Friday, 11 October 2013

బ్రతుకేదమ్మా?

రంగురంగుల ప్లాస్టిక్ పూలు
తంగేడుకు సాటా
బంగారమని పేరెట్టుకున్నంతనే.

పొత్తిళ్ళ బిడ్డకు
ఫోకస్ కావాలని
నడిమద్దేనం బజార్లనూకుతమా?

బతుకుపాటను
నిలుపుకునేందుకు
కార్పోరేట్ కోసరెందుకే బిడ్డా

రేపెవడో పండ్గమీన
పేటెంటెత్తుకుంటే
దాండియాలా దగాపడిపోవాల్సిందేగా.

అరికంట్లం చలికే కట్టినా
పాటనిభీ పాడువెడ్తున్నట్లు
సెవుల్లా ఈ అపసుతులెత్తుతున్నయ్

బతుకు పాటను
బతికించుకుందుకు
బతుకులోపటే యెతుక్కుందాం?

ప్లాస్టిక్ కుండిల్లా కాదు
పెరటిమొక్కను
పండుగలా బతకనిద్దాం.


https://www.facebook.com/groups/kavisangamam/permalink/634994469886642/

ఫేస్ బుక్

Tweets

లంకెలు