Friday, 31 January 2014

భాగ్య నగర నిర్మాణం : కుతుబ్ షా ప్రార్ధన

మనకోసం స్వంత ఇల్లు కట్టుకునేందుకు పునాది రాయి వేసే రోజు ఏమని కోరుకుంటాం. బహుశా తక్కువ ఖర్చులో, నాకు అత్యంత సౌకర్యవంతంగా, పోరుగు వాళ్ళు ఈర్ష్య పడేంతా బాగా నా ఇల్లు వుండాలి అనేనేమో, మరి నగరాలనే నిర్మించాలనుకున్న మహారాజులు ఏమని ప్రార్థిస్తారు. అప్పటికే కట్టిన నగరాన్ని ఆక్రమించి తయారుగా వున్న సింహాసనంపై కూర్చోవటం కాకుండా కోటలే కాదు నీటి అవసరాలే కాదు స్వంత ఇల్లు కట్టుకున్నట్లు మొత్తం నగరాన్ని ఒక్కోక్కటిగా నిర్మించాలను కున్న వాళ్ళు ఏమని ప్రార్ధిస్థారు. 


అప్పటి రాజధానిగా వున్న గొల్కొండ జనాభా అవసరాలను తీర్చేందుకు చాలటం లేదని ఒక కొత్త నగరాన్ని మొత్తంగా నిర్మించాలనుకున్నాడు. సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా.  నగరానికి పునాది రాయి వేసేరోజు ఆ ఐదవ నిజాం సుల్తాన్ ఏమని ప్రార్ధించాడో చరిత్ర తన మనసులో నాలుగు వందల సంవత్సరలకు పైగా ఇంకా పదిలంగా దాచుకునేవుంది.
సముద్రంలోకి చేపలన్నీ ఏవిధంగా వచ్చి చేరతాయో అలా 

ఈ మహానగరానికి లక్షలాదిగా 
అన్ని కులాల, 
అన్ని మతాల, 
అన్ని రకాల సిధ్ధాంతాల 
స్త్రీలూ, పురుషులూ పిల్లాపాపలతో వచ్చి ఆనందంగా నివసించేలా ఈ నగరాన్ని ఆశీర్వదించు భగవాన్....అతని ప్రార్ధనను ఏ దేవుడో, లేదా ఆశీర్వదించగల మహత్తరమైన శక్తి ఏదో విన్నట్లే వుంది. ఆ ప్రార్ధనలో ఒక్క అక్షరం వృధాపోకుండా ఈ నాటి వరకూ నగరం దినదిన ప్రవర్ధమానమవుతూ కోట్లాది జనాలకు ఆవాసమై, ప్రపంచవ్యాప్త గుర్తింపుని పొందుతూ వస్తోంది.


అన్ని కులాలూ వున్నాయిక్కడ, అన్ని మతాలూ వున్నాయి. నిజానికి ఎక్కడో దేశం నుంచి వచ్చిన జొరాస్ట్రియన్లు సైతం ఇక్క గుండెల మీద చేయేసుకుని తమ సంతతిని అభివృద్ధి చేసుకోవటమే కాకుండా తమతమ వారసత్వ చిహ్నలను నిర్మించుకున్నారు. భారతదేశంలో ఎంతైతే భిన్నత్వంలో ఏకత్వం వుందో అంతటి ఏకత్వాన్ని చూపుతూ మసీదులూ, గుడులూ, గురుగ్రంధ్ సాహెబ్ లూ ఇన్నీ అన్ని మతాల దేవాలయాలనూ తన గడ్డపై వెలుగొందుతుంటే తన నవ్వులతో ప్రకాశవంతం చేస్తోంది. ఒక స్వేచ్చానగరంగా ఎలా వుండాలని సుల్తాన్ తమ మనసులో అనుకున్నాడో అదే విధంగా సరిహద్దులెరగని విశాలతతో విలసిల్లుతూ వస్తోంది. 

చెరువులెండిపోయే రోజులు, గాలాలూ వలలూ మరబోట్లూ తిరుగాడే రోజులు, సమతుల్యతలు దెబ్బతింటున్న రోజులు ఏమో ఈ చెరువూ, ఈ చేపలూ మరెంత కాలం సంతోషంగా వుంటాయో, ఈ దీవెనకు కూడా ఎక్స్ పైరీ డేటు వుంటుందా? గోల్కొండ నిండితే భాగ్యనగరం నిర్మించుకున్నట్లు, ఇప్పుడు భాగ్యనగరం పొంగి పొర్లితే మరి కొన్ని నగరాలుగా పరావర్తం చెందనుందా? ఏమో ఎదురు చూడాలి కుదిరితే మనమూ ప్రార్ధించాలి రవీంధ్రునిలా where the mind is with out fear, అని. ఓ తండ్రీ అటువంటి శాంతి సమున్నత స్థితిని జనలందరికీ కల్పించు. 

Let millions of men and women of all castes, creeds, and religions make it their abode, like fish in the ocean.


ఫేస్ బుక్

Tweets

లంకెలు