కాటమరాజు కథ - తెలుగు ఉపవాచకము - 8వతరగతి (1985)

ఎందరో వీరాధివీరుల గాథలు కాలగర్భంలో కలసిపోయాయి.కానీ జానపద గేయాల్లో అటువంటివి కథావస్తువులుగా నిలిచాయి.అలాంటి వాటిలో పదమూడో శతాబ్దికి సంబంధించిన వీరోచిత గాథ కాటమరాజు కథ 

కాటమరాజు యాదవరాజు. ఇతడు నెల్లూరి సమీపాన గల కనిగిరి ప్రాంతాలను పాలించాడు. ఇతని కోట కనిగిరిదగ్గర పంచలింగాల కొండ దిగువన ఉండేది. ఇతడు మహాపరాక్రమ సంపన్నుడు. ఏడు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే తండ్రి పగదీర్చటానికి కాటమరాజు వాలికేతు రాజును సంహరించి విజయం సాధించాడు. ఇతనికి విస్తారమైన పశు సంపద ఉండేది. కాటమరాజు "ఆవులమంద కుదిరితే ఆరామడ, చెదిరితే పన్నెండామడ" అని ప్రతీతి. పద్మరాఘవుడు కాటమరాజు మంత్రి. అతనిని పద్మనాయకుడని కూడా అంటారు. తన భుజబలానికి పద్మనాయకును నీతి బలం తోడు కాగా కాటమరాజు నేర్పుతో రాజ్యం చేశాడు. అతడి పశుసంపద మూడు పూవు లారుకాయలుగా అభివృద్ధి చెందింది.

ఒకప్పుడు వానలు లేక కరువుకాటకాలు కనిగిరి సీమను పీడించాయి. పచ్చలు పొదిగినట్లున్న పచ్చిక పట్టులన్నీ వాడివత్తయి పోయాయి. పశువులు మేతకై వెంపరలాడ మొదలు పెట్టాయి. ఆవులు, ఎద్దులు, కోడె దూడలు, లేగలు, అన్నీ మలమల మాడిపోతున్నాయి.బక్కచిక్కి పోయాయి.డొక్కలు వెన్నుకంటుకొని పోయాయి. ఈ స్థితిని చూచిన కాటమరాజు కడుపు చెరువయింది.రంపంతో కోసినట్లు ఏదో చెప్పరాని బాధ. తన మంత్రి పద్మనాయకునితో కర్తవ్యం ఆలోచించాడు. "నెల్లూరి సీమలో పచ్చికబీళ్ళు, అడవులు విస్తారంగా ఉన్నాయి. నెల్లూరి ఏలిక నల్లసిద్ధిని ప్రార్థించి అక్కడి పచ్చిక బయళ్ళలో ఆలమందల్ని మేపుతూ గండం గడపవచ్చు. అందుకు ప్రతిగా ఏటా మనం కొన్ని కోడెదూడల్ని రాజు కివ్వవచ్చు" నని పద్మనాయకుడు తెలిపాడు. కాటమరాజుకు ఈ ఉపాయం నచ్చింది. వెంటనే అతడు నెల్లూరికి సపరివారంగా ప్రయాణమయ్యాడు. 

ఆనాటి నెల్లూరి ప్రభువు మనుమసిద్ధి కుమారుడైన నల్లసిద్ధి రాజు. నల్లసిద్ధి దగ్గర సేనాపతిగా ఖడ్గతిక్కన, ప్రధానామాత్యుడుగా చింకర్ల భీమినీడు ఉండేవారు. కాటమరాజు నల్లసిద్ధిని దర్శించి తమకు వచ్చిన ఆపదను తెలిపి సహాయం కోరాడు. నల్లసిద్ధిరాజు అందుకంగీరించి అనుమతి పత్రం వ్రాయించి కాటమరాజుకిచ్చాడు. అడవులలో, పచ్చికబయళ్ళలో పశువులను మేపినందుకు ప్రతి సంవత్సరం మందలోని కొన్ని కోడెదూడలను ఇవ్వాలన్నది అందులోని ఏర్పాటు. కాటమరాజు సంతోషంతో తిరిగి వెళ్ళాడు. 

కాటమరాజు ఆలమందలు పచ్చికమేసి బలిసినందువల్ల పాడికొరత తీరింది. కానీ అడవుల్లో జీవించే వారి భృతికి ఈ ఆలమందలు,వాటిని కాసేవారు అడ్డువచ్చారు. చిలకలు రొదచేస్తుండగా ఆవులు బెదిరి పోయాయి. వెంటనే వాటిని బాణంతో పడగొట్టాడు పద్మనాయకుడు.వాటిలో నల్లసిద్ధి రెండోరాణి కుందమాదేవి పెంపుడు చిలుక ఒకటి. ఇది తెలిసిన కుందమాదేవి గోవులను చంపండని ఆటవీకులను ఆజ్ఞాపించింది. ఇందుకు కుపితుడైన కాటమరాజు ఏడాది దాటినా నల్లసిద్ధికి పుల్లరి పంపలేదు. గోనష్టం జరిగిన విషయం నల్లసిద్ధికి తెలియదు.కానీ పుల్లరి చెల్లించవలసిందని రాయబారిగా ఒక భట్టును పంపించాడు. 

ఆ రాయబారి కాటమరాజు గుడారాలవద్దకు వెళ్ళాడు. నలభైనాలుగు స్తంబాల శిబిరంలో కాటమరాజు కొలువుదీరి ఉన్నాడు. భట్టుమాటలు విని "మీరాజు చేయించిన గోనష్టానికి మేము చెల్లించవలసిన పుల్లరికీ సరిపోయింది" పొమ్మన్నాడు.రాయబారం చెడినందుకు చింతిస్తూ భట్టు వెళ్ళిపోయాడు. కాటమరాజు పద్మనాయకునితో "రాయబారం చెడింది. నల్లసిద్ధి మనపై ఎప్పుడైనా దండెత్తవచ్చు. మనం యుద్ధానికి సిద్ధంగా ఉండటం అవసరం. మన వారందరికీ కమ్మలు వ్రాయించి యుద్ధ సన్నద్ధులై రావలసిందని కబురుపెట్టు" మన్నాడు. మంత్రి తగిన ఏర్పాట్లు చేయించాడు. 

రాయబారి తిరిగివచ్చి కాటమరాజు పుల్లరి చెల్లించ నిరాకరించాడని చెప్పగానే నల్లసిద్ధి ఉగ్రుడయ్యాడు. ముఖం జేవురించింది. కన్నులు నిప్పులు గక్కాయి. "పుల్లరి చెల్లించ నిరాకరించి కాటమరాజు కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. మనం మన మగటిమి చూపించవలసిన తరుణం ఆసన్నమైంది. రణరంగంలోకి దూకి మీ పరాక్రమాన్ని ప్రకటించండి" అని హెచ్చరించాడు. మంత్రి చింకర్ల భీమినీడు యుద్ధరంగంలో సాయం చేయవలసిందని కోరుతూ సామంత రాజులందరికీ లేఖలు వ్రాయించాడు. వెంటనే నెల్లూరి పరిసరాలు సైన్యాలతో నిండిపోయాయి. దండనాయకుడు ఖడ్గతిక్కన ఎర్రగడ్డపాటి యుద్ధభూమిలో కాటరాజు సైన్యాలను ఎదురించాడు. రెండు దళాలకూ సంకుల సమరమయ్యింది. ఖడ్గతిక్కన సైన్యమంతా నేలకూలింది. అతడు ఏకాకి. తిక్కన చింతించి మళ్ళీ సైన్యాలతో వచ్చి శత్రు నాశనం చేయవచ్చునని నెల్లూరికి తిరిగి పోయాడు. 

తిరిగి వస్తున్న తిక్కనను పౌరులు ఎగతాళి చేశారు. ముదుసలి తండ్రి సిద్ధన "పగరకు వెన్నిచ్చి పిరికి పందలా పారి వచ్చావు. నీ బ్రతుకు వ్యర్థ" మని తూలనాడాడు. భార్య చానమ్మ భర్త స్నానం కొరకు మంచం అడ్డుగా ఉంచి పసుపుముద్ద నీళ్ళ పెరటిలో పెట్టింది. "ముగురాడువారమైతిమి" అని వెక్కిరించింది. తల్లి పుత్రునికి విరిగిన పాలిచ్చి "పశువులతోపాటు పాలుకూడా విరిగిపోయాయి" అన్నది. ఈ నిందలు భరించలేక ఖడ్గతిక్కన సైన్యసమేతంగా వెళ్ళి మళ్ళీ తలపడ్డాడు. కాటమరాజు పక్షాన బ్రహ్మరుద్రయ్య అనే వీరుడు తిక్కనతో ఘోరయుద్ధం చేసి తిక్కనను చంపి తానూ చచ్చాడు. 

ఖడ్గతిక్కన మరణవార్త విన్న నల్లసిద్ధిరాజు అపారమైన సైన్యాలతో కాటమరాజును ఎదుర్కొన్నాడు. సంకుల సమరం జరిగింది. అపుడు కాటమరాజు కృష్ణుని అవతారంగా భావించిన బొల్లావును పూజించి నల్లసిద్ధి సేనలను తునుమాడమని ప్రార్థించాడు. బొల్లావు ఎందరో శత్రువులను హతమార్చింది. అయితే నల్లసిద్ధి మాయోపాయంతో చంపించాడు. కాటమరాజు నిరుత్సాహపడ్డాడు కానీ అతని సేనలు వెన్నుచూపలేదు. వారిలో ఒకడైన బీరినీడు ఒకే దెబ్బకు మద్దిమాను నరికి తనకత్తికి పదును చూసుకొని నల్లసిద్ధి సైన్యాన్ని ఊచకోత కోశాడు. కానీ అతనుకూడా వీరమరణం పొందక తప్పలేదు. బాలవీరుడు పోచయ్య విజృంభించి పోరాడి వీరస్వర్గం చేరుకున్నాడు. కాటమరాజు సైన్యం బలహీనపడింది. 

అప్పుడు కాటమరాజు మంత్రాలోచనచేసి నల్లసిద్ధి సైన్యం పైకి ఆవులను, ఎద్దులను పంపాలని నిర్ణయించాడు. యాదవులు ఆవులను అశ్వాలపైకి, ఎడ్లను గజబలం మీదికి ఉరికించారు. అవికాల్బలంతో కూడా ఘోరయుద్ధంచేసి మరణించాయి. కాటమరాజు స్వయంగా నల్లసిద్ధిని ఎదుర్కొన్నాడు. వారి ద్వంద్వ యుద్ధం "దక్షుండు శంభుండు తారసిలినట్లు, రామరావణులు కదసినట్లు, మత్స్యంబు మొసలియు మల్లాడినట్లి, వారిధి వారిధితో, మేరువు మేరువుతో తాకినట్లు" జరిగింది. కాటమరాజు చేతిలో నల్లసిద్ధి నిహతుడయ్యాడు. అతని సైన్యం కాలికి బుద్ధి చెప్పింది. ఈ ఘోరరణం కాటమరాజు విజయంతో ముగిసింది. దీనికి యాదవుల భారత యుద్ధమని పేరు.

రిఫరెన్స్...

ఆరుద్ర నాటకం ‘కాటమరాజు కథ’ – ఒక పరిచయం

కామెంట్‌లు

  1. కాటమరాజు కథ అని పేరు వినడమే తప్ప అసలు కథేవిటో ఇప్పటివరకూ తెలియలేదు. మీరు సంక్షిప్తంగా చెప్పిన కథ బాగుంది. ఆరుద్రగారి వెర్షను వచనమా గేయమా? ఇది నిజంగా పాఠ్య పుస్తకంగా ఉందా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 1981 లో ముద్రించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర syllabus 8 వ తరగతి తెలుగు వాచకము లో కాటమ రాజు చరిత్ర syllabus లొ వుండేది. యాదవులు శ్రీ కృష్ణ వంశస్థులు. Ntr శ్రీ కృష్ణుని వేషం తో పాపులర్ అయ్యారు. శ్రీ కృష్ణుని వేషం వేసినందుకు యాదవులు అధిక సంఖ్య లో టీడీపీ కి అండ గా నిలిచారు. భవిష్యత్తులో యాదవులు తమ పూర్వీకులు గొర్రెల కాపరులు కాదని రాజులని తెలిస్తే యాదవులు చైతన్య వాంతులు అయ్యి సొంత పార్టీ పెట్టుకునే అవకాశం వుందని భావించి ntr govt అధికారం లోకి రాగానే ఆ syllabus నీ తొలగించారు.

      గూగుల్ లో మీరు ఆ బుక్ నీ డౌన్ load చేసుకోవచ్చు.

      తొలగించండి
  2. ధన్యవాదాలు నారాయణ స్వామి గారూ.
    ఆరుద్ర గారు పద్యనాటకం(స్టేజి నాటకం గా ప్రదర్శించేందుకు అనువుగా) రాసారు. పద్యాలు పెద్ద పెద్ద సమాసాలతో కాకుండా తేలిక పదాలతో సులభంగా అర్థమౌతూ ఉంటాయి. చక్కగా పాడుకోను వీలుగా ఉంటాయి. మచ్చుకో పద్యం చూడండి.

    సీస||
    మురదండ మేఘముల్ ముసిరి వచ్చుటలేదు
    ముంతపోతగా వాన ముంచలేదు
    దడదడ చప్పుళ్ళ దబ్బాటు వానలా?
    గొర్తి పదునుదాక కురియలేదు
    వర్షించు వేళలో వాగళ్ళు కనిపించి
    సింగిణి రంగులుప్పొంగలేదు
    ఎల్లంకి గాలులు ఏనాటి ముచ్చటో
    పీచరగాలైన వీచలేదు

    తే.గీ||
    కన్నెపిల్లలు కావిడికట్టె త్రిప్ప
    కప్పతల్లియు నోరెండి కన్నుమూసె
    వరుణదేవుని గుండెలు కరుగలేదు
    చేటు కాలము ప్రాప్తించె కాటభూప


    రచన: ఆరుద్ర
    రాసిన సంవత్సరం: 1961
    ముద్రణ: 1999
    ప్రచురణకర్త: స్త్రీశక్తి ప్రచురణలు, చెన్నై
    130 పేజీలు, 55 రూపాయలు.
    దొరుకుచోటు: విశాలాంధ్ర, కె.రామలక్ష్మి

    రిప్లయితొలగించండి
  3. తిక్కన సోమయాజి అన్న చరిత్ర నవలలో ఈ కథ అంతర్లీనంగా వస్తుంది. మనుమసిద్దికి ఏర్పడిన ఒకానొక సమస్యనుంచి కాపాడడానికి తిక్కన కాకతీయప్రభువైన గణపతిదేవుని దర్శించడం,రుద్రమదేవి అక్కడ 'యువరాజు ' గా సభలో పాల్గొనడం అన్నీ వర్ణిస్తారు రచయిత.

    ఇక యుద్ధం సంగతి- ఏ ఒక్క వర్ణనకూడా అతిశయోక్తులు లేకుండా ఉండదు.కానీ ఒక్కమాట. నవల వృత్తాంతం మొత్తం నెల్లూరి రాజ్యానికి అనుకూలంగానే నడుస్తుంది. పుల్లరి కట్టడానికి కాటమరాజు నిరాకరించడమే కాక,రాయబారిని అవమానించి పంపినట్లు,యుద్ధం అనివార్యమైపోయి, కాటమరాజు మాయోపాయంతో గోవుల్ని యూద్దరంగానికి పంపిస్తే ఖడ్గతిక్కన సైన్యాలు గోవుల్ని ఎదిరించకుండా ధర్మబద్ధంగా వాటిచేత నిహతులవ్వడం,ఖడ్గతిక్కన మహిమ వలన ఆయన్ని ఒక్క ఆవుకూడా ముట్టుకోక ఆయన చనిపోక మిగిలిపోతే ఆయన వెనక్కు మరలడం. ఆయన తల్లి,భార్య ఆయనకు ఆడవారికి చేసే స్నాన ఏర్పాట్లు చెయాడం. ఆయన వారికి జరిగిన సంగతి చెప్పి యుద్దానికి మిగిలిన సైన్యాన్ని సమీకరించి వెళ్ళడం. కాటమరాజు సైన్యాన్ని దునుమాడి ఆయనను కూడా సం హరించి ( ఖడ్గతిక్కనే )కాటమరాజు గురువైన ఒకానొక రుషి(?) ని కూడా చంపాలని వెళ్తే ఆయన తన దగ్గరున్న ధర్భ చేత ఖడ్గతిక్కన తల ఎగరగొట్టడం, ఈలోగా ఖడ్గతిక్కన విసిరిన ఖడ్గం చేత రుషి తల ఎగిరిపోవడం ఇలా ఉంటుంది యుద్ధ వృత్తాంతం. తిక్కన సరిగ్గా ఆ సమయంలో పెన్నానది ఒడ్డున ఓ ఆశ్రమంలో మహాభారత రచనకు అంకితమై ఉండడంవలన ఆయనకు యుద్ధసంగతులన్నీ తెలియవు. తెలిసేసరికే యుద్ధం ముగిసి అందరూ గతించి ఉండడం, చివరకు తిక్కన వానప్రస్థానానికి బయలుదేరిపోతారు.
    ఖడ్గతిక్కన కథ మాకు మూడవతరగతి తెలుగు వాచకంలో ఒక పాఠం.

    రిప్లయితొలగించండి
  4. విష్ణుస్వరూపమైన బొల్లావును మాయోపాయంతో చంపించారు సిద్ధిరాజులు. అలాంటివారు ఆవులని ఎదిరించకుండా ఉండి ఉంటారా అనేది సందేహాస్పదమే. ఖడ్గ తిక్కనని బ్రాహ్మణుడని కాటమరాజాదులంతా శిరసు వంచి నిలబడితే ఏం చెయ్యాలో తెలియక వెనక్కి వెల్తే, ఇంట్లో జరిగిన అవమానం వల్ల మళ్ళీ వెనక్కి వచ్చి కాటరాజు దళంలోని ఒక బ్రాహ్మణుడితో యుద్ధం చేసి అక్కడే చెల్లిపోయాడని జానపద కధ. యాదవుల ఆయుష్షు అరవైయేళ్ళు కావడం చేత, ఎర్రగడ్డపాటిలో అందరూ ఒరగను పంతమున్నదని పాపనూక(కాటమరాజు చెల్లెలు) పుట్టినప్పుడే తెలియడం చేత తెలిసే కాటమరాజు ఈ యుద్ధానికి వెళ్ళాడని పెద్దలు చెపుతారు. ఆర్లపెంట రణం లో గంగతో జరిపిన సంభాషణలో ఈ విషయం తెలుస్తుంది. మిగిలిన ఒకేఒక్క వారసుడైన అల్లుదాడెన్నని కొంత సైన్యం సహాయంగా ఇచ్చి కటకం పంపివేసారని చెపుతారు.

    ఇప్పటికీ వారందరికీ పిండప్రదానం చేస్తాము మేము. ముద్దలపోలు అని దాన్ని వ్యవహరిస్తారు

    రిప్లయితొలగించండి
  5. ekkada story chadivi spandinchina prathi v\okkariki na namskaralu ....

    nenu e katama raju ane story ni motaam telusukova;li anukuntunaa tanu maku divam ga cheptaruu peddaluu dayachesii, evridaggarina Katama raju ki sambhandinchi navalalu or kathalu unte naku mail cheyagalaru, meku telisinahta varaku cheppandi, anii kalipi oka pustam tayaru chesatanu. daya chesii naku sayam cheyanidi , mail cheyandi anandnetzone@gmail.com.
    Manohar garu meku kuda na dhanyavadhalu mem Raju ni divam ga pujistunaavu ganga devithooo kalipi pujistamuu, kani naku mottaam story telsukovalani undi, daychesi na mail ki reply and me daggara unde story pampandi plsss

    రిప్లయితొలగించండి
  6. EVRIKINA KATAMA RAJU GURINCHI STORY MOTTAM TLESI UNNA LEDAA BOOK ROOPAM LO UNNAA NAKU MAIL CHEYANDI OR contact me 9848262770
    anandnetzone@gmail.com

    రిప్లయితొలగించండి
  7. ChennuboinavenkateswarluannakatamarajuoriginalstoryniparishodimchamdibApanoducheppekattukataluvoddu

    రిప్లయితొలగించండి
  8. Yadavlumahaveerluamduloetuvamtisamdehamleedu britishvaadui ndiakirakapoteeindialoippatikiyadavrajulaparipalaneekonasagutumdeedikanibritishvadutelivigatanakuedurutirigina rajavamhalanuanagatokki

    రిప్లయితొలగించండి
  9. KATAMARAJU KATHALU...KATAMARAJU 17 VA THARAM VARASULU SWAMIJI RAMKISHANDEV JI (HIMALAYA BABA) IAS TRAINER .CONTACT 9059348483

    రిప్లయితొలగించండి
  10. KAMBHOJA
    KUNTHIBHOJA
    AAMBHOJA
    ANDHRABHOJA
    BHOJARAJA ?????

    రిప్లయితొలగించండి
  11. Kudirite Aaaramada(6 Amadas)
    Kadilite Pannendamadas (12 Amadas)
    Naluchedara Nalgu Amada (4 Amadas)
    Vedalpu Edu Amada (7 Amadas)
    AparaGoganam...Katamayya Raju Sampada...Himalayala Swamy
    9059348483

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి