మిత్రులకు నమస్తే... బ్లాగులోకి సాదర స్వాగతం... ఇవి నాకు నచ్చినవి, నేను రాసినవీనూ.. మీ అభిప్రాయాన్ని చెపితే సంతోషిస్తాను

Friday, 12 October 2012

లోకపు కాకులు


తలోంచితేఅతివినయం ధూర్తుడవంటుంది.

తలెత్తితే
తలబిరుసు మూర్ఖుడవంటుంది.

నవ్వితే
నాలుగు విధాల చేటంటుంది.

మానితే
నలభై రకాల చేదంటుంది.

కదిలినా, మెదిలినా
బతికినా, చచ్చినా
తన కనుసన్నల కొలతలేనా అని సరిచూస్తుంది.

పాడులోకం
అనదలచుకున్నాక
నీ పనిలో తర్కాన్నేమీ చూడదు.

ఓ లకుముకిపిట్టా
నీవే న్యాయమూర్తివి
నడుస్తూఫో...

నడమంత్రపు మాటలకు
విలువనిస్తూ కూర్చోకు.
అడుగుపడే ప్రతిదశలోనూ
మనసునడగటం మరువకుంటే చాలు.
తీరైన నడతలుగా మలచుకుంటే మేలు.

పనంటూ పూర్తయితేనే
కొలతలకు అర్ధం
ప్రయత్నాన్ని మాన్పించే
పలుకులకు విలువేమిటి ?
http://www.facebook.com/groups/kavisangamam/permalink/456017034451054/

ఫేస్ బుక్

Tweets

లంకెలు