ప్రతిజ్ఞకు రచయిత పేరు వుండాలా ?

ఒట్టు, ప్రతిజ్ఞ లేదా శపథము (Oath or Pledge) నిబద్ధతగా వుంటామని దృడనిర్ణయాన్ని వెలిబుచ్చేందుకు చాలా సందర్భాలలోనూ,సంస్థలలోనూ వాడటం మన సంప్రదాయంలో వుంది.

మనం టెక్ట్ పుస్తకాలలో కూడా చదువుకుంటూ వస్తున్న భారతీయ ప్రతిజ్ఞ రచయిత ‘‘ పైడిమర్రి సుబ్బారావు ’’  గారిని మర్చిపోయారంటూ చాలా కథనాలూ, పరిశోధనాత్మక పుస్తకాలూ వచ్చాయి.



మనవరాలు తన పుస్తకంలో చదువుతుంటేనే ఆయన గమనించారట. ఎందుకిలా జరిగింది? ఎవరి రచనైతే తీసుకున్నారో వారికి కనీసం సమాచారం చెప్పే కర్టెసీ కూడా భారత ప్రభుత్వానికి లేదా ? 



గేయంలా గానో కవిత్వం లాగానే అలంకారిక అందం కంటే ప్రతిజ్ఞలో వచనంగానే నిర్ధిష్టమైన భావన వుండటం అవసరం. ఇది రచయతలు చేసేదానికంటే చర్చలలో ఏయో అంశాలుండాలనేది తేలాలి. అంతే కాదు ఇది ఏర్పడినప్పటినుండి చూసినా యథాతదం గా ఏమీ లేదు అవసరార్ధం అనేక సరళీకరణలకూ మార్పులకూ లోనయ్యంది. అప్పట్లో అలవాటుగా వాడే మాస్కులైన్ జండర్ పదాలను కామన్ జండర్ పదాలుగా మార్చడం నుంచి సరళ గ్రాంధిక పదాలను వాడుక భాషలోకి మార్చటం వరకూ అనేక రూపాంతరాలు చెందింది. అలాంటప్పుడు చాల ప్రతిజ్ఞలకు రచయతపేరు వాడనట్లే దీనికీ వాడటం లేదా. తెలుగులో

భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరు నా సహోదరులు.

నేను నా దేశాన్ని ప్రేమించుచున్నాను. సుసంపన్నమైనా, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.

నా తల్లిదండ్రున్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందరిన్ని గౌరవిస్తాను. ప్రతివారితోను మర్యాదగా నడుచుకొంటాను.

నా దేశంపట్ల , నా ప్రజలపట్ల సేవనిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృధ్ధులే నా ఆనందానికి మూలం. జై హింద్".

English version

India is my country and all Indians are my brothers and sisters.
I love my country and I am proud of its rich and varied heritage.
I shall always strive to be worthy of it.
I shall give my parents, teachers and all elders respect and treat everyone with courtesy.
To my country and my people, I pledge my devotion. In their well-being and prosperity alone, lies my happiness.


వివిధ భాషలలో ప్రతిజ్ఞ


ఇప్పటికైనా సుబ్బారావు గారి పేరుని రచయిత చేరుస్తారా అవసరం లేదనే భావిస్తారా. నల్లగొండ జిల్లా అన్నెపర్తి గ్రామంలో 1916 జూన్ 10న జన్మించారు. హైదరాబాద్ రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగం చేశారు. 1962లో ఇండియా, చైనా వార్ జరుగుతున్న సమయంలో పైడిమర్రి విశాఖపట్టణంలో డీటీవోగా పనిచేస్తున్నారు. ఆ సమయంలో ప్రజల్లో దేశభక్తిని పెంపోందించే ఉద్దేశంతో ఆయన ప్రతిజ్ఞను రచించారు. తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ, ఇంగ్లీష్, అరబ్బీ భాషల్లో పైడిమపూరికి పరిజ్ఞానం ఉండేది. 1945లో ‘ఉషస్సు’ కథల సంపుటి, కాలభైరవుడు నవలను రాశారు. అరబ్బీ నుంచి ఇతర భాషల్లోకి పలు అనువాదాలు చేశారు. ఆయుర్వేద వైద్యం కూడా చేసేవారు. చివరకు 1984 ఆగస్టు 13న స్వగ్రామంలోనే మరణించారు. సాహితీ వేత్తకు తగినంత గౌరవం ఇవ్వలేమా?

తెలుగు వాడు పైడిమర్రి అందించిన స్పూర్తిని నిలబెట్టాలని ఆవిషయంలో పరిశోదన చేసిన శంకరన్న గారు ఈ విషయంలో రెండు పుస్తకాలను వెలవరించారు



కామెంట్‌లు