షడ్డకుడు, సడ్డకుడు అంటే అర్ధం ఏమిటి? షడ్డకురాలు కూడా వుంటుందా?

షడ్డకుడు గురించి నిఘంటువులో
సడ్డకుడు  సుట్టం గాదు _____ కర్జూర పండు గాధన్నట్లు అనేది ఒక సామెత (బ్లాంక్ లో రెండక్షరాల పురుష లైంగిక పదం మొగ్గ, గ్గడ్డ లాంటిది గ్రామీణ ప్రాంతాలలో చిలిపి సామెతగా వాడతారు)

సడ్డకుడు, షడ్డకుడు అంటే తోడల్లుడు అనే అర్థంలో వాడతాము. జగిలెకాడు, జగిలెడు, తొడన్న అనే పేర్లు కూడా ఉన్నాయి.
మన పక్క రాష్ట్రాలు తమిళనాడులో షడ్డకన్‌, సకలబాడి అంటే కన్నడలోను ఇందుకు దగ్గరగా షడ్డక అని వాడతారు. సడ్డకుడు/సడ్డకురాలు: తెలంగాణాలో తోటి అల్లుడిని సడ్డకుడు/షడ్డకుడు అని, తోటి కోడలును సడ్డకురాలు అని అంటారు. దీనికి మూలం సంస్కృతం లోని సడ్ఢకః- శబ్దం అని చెబుతారు కానీ సడ్ఢకః అన్న పదానికి అర్ధం ఏమిటి?1.షట్ -అంటే ఆరు అని అర్థం ..ఢా -అనేఅక్షరం కలవాడు అని అర్థాన్నిస్తుంది.ఇక క అనేది పుంలింగ ప్రత్యయం..పనులనుంచి వ్యక్తివాచకాలుగా మరుతున్నప్పుడు సంస్కృతంలో "క"చేరుతుంది.
ఉదా ;యాచనం (క్రియ)-యాచక (నామవాచకం)
పచనం (క్రియ)పాచక (నామం)-ఇలా..
ఇలా షట్ +ఢా+కః -షడ్ఢకః తయారైంది..దీనికి తెలు
గు విసర్గలోపించి "డు"ప్ర్యత్యయం చేరడం వల్ల షడ్డకుడు ఏర్పడింది..
2.పూర్వంలో (స్మృతులనాటికి)పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కర్మలను బట్టి నిర్ణయించుకునేవారు.కాబట్టి ఈ ఆరు కర్మలు చేసేవారు..మొదటివాడికి సమానుడు కాబ్ట్టి వాడికి తోటి అల్లుడు>షడ్ఢకుడు అవుతాడు
ఈ షట్ కర్మలు ఒక్కో కాలానికి ఒకోరకంగా ఉంటా
యి..దానికి కారణం అయా కాలాలకు ఉపదేశించిన ధర్మశాస్త్రాలే కారణం.
కృతేతు మానవాః ప్రోక్తాః
త్రేతాయాం గౌతమాః స్మృతాః
ద్వాపరే శంఖలిఖితౌ
కలౌ పారాశరీస్మృతిః (1-24)

(క్ర్తయుగంలో మనుధర్మశాస్త్రం,త్రేతాయుగంలో 
గౌతమస్మృతి,ద్వాపర యుగంలో శంఖలిఖితుని స్మృతి కలియుగంలో పారాశరస్మృతి పాటించాలని శాస్త్రం)వీటిననుసరించి ఈ ఆరు కర్మలు మారుతాయి.
1."అధ్యాపనమధ్యయనం యజనం యాజనం తథా, దానం ప్రతిగ్రహశ్చైవ షట్కర్మాణ్యగ్రజన్మనః" [మనుస్మృతి 10-75]యజ్ఞాన్ని చేయడం ,చేయించడం , అధ్యయనం, అధ్యాపనం, దానం, దానం తీసుకోవడం
2.సంధ్యాస్నానం జపో హోమో దేవతానాం చ పూ
జనమ్‌, ఆతిథ్యం వైశ్వదేవం చ షట్కర్మాణి దినే దినే" [పరాశరస్మృతి 1-39].సంధ్యా వందనం, జపం, హోమం, దేవతాపూజ, ఆతిథ్యం, వైశ్వదేవం(ఇదికూడా యజ్ఞం చేయించడమే)
ఇలా నాలుగు వర్నాలకు నాలుగురకాలైన కర్మలుంటాయి.ఈ ఆరుకర్మలు మొదటివారితో సమానంగా చేసేవారు షడ్ఢకులుగా అర్హులు..(పూర్వం కులగొత్రాలకన్నా ఈ ఏర్పాటుకే ఎక్కువ ప్రాధాన్యం..ఇప్పుడు మారిందనుకోండి.)
3.బహుశః ఇది మూలద్రావిడం నుంచి ప్రాకృతానికి అక్కడినుంచి సంస్కృతం అలా మళ్ళి మిగతాభాషల్లోకి చేరి ఉంటుంది..ష > స గా మారడం అదే సూచిస్తుంది.(సడ్డకుడు రూపంలో)క్జావ్యాల్లో తోడల్లుల్ల ప్రస్తావనలు తక్కువ,ఉన్నా ఫలానా రాజ్యం ఫలాన ఊరు అని చెబుతారే తప మొదటివాడితో సంబంధాన్ని చెప్పరు.అందువల్ల ఇది కావ్యాల్లో కనిపించదు.మనకు వ్యవహారదేశీ ,తత్సమదేశీ,కావ్యదేశీ,అన్యదేశీ నాలుగు రకాల దేశీలున్నాయి(తెలుగు నిఘంటువులు వీటిని వేరుగా గుర్తించలేదు.తమిళ లాక్షాణికుడు తొల్కాప్పియనార్ వీటిని గుర్తించాడు.తెలుగు వాళ్లలో కోరాడ రామ కృష్ణయ్య ఇలాంటివిషయాల గురించి రాశారు.కాని అందులో ఈ వివేచన ఉందా అనేది అనుమానమే)
4.షడ్ఢకుడు చుట్టం కాదు -అంటే అతడు అక్రమ సంబంధి కాడు..అంటే అశాత్రీయంగా కాకుండా శాస్త్రం ప్రకారం బంధువర్గంలో చేరినవాడు.బంధువు కూడా కాదు.
అర్థ విపరిణామం (Semantic Change)పదాల్లో జరుగుతుంది .అందువల్ల ఇది చుట్టం బంధువుగా మారింది కాని.రూఢ్యర్థంలో బంధువు -జన్మతః సంబంధమున్నవాడు ,చుట్టం -అక్రమ సంబం
ధం(అశాస్త్రీయమిన అని-ఇల్లీగల్ కాంటాక్టుకు సంబంధం లేదు) కలవాడు ,బంధువర్గం -వేర్వేరు సంబంధాలవల్ల కుటుంబంలో చేరినవాడు అని అర్థం.
తెలుగు వ్యవహారంలో"చుట్టు"అనే పదిరోజులవాళ్లనే మరో అర్థముంది.(మృతాశౌచం ,జాతాశౌచం అనే సంస్కృతవ్యవహారానికి తెలుగు వ్యవహారం ఇది.ఆచ్చీకం)అందువల్లే "ష్డ్ధకుడు చుట్తంకాదు..అనే రూధి వచ్చి ఉంటుంది.



కామెంట్‌లు