనూ అనుభూతులను తిరిగి సృష్టించాలనుకుంటాం. అదే ప్రపంచాన్ని మరింత అందంగా మార్చాలనీ అనుకుంటాం. ఈ ప్రయత్నం ఇప్పటిది కాదు. ఈ రంగుల హోళీ మానవ జీవితంలోకి చొచ్చుకు రావడం కాదు నిజానికి పెనవేసుకుపోయింది.

 


ఆదిమానవుడు పంటలూ వంటలూ లేని కాలంలో సైతం రాళ్ళతో లేళ్ళనో మరో జంతువులనో వేటాడుకునే కాలంలో ఖాళీ సమయంలో తలదాచుకున్న గుహల రాతి గోడలపై ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు, ఆకుపచ్చ రంగులను వేర్వేరు షేడ్స్ లో చిత్రించాడు. అదికూడా మన ఈ కాలం నాటి ఆసియన్ ఆఫ్రికన్ పెయింట్స్ సైతం రెండు మూడేళ్ళకే వెలిసిపోతుంటే వేల లక్షల ఏళ్ళ క్రితం అతని చేతితో గీసిన గీతలు ఇప్పటికి మిగిలి వుండేలా గీయగలిగాడు. తెలంగాణ గుహలపైని రంగులను ఇంతకు ముందు చెప్పుకున్న రామన్ స్పెక్ట్రో స్కోపీ పరిక్షలోనే పరిశీలించి చూస్తే తన పరిసరాల్లో హేమటైట్ మాగ్నటైట్ రాళ్ళను కొవ్వులు మరికొన్ని ఇతర పదార్ధాలలో మేళవించి గీసినట్లు అర్ధం అయ్యింది. బహుశా ఆకుపసర్లు బొగ్గుముక్కలు, సుద్దరాళ్ళతో మరెన్నో గీసినవి పోగా ఇవి మనకిలా ఇప్పటిదాగా మిగిలి వుంటాయి. మట్టిపూసలు, కాల్చిన కుండలు, లోహాలు గాజు ఇలా వర్వేరు దశల్లో మానవుడి అభివృద్దితో రంగు వెంటాడుతూనే వుంది.

 


నీలిమందు అవును మనం చేతులకు పెట్టుకునే గోరింటాకు ఫ్యామిలీకే చెందిన మరో మొక్క 17వ శతాబ్దం వరకూ బట్టలపై తన ప్రత్యేకతను చాటుకుంది. అసలు ఇండిగోని విస్తారంగా అందించే దేశంగా ఇండియా అనే పేరుకు దారితీసిందట. విదేశీ వ్యాపారులు మన దగ్గర పండించిన పత్తిని ఇక్కడే దారాలుగా మనవాళ్ళ చేతనే వడికించి, ఇక్కడే నేతకార్మికులు బట్టను నేస్తే, మరో పక్క నీలిమందు పంటను పండించి దానినుంచి రంగులు తీసి, చక్కటి అచ్చులతో బొమ్మలు చేసి వాటిని వస్త్రాలపై అద్ది బేళ్ళకు బేళ్ళు ఓడలకు ఎత్తి పంపించారు. చంపారన్ ఉద్యమం ఒక్కటి చాలదూ ఈ రంగంలో పోటీ ఎంత వుందో తెలపడానికి. ఛింజ్ కూడా మరో రకం రంగు. కాకపోతే కృత్రిమ రంగులు తయారీ ఊపందుకున్న తర్వాత ఈ సహజ రంగుల పరిశ్రమలు కనుమరుగైపోయాయి. గోల్గొండ నుంచి మచిలీ పట్నం ఓడరేవుకు వేళ్లే దారిలోని నాగులవంచలోనూ 1687లో ఇటువంటి నీలిమందు పంటపండిచే ఊర్లో డచ్ వారికి వ్యతిరేఖంగా ఒక పోరాటమే జరిగింది.

జుట్టు రంగులకి ఎంత ప్రపంచ మార్కెట్ వుందో కానీ, చర్మం రంగుల ఆధారంగానే ప్రపంచాధిపత్యానికి కొలతలు ఏర్పడటం బ్రిటీష్ వాళ్ళ వంటి బలుపు తెలుపు ముందు భారతీయులు నల్లవాళ్ళుగా అవమానించబడటం రంగుల కేళీయే కదా.

ఆఖరికి విశ్వం కోలతలు తీసుకునేప్పుడో సూర్యుడూ నక్షత్రాలూ జీవిత కాలం కొలిచేటప్పుడో వాటినుంచి వెలువడే రంగులే కొలతలు శ్వేతకుబ్జతార నుంచి అరుణ బృహత్తారగామారడం వైపుగా జరిగే ప్రయాణాలు విశ్వం జీవితకాలానికి సూచికలు.

రంగులను మనిషెప్పుడూ తేలికగా తీసుకోడు తీసుకోలేడు

లేదంటే రంగు పడుద్ది.

నేను కొన్ని రంగుల ముచ్చట్లు మర్చిపోయే వుంటాను. వీలైతే గుర్తుచేస్తూ మరిన్ని రంగులు కలపండి.

మీ

కట్టా శ్రీనివాస్

కామెంట్‌లు

  1. QuickBooks is most Famous Software for that can help small businesses manage their finances this software and you can connect at
    Quickbooks Customer Service +1 877-693-1115

    రిప్లయితొలగించండి
  2. If this is in fact the case, then dialing Quickbooks Customer Service +1 855-885-5111,CA. will automatically send all of these issues up to a dedicated QuickBooks help desk that can answer any questions and allow your company to move forward.

    రిప్లయితొలగించండి
  3. QuickBooks is the most recommended and widely used accounting software which helps you get your work done easily and efficiently. This software comes with a customer service team that is active 24/7, so you can get answers for any sort of QuickBooks Customer Service question. You can contact them by dialling +1 888-471-2380.

    రిప్లయితొలగించండి
  4. Thank you for this informative post it contains very good knowledge and helps me a lot also check out this Infertility Treatment In Faridabad

    రిప్లయితొలగించండి

  5. This looks very good it contains very good knowledge and helps me a lot keep doing this work also check out this Best Fertility Clinic In Faridabad

    రిప్లయితొలగించండి

  6. What a wonderful blog it really helps me a lot to understand new things keep doing this work also check out this IVF Centre In faridabad

    రిప్లయితొలగించండి
  7. Thanks for sharing this article, it was excellent and very informative. keep it up. You have to go through with - Best Laparoscopy Surgeon in Allahabad

    రిప్లయితొలగించండి
  8. Excellent work dear buddy, I am extra impressed with this blog article. some of content is good and some is not. need to work on. For more - Best Gynecologist in Allahabad

    రిప్లయితొలగించండి
  9. It was a great work experience with you. Your article is very interesting for us. we love write more about you. Read more - Best Pediatrician in Allahabad

    రిప్లయితొలగించండి
  10. This is looking fine. we feel glad to show our interest with you. Thank for sharing a fantastic blog. I would recommended to follow us - Best IVF Services in Delhi

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి