నేనూ నాలాంటి గడ్డి పూలూ


ఎవరో అడుగడుకూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో తీర్చిదిద్దాల్సిన అవసరంలేదు.
జడలాంటి ఉన్నతమైన స్థానాలకెళ్ళాలని పాకుడురాళ్ళను దాటుకుంటూ అర్ధంతరంగా తనువులు చాలించాల్సిన అవసరం లేదు.
మరెక్కడో నలిగి పోయేందుకు మెడలుతుంచుకునేందుకు సిధ్దపడాల్సిన పనిలేదు.
గుర్తింపు తహాతహే లేనప్పుడు పుష్పవిలాపాలు పాడాల్సిన అవసరమే లేదు.
తమ బ్రతుకేదో తామే స్వేచ్ఛగా బతికేయ గలవు. అందుకేనేమో ఒక్కోసారి నాకు వాటిని చూస్తే అద్దంలో చూస్తున్నట్లనిపిస్తుంది.
అందుకేనేమో ఒక్కోసారి అర్ధంకాని పాఠమేదో నాకవి చెపుతున్నట్లనిపిస్తుంది.



కామెంట్‌లు