Wednesday, 22 January 2014

చిల్లుల బుడగ


అందరూ అంగీకరించరు కానీ
ఎవ్వరో కానీ సెలబ్రేట్ చేసుకోలేరేమో కానీ
మరణం నిజంగానే చాలా పెద్ద పండుగ

ఆశల వత్తి ఆరిపోకుండా వెలుగుతుంటే
ప్రవహించే కన్నీళ్ళు తెడ్డువేయకుండానే నావను ముందుకు తోస్తుంటే
ఆశలూ ఆందోళనల బంధాలను తెంచుకుంటూ నిశ్చలంగా మిగలటం
జీర్ణించుకోలేముకానీ అది ఆకలి మరచిన నిండు వేడుక.

నీవే మరింత బలంగా తెలివిగా యువ్వనంగా
మరో రూపాల్లోకి ఒదిగి
నెమ్మదిగా కుబుసాన్ని విడిచినట్లు
ఒక పోరను విడిపించుకోవడం
అరే అసలే పెద్ద సంబురం.

అందరూ ఆలోచించరేమో కానీ,
ఎవ్వరో కానీ గుర్తించరేమో కానీ,
వేస్తున్న ప్రతి అడుగూ అక్కడికి చేరుకునేవరకే
గమ్యం చేరాక బరువుదిగిన హాయిని పోందే శ్రమకూడా పడాల్సిన అవసరంలేకుండా.

అనుకోం కానీ
ఆదమరస్తుంటాంకానీ
గొట్టం ఒక పక్కనుంచీ మరో పక్కకు పదార్ధాన్ని తోసుకెళుతూ
అగచాట్లుపడుతూ
గొట్టం బతుకుని గిరిదాటకుండానే రంగుకాగితాలకు కట్టేస్తుంటాం.

రెండు దేహాల పోషణలో
తాకే దానినే గోకుతుంటాం కానీ
నిండా కాలినా నిలబడివుండే రెండోదానికసలు మేతే వేయం

అనుకుంటాం కానీ
అంగీకరించినా కానీ
అనుకుంటూనే వున్నకానీ
దీపం ఆగిపోయేలోగానే
వెలుతురు చేతల్లో వుండగానే
వస్తువులేమీ సర్దుకోం.

22-01-2013   అక్కినేని గార్కి అశ్రునివాళి

ఫేస్ బుక్

Tweets

లంకెలు