పంచభక్ష్యములంటే ఏమిటి ? ఏవి?

భక్ష్యము అంటే తినదగినది ఎడిబుల్ అని కదా అర్ధం అందులో ఐదు రకాలున్నాయట వాటిని పంచభక్ష్యాలంటారు.

పంచభక్ష్యములు అంటే భక్ష్యం, భోజ్యం, లేహ్యం, చోష్యం, పానీయం.

భక్ష్యం అన్నా భోజ్యం అన్నా “తినదగినది” [”ఎడిబుల్‌”] అనే నిఘంటుకారుడు చెప్పేడు. కానీ ఈ రెండింటి మధ్య తేడా చాలా స్వల్పంగా వుంటుంది.

భక్ష్యం అంటే కొరికి తినేది(గారె, అప్పము వంటివి),

భోజ్యం అంటే కొరకకుండా నమలి మింగేది (పులిహోర, దధ్యోదనం వంటివి)అని అర్ధం చేసుకోవచ్చు,

లేహ్యం అంటే నాకి(lick) భుజింపఁదగిన వ్యంజనవిశేషము.కల్కద్రవ్యములుచేర్చి ముద్దగా చేసిన మందులను సాధారణంగా ఆయుర్వేద దుకాణాలలో లభించే తేనె వంటి పదార్ధాలను లేహ్యాలుగానే పిలుస్తుంటాం. లేహ్యం వాడుతున్నాం అని వాడుకలో కూడా ఉపయోగిస్తుంటారు. తమిళంలో లేగియమ్ అని మరున్దు అని దీన్ని పిలుస్తారు. కన్నడంలో కూడా లేహ్యం అనే అంటారు నెక్కువ ఔషది అని మరో పేరు. food or medicine that is licked or sipped, an electuary, syrup, lambative.

చోష్యం అంటే పీల్చదగ్గది లేదా జుర్రుకోడానికి వీలైనది.


పానీయం అంటే Drinkable. త్రాగదగినది అని అర్ధం పానము నుంచి ఉత్పన్నమైన పదం ఇది. కన్నడం లో పానకవు అని తమిళంలో కుడినీర్ అని వాడతారు.


ఆహారాన్ని తిన్నామా కడుపునింపుకున్నామా అన్న పద్దతిలో కాకుండా వండటం నుంచి వడ్డించటం వరకూ కొన్ని శాస్త్రీయ ప్రాతిపదికలను ఏర్పరచారు. కుంతకాలు, రదనికలూ, అగ్రచర్వణకాలు, చర్వణకాలు అనే నాలుగు రకాల దంతాలతో మిశ్రమ ఆహారాన్ని తీసుకోగలిగేందుకు అనుకూలమైన దంతవిన్యాసమూ, నోటి కుహరపు అమరిక కలిగివున్న మానవునికి శక్తినిచ్చేందుకు మాత్రమే కాకుండా రుచికూడా కలిసి తృప్తిని అందిచాలని, ఆయుర్వేదశాస్త్రాన్ని మేళవించి కలగలపిన ఆహార దినుసులతో తెలియకుండానే ఆరోగ్య సంరక్షణ చేసుకునేలా ఆహార చట్రాన్ని రూపోందించారు. వీటి విశేషాలను లోతుగా పరిశీలించినపుడు కొంత ఆశ్చర్యం కలగక మానదు. అంతే కాదు ఏ పదార్ధాన్ని ఎటువంటి వాటిలో వడ్డించాలి. తినే వారి చేతికి ఏ దిశగా వడ్డించాలి. ఎంత మేర వడ్డించాలి. తినే పద్దార్దాన్ని బట్టి వాటి క్రమం ఎలా వుండాలి. లాంటి నియమాల వెనుక ఏదో ఒకరకంగా ఏర్పడటం కాక తార్కికమైన, అర్ధవంతమైన క్రమం వుండటం గొప్పవిషయం.

నిజానికి వీటిని ఒక్కక్కటిగా పరిశీలిస్తూ ఆధునికి కేటరింగ్ బేసిక్ నిభందనలు ఏమిచేపుతున్నాయి. వైద్య శాస్త్రం, పోషణాధారిత గ్రంధాలు ఏం చెపుతున్నాయి అనే అంశాలను పరిశీలించుకుంటూ వెళితే అదో ప్రత్యేకాశం అయ్యేలా వుంది. దీనిపై మరిన్ని వివరాలు తెలిసిన మిత్రులు స్పందిస్తే మరింత ఉపయోగకరంగా వుంటుందని భావిస్తున్నాను.

ఫేస్ బుక్ లో

  • Pusyami Sagar manchi vishyam sir ...bagunadi
  • Nauduri Murty Instead of opinions, if people can give information on this subject, it would be nice and useful.
  • Srinivas Kondaparthy good n valuable information sir............
  • Katta Srinivas అమ్మ చేతి వంట అమృతంలా అనిపించడానికి కారణం తెలుసా ?
    అందులో తను మర్చిపోకుండా ఒకటి కలుపుతుంది.
    అదే ‘ప్రేమ’
    అందుకే ఎప్పుడూ బాగానే వుంటుంది.

    ఆహారానికి రుచిని పెంచే వాటిలో మరో ముఖ్యమైన, తప్పని సరి అంశం ‘ఆకలి’

    నవీన ఆహర పద్దతులు రుచి చుట్టూ తిరుగుతున్నాయి. నిజానికి రుచి మనసుకు సంభందించిందే అది పదార్ధంలో వుండదు. మనం ఆరోగ్యకరమైన దానినే ఇష్టపడటం ప్రారంబిస్తే అంతకంటే సౌకర్యం మరోకటి వుండదు.
  • Narayana Sharma Mallavajjala మిత్రమా!భక్షం అంతే గుండ్రనిది అనే అర్థం కూడా ఉంది.ఇంట్లొ వాడుకు నే రొట్టెలు మొదలైనవి.మనం తినే ఒక తీపి పదార్థాన్నొకదాన్ని భక్షం అని అనటం అర్థ విపరిణామం,లేహ్యాన్ని వ్యంజనం అనికూడా అంటారు.అంటే నంచుకు తినేది అని...పంచ భక్షాలతొ పాటు పరమాన్నం కలిస్తే షడ్రుచులు.పూర్వంలో పరమాన్నం ,పులగం దైవ సంబంధమైన కార్యక్రమాలకు మాత్రమే చేసేవారు.అలా చేసింది నలుగురుకీ పంచాలన్నదికూడా నిబంధనే.అందుకే రామయణంలో భరతుడు రాముడితో ఇలా అంటాడు."పాయసం కుసరం ఛాగం యథాన్యస్సంప్రయఛ్చతి"(పర్వ దినాల్లో పాయసం,పులగం వండి ఇతరులకు ఇవ్వనివడెవడైనా ఉంటె వాడికి తగిలేపాపం నేనీ రాజ్యాన్ని కొరుకుంటే నాకు తగులు తుంది)అని..ఇప్పుడు బోనాలు కదా..భోజ్యము>భోజనము>బోనము వీటిని రూపంతరాలు అంటాం.ఆమ్మోరికి ప్రసాదం తీసుకుపోటమే ఇది.
  • Katta Srinivas Narayana Sharma Mallavajjala గారూ మీ విశ్లేషణాత్మక స్పందనకు ధన్యవాదాలు, భక్షం , భక్ష్యం ఒకటేనా ? తినే వాటిలో గుండ్రని వాటినేనా ఏ గుండ్రని(వృత్తమా /గోళమా) దైనా భక్షం అనేవారా.. ఈ అర్ధాన్ని నేను మీదగ్గరే తెలుసుకుంటున్నాను ..
    భక్షణ నుంచి భక్ష్యం అనేది వచ్చిందనుకుంటున్నాను.
  • Narayana Sharma Mallavajjala నిజమే..భుక్ అనే నామధాతువొకటి ఈరెంటికీ మూలం.పుట్టుకలో తేడాలేదుగాని ప్రాకృత కాలం నాటికే ఈబేధం ఉంది.భక్షణే అనే క్రియకు తినడమనే అర్థం.నిఘంటుకారులు కూడా భక్ష్యము>తినుబండారము ,అని దానికి వికృతి అయిన భక్తము>అన్నము అని,విభాగింపబడినది అని అర్థాన్ని చెప్పారు.వికృతిలో ఇది అన్నమే ఈ వ్యవహారమే భక్షానికి,ఇక భక్ష్యానికి తినిబండారమనే వ్యాప్తి.(చూ.గాథా సప్తశ్తిలో తెలుగు పదాలు.డా.తిరుమల రామచంద్ర& దేశీ నామమాల(హేమచంద్రుని మూలానికి ప్రకాశ్ జొషి వ్యాఖ్యానం)పదార్థాల ద్వారా చేసేవి మాత్రమే వాటి ఆకారంలో ఉంటాయి.ముద్దగా చేసి చేసేవన్ని గుండ్రగా(గొళంలాకాదు)చేయటమే. ఈ క్రమంలో నిజానికి గోళాన్ని గురించి చదవలేదు.
  • Katta Srinivas “తరతరాల తెలుగు రుచులు” పరిశోధనా గ్ర౦థ రచయిత డాక్టర్ Purnachand GV గారు తన బ్లాగు http://drgvpurnachand.blogspot.in/ లో ఆహారము ఆరోగ్యము నకు సంబందించిన అనేక విషయాలు ప్రస్తావించారు. 
    ► ఇలా పరస్పర విరుద్ధ ద్రవ్యాలను కలిపి తినటాన్ని ఆయుర్వేద శాస్త్ర౦ చెయ్యకూడని పనిగా చెప్పి౦ది. కొన్ని రకాల ద్రవ్యాలు కలిపి భుజిస్తే, అవి రసరక్తాది ధాతువులను చెరిచి ఆరోగ్య భ౦గ౦ కలిగిస్తాయి. గుణ విరుద్ధాలు, స౦యోగ విరుద్ధాలు, స౦స్కార విరుద్ధాలు, దేశ విరుద్ధాలు, కాల విరుద్ధాలు, స్వభావ విరుద్ధాలు అలా అనేక విరుద్ధ ద్ర్వ్యాలున్నాయి. వీటిని ఒకటిగా కలిపి తినకూడదు.అంటూ ఈ క్రింది వ్యాసంలో చెపుతున్నారు.
    http://drgvpurnachand.blogspot.in/2012/11/blog-post_15.html
  • Ramesh Jvv akali chavula deashamulo inni rakala thindi gurinch charcha jaragadamu manchidea. kaani vaastavaalu maatladithe baguntundi
    23 hours ago · Unlike · 2
  • Katta Srinivas Ramesh Jvv గారూ మీరన్నట్లు దేశంలో ఆకలి బాధితులు పెరుగుతున్న మాట నిజమే. ఆకలి ఆరోగ్యాన్నే కాకుండా చారిత్రక వాస్తవాలను కడా నశింపచేయకుడదనీ, ఎల్లప్పుడూ ఆకలితోనే కాకుండా బ్రతికేందుకు తినే దశలో దేశం మరింత ఎదగాలనే కోరక నాకూ వుందన్నయ్యా. అలాగే ఇన్ని రకాలు ఆహార పదార్ధాలన్నీ భారతీయులు ఇప్పుడు కూడా అందరూ తినేస్తున్నారని నేను పొరపాటున అనుంటే అది ఖచ్చితంగా వాస్తవదూరమే అయ్యుండేది. కానీ నేను చెప్పదలచుకున్నది కేవలం ఇటువంటి వర్గీకరణ మనవాళ్లు ఇప్పటికే చేసి వున్నారని మాత్రమే. ఈ మాటను వింటుంటాం అసలైన అర్ధం ఇది అని చెప్పదలచటమే. అన్నార్తుల పట్ల మీ సహనుభూతి(empathy) కి వందనాలతో..మీ శ్రీనివాస్.
    22 hours ago · Like · 2
  • Harinath Kapula Baga chepparu
    20 hours ago via mobile · Unlike · 1
  • Karumuri Rajendra Prasasd good information
    13 hours ago · Unlike · 1
  • Ramesh Jvv @ Katta Srinivas gaaru నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మీరు రాసినదంతా సమాజములో ఒకరిద్దరికి సంభందించిన భాష. ఆ కుంతకాలు, రదనికలు, పంచ భక్ష్యాలు ఇవన్ని కోట్లాది ప్రజలకు తెలియని భాష. కొంత మంది చెప్పినది ఎప్పుదు వాస్తవము కాదు. మా తింది మాకుంది. అది మీరు చెప్పిన భష వాడే వారికి అసలు అర్దం కాదు. ప్రతి పదం గురించి జాగ్రత్తగా పరిశీలించక్పోతె, తర తరాలుగ వాళ్ళు సృష్టించిన మాయలో పడిపోతాం.
    12 hours ago · Like · 1
  • Katta Srinivas Ramesh Jvv గారూ కుంతకాలు, రదనికలు అనేది ప్రాచీన భాష నుంచి తీసుకున్నాది కాదు. మన తెలుగు అకాడమీ వారు రచించిన సామాన్య శాస్త్ర పుస్తకాలలోది మేం చదువుకున్నపుడు అలానే వుంది. నేను పాఠాలు చెప్పినపుడు అవే పదాలు వున్నాయి. ఇక కాదంటే ఆంగ్ల పదాలు బ్రాకెట్లలో వాడారు. నిజంగా ఈ కుంతకాలు, రదనికలు అనేవి మనకి అర్ధం కాదను కుంటే మనిషి పళ్ళలో రకాలను మరింత సాధారణ భాషలో పిల్లలకు నేర్పే పద్దతికోసం అడగాల్సిందే నండీ. ఇది ఎవరు సృష్టించిన మాయ అని మీరు భావిస్తున్నారు. ఇది మన శాస్త్రీయత అనుకుంటూ సామాన్య శాస్త్రపుస్తకాలలో రాసుకున్నాది నిజంగా మాయే అయితే ఆ పని కరిక్యులమ్ చేస్తుదనే చెప్పుకోవాలి. ఒక వేదిక తరపున కూడా తప్పకుండా పరిశీలింప గోరతాను.
  • Ramesh Jvv neanu ceppimdi adea kadaa adi telugu akaaDami ayina imkokaraina vaaDeadi aa komdari bhaashea tappaa mejaariTi prajala bhaasha kaadanDi.
  • Katta Srinivas మీకు తెలియంది కాదు కానీ మరొ విషయం కూడా చెప్దామని పిస్తోంది. కోట్లాది మంది అర్ధమయ్యింది మాత్రమే శాస్త్రంగా చెప్పాలంటే బహుశా అర్ధ శాస్త్రం నుంచి బయో ఇన్మర్మాటిక్స్ వరకూ ఏదీ బయటకు రాదు. మొత్తాన్నీ టార్గెట్ చేసి చెప్పే విషయాలు వేరుగా వుండాలి. ప్రత్యేకించి టార్గెటెడ్ గ్రూపుకు మాత్రం చెప్పే అంశాలు మరికొన్ని వుంటాయి. నేను కోట్ల మందికోసం ఇది రాద్దామనుకోలేదు. (చాలా మందికి ఫేస్ బుక్ అంటే కూడా తెలియదు అయినా మనం వాడుతూనే వున్నాం) కొంచెం అవగాహన వుండి అర్ధం చేసుకోగలరనుకున్నవారికి అదనపు సమాచారంగా ఉపయోగపడాలనుకున్నాను. అయినా సరే చెప్పిన దానిలో తప్పులుంటే ఖచ్చితంగా సరిచేసుకోవటానికి నేను సిద్దమే. ఎవరో చెప్పారు కాబట్టి అది సరైంది అని చెప్పటం సరైందికాదు. అలాగే పాతది కాబట్టి ప్రతిదీ తప్పే అనికూడా అనుకోకూడదనీ తెలుసు. నా అవగాహనలో కూడా నిజమే కదా అనుకున్నివే రాసాను.
    అందుకే అకాడమీ లో రాయగానే నిజమే అయిపోదు. ఆ పదాలు వాడటం తప్పని మీరు కూడా భావిస్తే. తప్పని చెప్దాం.. కుదిరితే సరైన పదాలు సూచిస్తూ వాడమని ఆర్వీయంకు సూచిస్తే మేలు కదండీ.

    ఇంతకీ మెజారిటీ ప్రజల భాషలో పళ్ళలో రకాలను ఏమంటారో నాకూ తెలుసుకోవాలని వుందండీ.... ఇకపై ఆ పదాలలోనే వాడేందుకు అవకాశం వుంటుంది కదా.
  • Ramesh Jvv మరల మీరు చెప్పిన భాష ముఖ్యంగా పంచ భక్ష్య పరమాన్నాలు ఇవన్ని ప్రజలవి కావు. ఇక ప్రజలకు తెలియదు తెలిసిన మహానుభావులు కొందరు ఉంటారు వారి కోసం భాష వేరేగా ఉంటుంది అనుకోవడం మన లాంటి వాళ్ళం చేయవలసింది కాదు. ఏ మాట వెనుక ఏమి దాగుందో తప్పక మనం తెలుసుకోవాలి. ఏ దేశంలో తినే తిందిలో కుడా భెధ భవాలు ఉన్నయి, వివక్ష ఉంది. అది సైన్స్ పుస్తకాలో కుడా. సైన్స్, భాష రెండు ప్రజల్వే. వాట్ని వారి నుండి విడదీయటం సరి కాదు.
  • Katta Srinivas మీరేం చెప్పదలుచుకున్నారు. తినే పదార్ధాలను వర్గీకరించటం లో తప్పుందా? అది ఇకపై తెలుసుకోవటం తప్పా. పేర్లు సంస్క్రుతంలో వుండటం తప్పంటారా? తత్సమమో, తద్భవమో, మరోటో అయితే ఒకేనా.
    మరికొంచెం క్లియర్ గా చెప్పండి. ప్రజలవి కావు అంటే మీ వుద్దేశ్యంలో మరెవరివి?

    విషయం సరైందే భాష/పదాలు సరైనవి కావా?
    విషయమూ భాషా సరికాదనుకుంటున్నారా?
    మీరు వాడుకలోని పదాలు చెప్తారా?
  • Ramesh Jvv వాళ్ళు చేసిన వర్గీకర్ణ పద్దతి లొనే తేడా ఉంది. అది ఇవన్ని తర తరాలుగ జరుగుతున్నవే. దద్దోజనాలు, పులిహోరలు ఎవరి ఆహారమో తెలుసుకోండి. ఆ వర్గీకరణలో ఎక్కడైన మా ఆహారము ఉందా? ఇది ఒకరి ఆహారాన్ని గొప్పగా చూపే వివక్షాపూరిత వర్గీకణ.
  • Katta Srinivas వర్గీకరణ లో తేడా ఏమిటో నాకు తెలియలేదు.
    మీరు రెండు ఉదాహరణలు చూపి ఎవరి ఆహారం అంటున్నారు. 
    మన ఆహారం అంటే ఏమిటి ? అందులో ఎక్కడన్నా కాదు మనం తినే ప్రతి ఆహార పదార్ధమూ ఏదో ఒక వర్గీకరణలోకి ఖచ్చితంగా చేరుతుంది. ఎవరు తినేవి అయినా సరే. తాగే వాటిని పానియము అన్నారు
    ...See More
  • Ramesh Jvv నేను పదాలు ఉదాహరణగా మాత్రమే చెప్పాను. నేను వ్యతిరేకించేది మొత్తంగా ఆ వర్గీకరణ విధనాన్నే. దాన్ని వెనకాల చాలా అంశాలు దాగున్నాయి. దేనికి దానిగా ముక్కలు చేసి చూస్తే ఏమీ అర్దం కాదు అంతా కలిపి సమగ్రంగా చూస్తేనే నిజం తెలుస్తుంది.
  • Katta Srinivas పర్లేదు సర్ సమాజానికి ఉపయోగ పడే విషయం కాబట్టి మీకు వీలున్నప్పుడే సమగ్రగా చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను. కొన్ని ముక్కలుగా చేసి విశ్లేషించి అర్థంచేసుకోవాలి. మరికొన్ని విహంగ దృక్పదంతో మొత్తంగా కలిపి సమగ్ర దృష్టితోనూ చూడాలనే విషయాన్ని నేను అంగీకరిస్తాను.


కామెంట్‌లు

  1. Jvv వాళ్ళ వివరణలు చాలా అసంబద్ధంగా ఉంటాయి వారు కొత్తగా చెబుతున్నది ఏమి ఉండదు విజ్ఞానం పునరావృతం అవుతుంది అనేది నిజం ఈరోజు మనం చూస్తున్న విజ్ఞనం వేదాలలో ఎపుడో నిరూపించబడినదే Jvv వారు మరొక విషయం తెలుసుకోవాలి వర్గీకరణ అనేది ఎందుకు అవసరం అనేది విజ్ఞానశాస్త్రంలో వర్గీకరణలు లేవా ఇక భాషా విషయానికి వస్తే దేనికైనా మూలం అనేది ఉంటుంది మూలాన్ని వదిలేసి ఎవరూ కొత్త విషయాలను కనుగొనలేరు అంతెందుకూ విజ్జానశాస్త్రంలో ఏది కొత్త విషయం కాదు కేవలం ముందు ఉన్న మూలానికి కొంత కొత్త సమాచారాన్ని జోడించడమే అంటే కొత్త సీసాలో పాతసారా అన్న చందంగా అన్నమాట

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి