ఖమ్మంజిల్లా : ముదిగొండ చాళుక్యులు కొన్ని వివరాలు - శ్రీ పి.వి పరబ్రహ్మశాస్త్రి (భారతి 1979 పత్రిక నుండి)



ముదిగొండ చాళుక్యులు
బాదామీ చాళుక్వవంశం వాడైన రెండవ సత్యాశ్రయ పులకేసి వల్లభుడు క్రీస్తుశకం 624లో పూర్వ దిగ్విజయ యాత్రకు బయలుదేరి వేంగీకళింగాలను జయించి, తన సోదరులు కుబ్జ విష్ణువర్ధనుణ్ని పిష్టపురం (పిఠాపురం)లో వేంగీరాష్ట్రానికి, రణమర్ధనుని ముదిగొండ రాజ్యానికి రాజ ప్రతినిధులుగా నియమించాడు. ఈ వంశం వారు తమ తమ ప్రాంతాలలో స్ధిరపడినా, ముదిగొండ రాజ్యం వారు వేంగీ చాళుక్యులకు లోబడే వుండేవారు. కాని చాళుక్య భీముని, రెండవ భీముని కాలాలలో ముదిగొండ పాలకులు రాష్ట్ర కూటుల వల్ల చాల నష్టపడ్డారు. వీరి రాజ్యం రాష్ట్ర కూటుల రాజ్యానికీ, వేంగీ రాజ్యానికి మధ్య ఉన్నందున రాష్ట్ర కూటులు వేంగీపై దాడి జరిపినప్పుడెల్లా ముదిగొండ రాజ్యానికి చాలా నష్టం కలిగేది. ముదిగొండ రాజ్యం నేటి ఖమ్మంజిల్లా ప్రాంతం. కృష్ణాతీరంలోని కొండపల్లి నుంచి వరంగల్లు జిల్లాలోని కొరవి వరకు వ్యాపించి ఉండేది. రాష్ట్ర కూటుల, చాళుక్యులకు సహజ శత్రువులు కనుక తూర్పు చాళుక్య రాజ్యాన్ని మింగడానికి సిద్ధంగా ఉండేవారు. వేంగీలో రెండవ అమ్మరాజు రాజ్యకాలంలో అతనికి, సవతి అన్న అయిన దానార్ణవునికి సంఘర్షణ వచ్చింది. తిమ్మరాజు రాష్ట్ర కూట కృష్ణుణ్ణి సహాయం కోరాడు. ఇలాంటి అదనుకోసమే కాచుకున్న రాష్టక్రూట చక్రవర్తి తన సేనాపతి అయిన కాకతీగుండ సేనానిని దానార్ణవుని మీదికి పంపాడు. గుండసేనాని ముదిగొండవారి రాజ్యం ఆక్రమించుకొన్నాడు. పిదప వచ్చిన మార్పులో ముదిగొండ చాళుక్యులు రాజ్యం మరల సంపాదించుకొన్నారు. ముదిగొండరాజులు, కాకతీయులు పశ్చిమ చాళుక్యులకు లోబడే కలతలు లేకుండా ఉండేవారు. కాని, కాకతీయరుద్రుడు స్వతంత్రుడైన పిదప ముదిగొండ చాళుక్యులను పూర్తిగా వోడించి, ఆ రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకొన్నాడు. ముదిగొండ చాళుక్యులు కొంత కాలం కోస్తా ప్రాంతంలో కొలని రాజుల ఆశ్రయంలోగడిపి, మరల భద్రాచల ప్రాంతంలో స్వతంత్రులుగా తల ఎత్తారు. కాని, కాకతి గణపతి దేవుడు వారిని పూర్తిగా అణచివేసాడు.
క్రీ.శ.616 నుండి 624లోగా బాదామీ చాలుక్య చక్రవర్తి సత్యాశ్రయ యిమ్మడి పులకేశి తీరాంధ్రమును జయించి తన తమ్ముడగు కుబ్జవిష్ణువర్ధనునికాప్రాంతము వంశపారంపర్యముగ జెల్లునట్లొసగెను.అతని సంతతివారు వేంగిచాలుక్యులు లేక తూర్పు చాలుక్యులను పేరుతో నచట సుమారారువందలేండ్లు పరిపాలించిరి.అట్లే నేటి తెలంగాణ ప్రాంతములో గూడా మరి రెండు చాలుక్యవంశములించుయమించుగ నప్పటినుండియే నెలకొనియున్నవి.వాటిలో గోదావరి వెంటనిప్పటి నిజామాబాదు,కరీంనగరు జిల్లాల్లో పోదన(బోధను)వేములవాడ రాజధానులుగ సుమారు క్రీ.శ 970 వరకు  రాజ్యముచేసిన చాలుక్యశాఖ యొకటి ,వారి ప్రక్కనే యిప్పటి ఖమ్మంజిల్లాలో ముదిగొండ రాజధానిగ కొంతకాలము,ఆ తరువాత కొరవి రాజధానిగ కొంతకాలము రాజ్యము చేసిన చాలుక్యశాఖ రెండవది.వీరినే ముదిగొండ చాలుక్యులు లేక కొరవి చాలుక్యులని యందురు. ఈ రెండు శాఖలవారు ఎప్పుడేవిదముగ రాజ్యములు నెలకొల్పినది  స్పష్టముగ తెలియదు.కాని వీరి వంశస్థాపకులపేర్లు రణవిక్రముడు,రణమర్ధుడు,కొక్కిరాజు అనునవి బాదామీ చాలుక్యులలో కొందరు మొదటి రాజుల పేర్లను పోలియుండుటను బట్టియు,నీరెండు వంశములలో ననేక రాజులు బేర్కొన బడుటవలనను  ఈ యుభయవంశములు వేంగి చాలుక్యవంశమువలెనే కడుప్రాచీనమైనవని చెప్పవచ్చును. ముదిగొండ చాలుక్యుల చరిత్రను దెలుపు ఆధారములు మిక్కిలి తక్కువ.రెండు తామ్రశాశనములు,కొరవి శిలాశాశనము మాత్రము వీరి యుదంతమును కొంత తెలుపుచున్నవి.మరికొన్ని శిలాశాశనములలో  గూడ వీరి ప్రసక్తిగానవచ్చుచున్నది.వీటి సహాయంతో నీ చాలుక్యులచరిత్ర కొంత వ్రాయుటకు వీలగుచున్నది.

1.ప్రాచీనులు
 గత సంచికలో(నవంబర్ 1979) బ్రకటించబడిన కుసుమాదిత్యుని క్రివ్వక శాసనముగాక కేంబ్రిడ్జి ప్రొఫెసరు సి.బెండాల్ అనునతడు పూర్వము నిజాం ప్రభుత్వ సేకరణలో భద్రము చేయబడియున్న తామ్రశాసనమొకదానిని నాల్గవ కుసుమాయుధుని దాన శాసనము ( Grant of Kusumayudha IV) అను శీర్షికతో ఇండియన్ ఆంటెక్వరీలో 1903లో ప్రకటించెను దానిని మొగలి చెరువుల దాన శాసన మని కూడా చెప్పుదురు. క్రింది పట్టికలోని నాల్గవ కుసుమాయుధుడు దోనెయశర్మకు మొగలి చెరువుల గ్రామమిచ్చినట్లిందు కలదు. ఈ మొగలి చెరువుల గ్రామము కొరవి ప్రాంతమున గలదు. ఈ చాలుక్యుల రాజధాని ఖమ్మం ప్రాంతంలోనున్న ముదిగొండ ఈ ప్రాంతము పూర్వము మంచి కొండ విషయమనబడెడిది. అందువలననే వీరు ఈ తామ్రశాసనములోను కొరవి శిలాశాసనములోను ముదుగొండ సల్కులిన చెప్పబడిరి. చరిత్రకారులు ముదిగొండ చాలుక్యులని చెప్పుదురు. మొగలి చెరువుల దానశాసనములో వీరిమూలపురుషుడు రణమర్దుడను చాలుక్యరాజుగా  బేర్కొనబడెను అందు వారి వంశమిట్లు చెప్పబడెను.
(వంశ వృక్షం చిత్రం)
క్రివ్వక శాసనమందువలే ఈ శాసనములో కూడా దానకాలము చెప్పబడలేదు. కడపటి వారగు నిర్జయరాజు కమ్మవాని కొడుకు కుసుమాయుదుడు(IV) క్రివ్వక శాసనములోని మొదటి రెండుతరములవారి పేర్లను పోటియుండుటను బట్టి ఈ రెండు తామ్రపట్టికలలో జెప్పబడిన వంశములు రెండు కలిసి యొకటియే కాదగునని ఊహించుటకు వీలగుచున్నది. క్రివ్వక శాసనములో నిర్జయ రాజునకు జేష్ట్యసోదరుడు కరియగొన గుణ్డు కొరవి వల్లభుండని విశేషించి చెప్పబడెను. అతని ప్రస్తావన మొగలి చెరువుల శాసనములో గానరాదు. అందుదానకర్తగా జెప్పబడిన నాల్గవ కుసుమాయుదునికి పెదతండ్రి అగుట వలన ప్రదానమగు వంశక్రమములో బేర్కొనబడలేదని భావించవలసి యున్నది. అప్పటికీ రాజులు ముదుగొండరాజులయియే జెప్పబడుజుండిరి కానీ కొరవి వల్లభులని రూడిగా చెప్పబడలేదు. క్రివ్వక శాసనమునాటికి వారు. ముదుగొండను పూర్తిగా విడిచి కొరవిలో కొంతకాలము స్థిరిపడిరనుకొనవలసి వున్నది. అట్లు తమవంశమును కొరవికి తరలించిన వాడు కరియ గొనగుడగుటచే నతనిని క్రివ్వక శాసనములలో స్మరించి యుందురు. కాన మరికొంత కాలమునకు వీరు కొరవిని విడిచి బొట్టు అనుచోటునకు తరలిపోయినట్లు తెలియుచున్నది. క్రివ్వక శాసనము మూలములో 21వ పంక్తియందు బొట్టున వాని ప్రధానులు అని బొట్టు అనెడిది యొక ప్రదేశముగ జెప్పబడెనని తెలియుచున్నది. అందువలననే శాసన దాతయగు కుసుమాదిత్యుని తండ్రి బొట్టుచేత భూపాలుడని క్రివ్వక శాసనములో బేర్కొనబడెను. బొట్టునకు తరలిపోయినది ఈ బేతరాజో లేక యతని తండ్రి, తాత, ముత్తాతలో నెవరో సరిగా తెలియదు. ఈ విధముగ తమ స్థావరమును మార్చుకోనుచుండుచే వీరిని ముదుగొండచాలుక్యులు లేక కొరవి చాలుక్యులు లేక బొట్టు చాలుక్యులు అని తరచుగ పేర్కొనుచున్నారు.
        ఈ రెండు తామ్ర శాసనములందు మొత్తము 8+6=14 తరముల వారు పేర్కొనబడిరి. వారలో నిజ్జయరాజు, అతని కొడుకు నాల్గవ కుసుమాయుధుడు రెండింటిలో నొకరే యనుకొన్నచో 12 తరముల వారు మిగులుదురు. వీరుగాక మొదట వంశకర్తయగు రణమర్దుని అన్న కొక్కి(లి రాజు, క్రివ్వక శాసనములో నిజ్జయరాజు అన్న కరియగొనగుడు అను మరి ఇరువురు జెప్పబడియుండుట చేత మొత్తము 14 మంది 12 తరములలో ముదిగొండ కొరవి ప్రాంతములో రాజ్యమేలిరని తెలియుచున్నది. అనగా సుమారు మున్నూరేండ్లకు పైగా  వారా ప్రాంతమును పాలించిరి. కానీ రెండు తామ్రశాసనములలోను కాలము చెప్పబడకుండుట వలన వారిని గూర్చిన సరియగు కాలక్రమము తెలుసుకొనుట కష్టమగుచున్నది. ఈ చాలుక్యులను గూర్చి తెలుపు రెండు తామ్రశాసనాలను బట్టి యింతవరకు కొంత తెలిసికొంటిమి. ఆ రెండింటిలోను చెప్పబడిన వంశముల నొకటిగా కలిపి గ్రహించుటకు వీలగునని స్థూలముగ జెప్పితిని. అయినను వారి కాల నిర్ణయము చేసిన గాని అది ప్రామాణికము కాజాలదు. వారికి సంభందించిన శిలాశాసనములు నాలుగు మాత్రము గలవు. (1) కొరవిలోను (2) చెన్నూరు లోనూ (3) గూడూరు లోనూ (4) నత్తరామేశ్వరము లోనూ ఆ శాసనములు గలవు.

1.     కొరవి శాసనము : వరంగల్లు జిల్లా మానుకోట (మహబూబాబాదు) కు సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరములో కొరవి అను గ్రామము కలదు. అందు వీరభద్రుని గుడి ప్రసిధ్దమైనది. అచట రెండు శాసన ఖండములు గలవు. వాటినొకటి మొదటి భాగమనియు, రెండవది తుది భాగమనియు వ్రాతయొక్క మొదల, తుదిని బట్టి చెప్పవచ్చును. రాతి కొలతలు కూడా వొక కాలమునకు చెందినవే. కానీ రెండును ఒకే శాసన ఖండములని రూఢిగ జెప్పవీలుగాకున్నది. శాసనకాలము రెండింలిలోను లేదు. వీటిని గూర్చి కొంతకాలము క్రింది కొందరు శాసన ఖండములని రూఢిగ జెప్పవీలుగాకున్నది. శాసనకాలములు రెండిటిలోనూ లేదు. వీటిని గూర్చి కొంతకాలము క్రింది కొందరు శాసన పరిశోధకులు వేరు వేరు వ్యాసములను ఎపిగ్రాఫికా ఆంధ్రికా అను ఆంగ్ల పరిశోధక వ్యాససంపుటి మొదటి భాగములో ప్రకటించిరి. ఇది యొక విచిత్ర శాసనము ఇందు జెప్పబడిన రాజకీయాంశములు సులభగ్రాహ్యము గావు. లోగడ తెలుగు శాసనములు అను పుస్తకములో దీనిని గూర్చి నేనొక వ్యాసము వ్రాసి యుంటిని. అందిరువురు చాలుక్య భీముల ప్రస్తావన గలదు. వీరిరువురు వేంగి మండలము నేలిన తూర్పు చాలుక్య శాఖకు చెందిన వారు. మొదటి చాలుక్య భీముడు క్రీ.శ 892 నుండి 922 వరకు ముప్పది ఏండ్లు పాలించెను. ఇతను గుణగ మిజయాధిత్యుని తమ్ముడగు యువరాజు విక్రమాదిత్యుని కొడుకు. ఈ భీముడు రాజ్యమునకు వచ్చునపుడు రాష్ట్రకూట రెండవ కృష్ణుడు (క్రీ.శ 880-912) వేంగిపై దండెత్తెను. ఆ సందర్బమున త్రోవలో నుండు ముదిగొండ చాలుక్య రాజగు కుసుమాయుదుని సంహరించెను. ఇతడు చాలుక్య భీముని పక్షమువాడు. కుసుమాయుధుని పెద్ద కొడుకగు గొణగయ్య తండ్రి పోయినను యుద్దములో దైర్యము విడువక పోరాడి రాష్ట్రకూటులు దురాక్రమణ జేసికొనిన కొరవి వరకు గల తమ భూభాగమునను తిరిగి స్వాధీనము జేసికొనెను. చాళుక్య భీమునికి అండగా నిలచి వేంగీ రాజ్యమును కాపాడుచుండెను. తని తండ్రియగు (మూడవ) కుసుమాయుదుడు గుణగ విజయాదిత్యునికి సామంతుడై యుండి  రాజు పేరునే తన కుమారునికి బెట్టెను. అదియే గుణగయ్య లేక గొణగయ్య. కొరవి శాసనము రెండవ ఖండములో అనుంగు గొణగుణ్డు అని కూడ పేర్కొనబడెను. రాష్ట్ర కూట కృష్ణుడు ఆక్రమించుకొన్న రాజ్యమును తిరిగి సంపాదించుకొనుటయే గాక చాలుక్యభీమునినికి ముఖ్యుడగుటను బట్టి యితనికి అనుంగుడను పేరుండియుండును. భీముడితనిని రాష్ట్రకూట రాజ్యమునకు వేంగి రాజ్యమునకు గడి స్థానమగు కొరవిలో కాపుంచెను. అందుచే ముదిగొండ నుండి తమ రాజధానిని కొరవికి మార్చిన వాడితడనియే చెప్పవలయును. వీరి వంశములోని గొణగయ్య ఈ ఘనకార్యము అనగా తండ్రి యుద్ధములో చనిపోయినను తన బల పరాక్రమములతో శత్రువశమైన రాజ్యమును తిరిగి సంపాదించి కొరవిలో సుప్రత్రిష్ఠితుడగుటను బట్టి వంశ చరిత్రలో నితని ఘనత కొనియాడబడుట గాన వచ్చును. పై జెప్పిన క్రివ్వక శాసనములో అప్రస్తుతమై యున్నను కరియ గొణగుడు కొరవి వల్లభుడైనట్ కీర్తించబడెను. కరియ అనగా వల్లనివాడని తెలియుచున్నది. దీదనిని బట్టి వేరొక గొణగుడున్నట్లు సూచితమగుచున్నది గదా ఆ వెరొక గొణగుడు కొరవి శాసనములోని అమంగు గొణగుడేల కాకూడనవచ్చును. కానీ ఆపూర్వమగు కొరవిపురవల్లభ యమ వేషణము కొరవి శాసనమును బట్టి  అనుంగు గొణగునికి కంఠోక్తిగ జెప్పబడకున్నను అందలి విషయ పద్యాలోచనము వలన స్పష్టమగుచున్నది. క్రివ్వక శాసనములో కరియ గొణగుని కది కంఠోక్తిగ జెప్పబడెను. కనుక నిరువురు నొకరే యై వుందురని తోచురున్నది. అనుంగు పదమునకు స్వామికి ముఖ్యుడని మాత్రమే యచట జెప్పవలెను. కారవి శాసనము అనుంగు గొనగణ్ణను పేతితో అలుక్య భీమణ్డున్దను అని అప్పటి సందర్బమునకు తగినట్లే ఆ వివేషణము వాడబడెను. అనగా కరియ గొనంగడను నిజనామములో కరియ అను విశేషణమునకు బదులు అనుంగుఅను విశేషణము తాత్కాలికముగ జేర్చబడెనని తెలియుచున్నది.కనుక వారిరువురు ఒకే వ్యక్తిని సూచించుననుట సహేతుకమనిపించును. కాగా,కరియగొనగుడు కానట్టి వేరొక గొణగుడెవరు కాదగువో చెప్పవలయును. వరంగల్లు తాలూకా నారాయణగిరియను గ్రామ పరిసరమున నొక గుండు రాతిపైన నొక కన్నడ శాసనములో మహాసామన్తాధిపతి సత్యాశ్రయ కుళాన్వయ శ్రీమత్ గుణగ రస రుత్తరోత్తరాభివృద్ది యొళ్ అని యొక గుణగయ్య మహాసామన్తరాజుగ జెప్పబడెను. ఆ శాసనము :శకాబ్ధము 927 అనగా క్రీ.శ.1004 నాటిది. అప్పటికి ఆర్వాచీన చాళుక్యవంశ స్థాపన జరిగి యిమ్మడి తైలపుని కొడుకగు ఇరివబెడంగ సత్యాశ్రయుడు చక్రవర్తిగ అనుమకొండ ప్రాంతములో గానవచ్చును. ఈ నత్యాశ్రయ వం:శమువాడగు గుణగుడు కొరవి శాసనములో జెప్పబడిన అనుంగుగొణగుడు కాజాలడు.కొరవి శాసనము క్రీ.శ  934 ప్రాంతము నాటిది.ఇది క్రీ.వ.1004 నాటిది.అయినను క్రివ్వక శాసనములోని కరియగొనగుడు నారాయణగిరి శాసనములోని గుణగరసుడుకాగూడదా యనవచ్చును.ఇద్దరూ  చాలుక్యాన్వయులే .కానీ కొరవి చాలుక్యులెచటను మహాసామంతాధిపతులుగ జెప్పబడలేదు.అంతేగాక నారాయణగిరి శాసనములోని గుణగరసు కొరవి పురమునకు సంబంధించిన వాడగ ఈ శాసనములో జెప్పబడలేదు. క్రవివక శాసనములోని గుణంగుడు విశేషించి కొరవి పురవల్లభుండని చెప్పబడెను. అట్టివాడు కొరవి శాసనములోని అనుంగు గొణంగుడు మాత్రమే కాని యతరుడు కానేరడు. అతడే కరియ గొణంగుడు. అతడు క్రీ.శ 934 నాటి వాడు. క్రీ.శ 1004 నాటి నారాయణగిరి శాసనములోని గుణగరసుడు చాలుక్య సత్యాశ్రయుని క్రింద వేరొక సామంతుడనుకొన వలెను. అతడును చాలుక్యాన్వయుడే. ఇతని నుద్దేశించి కనుగొనగుడు. 8కరియ యను విశేషణముతో జెప్పబడలేదు. కరియ గొణగునికి సమకాలికుడగు వేరొక గొణగయ్య యెవరైనది మనకు తెలియదు. కాని గొణగుని తండ్రి యగు కుసుమాయుదునికి స్వామియు, చాలుక్య భీమునికి పెదతండ్రియు నగు ప్రసిధ్ద గుణగవియాదిత్యుడే ఆ మరొక గొణగయ్యయనవచ్చును. ఆ రాజును గుణగ, గుణక్కెవల్ల అను బిరుద నామములతో బేర్కొనుట శాసనములందు గానవచ్చును. అందుచేత కొదవి గొణగయ్యను వేరుగ జెప్పుటకై కరియ గొణగయ్య యని వాడుకయై యుండుటలో నసహజమేమియు లేదు. కనుక వొరవి శాసనమందు జెప్పబడిన అనుంగు గొణగయ్య క్రివక శాసనములోని కరియ గొణగయ్యయు నొకే వ్యక్తి కాదని నిరూపించజాలము.
కొరవి శాసనములో గొణగయ్య తరువాత నతని తమ్ముడగు విరవద్యుడు భీమసలుకి అనగా వేంగిరాజగు రెండవ భీమున (క్రీ.శ 934-945 ) కనుకూలుడై కొరవికి పాలకుడయ్యెనునని చెప్పబడెను. ఆ సందర్భమున నతడు కొరవి గ్రామ నాయకునకు కొన్ని పన్నులు వసూలు చేసికొనునట్టి యధికార మొసగును. క్రీ.శ 934లో కూడ కొరవిలోను వేంగిలోనూ రాష్ట్రకూట నాల్గవ గోవిందుని ప్రొద్భలమున రాజకీయంతర్గత కలమములు చెలరేగెను. వేంగిలో యుద్దమల్లుని జంపి మొదటి అమ్మరాజునకు సవతి తమ్ముడగు రెండవ భీముడు రాజ్యము చేజిక్కించుకొనెను. కొరవిలోని గొణగయ్య అమ్మరాజు కొడుకునకు తన సమాయమును బ్రకటించుటచేత యుద్దమల్లుని పక్షమువచ్చిన రాష్ట్రకూట గోవిందుని సైన్యములు అతనిని కొరవి నుండి తరిమి వేయగా నతడు వేముల వాడ చాలుక్యరాజగు రెండవ అరికేసరి నాశ్రయించెను. అరికేసరి గోవిందునికి శత్రువు. గోవిందుని చంపించి రాష్ట్రకూట సింహాసనముపై మూడవ అమోఘవర్షని నెక్కించెను. ఈ మార్పిడిలోనే వేంగిలో రెండవ భీముడు యుద్దమల్లుని జంపి సింహాసన మాక్రమించు కొనెను.  ఈ అదను చూసి కొరవి నుండి గొణగయ్య పారిపోయెను గనుక నతని తమ్ముడు వీరవర్యుడు, రెండవ భీముని సమాయములో కొరవికి రాజయ్యెను. ఇంతలో గొణగయ్య వఈద్దుడై చనిపోయియుండును అతని కొడుకగు బద్దెగుడు అరికేసరికి సామంతుడుగ కాళేవ్వరము-చెన్నూరు ప్రాంతముల నేలుచున్నాట్లు క్రీ.శ 942 నాటి చెన్నూరుశాసన మొకటి తెలుపు చున్నది. క్రీ.శ 934లో వేంగి చాళుక్యులలోను, రాష్ట్రకూట వంశములోను వెనుకటి రాజులను తొలగించి వారి దాయాదులు సింహాసనము లాక్రమిచుకొనిరి. అట్టి మార్పు మధ్యనున్న చిన్న కొరవి రాజ్యములలో గూడ వచ్చెను. వేంగి సింహాసనమునకు వారసుడైన మొదటి అమ్మరాజు కొడుకగు బేత (లేక) కణ్థిక విజయాదిత్యుని తరిమివైచి మొదటి తాడపరాజు భీముని రెండవ కొడుకగు రెండవ విక్రమాదిత్యుడీ తాడప రాజును జంపి రాజయ్యెను. సంవత్సరములోపుగనే యితనిని జంపి అమ్మరాజు  రెండవ కొడుకు రాజయ్యెను. కొద్ది నెలలలో నితనిని జంపి తాడవుని కొడుకగు రెండవ యుద్ద మల్లుడు రాష్ట్రకూట నాల్గవ గోవిందుని సమాయంతో క్రీ.శ 930 ప్రాంతమున వేంగి సింహాసనమధిష్టించెను. యినను నిజముగ వారసుడగు అమ్మరాజు కొడుకగు కణ్థిక విజయాదిత్యుడు, ఇతని పిన తండ్రియగు రెండవ భీముడు విడివిడిగా యుద్ధమల్లునిపై కాలుద్వుచుండిరి. ఈ పరిస్థితిలో కొరవిలోని గొణగయ్య న్యాసమ్మతముగ మొదటి అమ్మరాజు కొడుకైన కణ్థిక విజయాదిత్యుని పక్షము వహించినట్లు తోచును . అతని త్ముడగు నిరవద్యుడు రాజుకాదు గనుక కొరవిని విడిచి వేంగి దేశమున రెండవ భీముని పక్షమున చేరెను. ఇంతో యుద్దమల్లునికి సమాయముగ రాష్ట్రకూటగోవిందుని సైన్యములు వేంగి ముఖముగ తరలి వచ్చును దోవలోనున్న కొరవిపై దాడిచేసిరి. యుద్ధమల్లుడి కొక విరోధి యైనందున కొరవి రాజైన అనుంగుగొణగయ్య గోవిందుని పైన్యము నెదుర్కొన శక్తి చాలక పోవుట చేతను, వేంగిలో నిపుడు తన కాశ్రయమిచ్చువారు లేకపోవుట చేతను ప్రక్కనున్న వేములవాడ రాజగు చాలుక్య రెండవ అరికేసరి యెద్దకు చేరెను. ఈ యరికేసరి గోవిందునికి శత్రువు. ఇతడు తరువాత కొద్దికాలములోనే క్రీ.శ. 934-35 లో గోవిందుని దేశమునుండి పారదోలి బద్దగుడను మూడవ అమోఘవర్షుని రాష్ట్రకూట సింహాసన మెక్కించెను. గోవిందుని పరాజయముతో వేంగిలో యుద్దమల్లుని బలము తగ్గెను. రెండవ చాలుక్య భీముడు (భీమపతికి) యుధ్దమల్లు నెదిర్చి వేంగి సింహాసనమాక్రమించుకొనెను. తననాశ్రయించియున్న కొరవి నిరవద్యుని కొరవి రాజ్యమునందు తనకు అనుకూలుడగు సామంతుకి బ్రతిష్టించెను.  సందర్భమున నిరవద్యుడు కొరవి నాయకుడగు పెద్దనను రావించి యతనికి కొన్నిపన్నులు వసూలు చేసికొనునాధికారమొసగి తన పమేయుండవలెనని చెప్పుటకై యతనిచే కొరవి శిలాశాసనము వేయబడెను. కొరవిపురవల్లభుడని పొగడ్తనొందిన గొణగయ్య ఈ విదముగ కొరవిని పూర్తిగ విడిచి పోవలసిన వాడయ్యెను. అతడు న్యాయము కొరకై వేంగి సింహాసనమునకు వారసుడైన కణ్థిక విజయాదిత్యుని పక్షమున యుద్దమల్లుని దురాక్రమణము నెదుర్కొనుచు రాష్ట్రకూటగోవిందునికి శత్రువు కావలసి వచ్చెను. తానాశ్రయించిన వేములవాడ రెండవ అరికేసరి గోవిందుని పదవీభ్రష్టుని గావించినను తనకేమియు లాభము కలుగలేదు. మూడవ పక్షమువాడైన రెండవ చాలుక్యభీముడు వేంగి సింహాసనము నాక్రమించుకొనుటవలన నతనికి సహాయముగనున్న నిరవద్యుడు కొరవి దేశమున కధిపతి కాగలిగెను. రాజకీయ నాయకుల యదృష్టములు కొద్దిలో తారుమారగుననుట కిది యొక చక్కటి యుదాహరణ.
ఇంతలో గొణగయ్య చనిపోయినట్లు తోచును. గోదావరి తీరమున చెన్నూరు గ్రాములో నగస్తైశ్వరాలయము వద్దనున్న శాసన ములో శకము 863 ప్రాంతమున (క్రీ.శ.941) చాలుక్య గొణగరమని కొడుకైన బద్దెన ఒకడు అరికేసరి ప్రాపున జేరి పోదననాడు(నేటి బోధన్) చేరిన తేకుబట్టు – 70 రాజ్యభాగములో నొక యగ్రహారమునకు సంబంధించిన దానమొసగినట్లు చెప్పబడెను. దీనిని బట్టి కొరవి గొణగయ్య కొడుకు కూడ అరికేసరికి సామంతుడగ నచటనే స్థిరపడెను. కొరవిలో మిగిలినది నిరవద్యుని వంశమని దీని వలన స్పష్టమగుచున్నది. ఈ విషయము కొరవి శిలాశాసనములో క్లుప్తముగ సూచించబడెను. అప్పటి వేంగి రాజకీయములను, రాష్ట్రకూట రాజకీయములను సరిగా సమన్వయము చేసికొనినగాని యీ కొరవి శాసన మర్దముకాదు. క్రివ్వక శాసనము కరియ గొణగయ్యను కొరివి పురవల్లభుడని మాత్రము చెప్పియంతటితో నతని వంశమును వదిలి తమ్ముడగు నిజ్జయరాజు వంశమే యచట స్థిరపడినట్లు చెప్పును.  (ఇంకావుంది.......................... )








ఒరిజినల్ ఆర్టికల్ స్కాన్ కాపీ 

ఖమ్మంజిల్లా ముదిగొండ ప్రాంతంలో రాజ్యమేలి, ముదిగొండ ప్రాంతం పేరుమీదుగానే పేరొందిన చాళుక్య వంశం గురించి 1979 నాటి ‘‘భారతి’’ పత్రిక ఆర్కైవ్స్ నుండి పి.వి పరబ్రహ్మశాస్త్రి గారి ఆర్టికల్
దీనిని సాధించటంలో సహకరించిన శ్రీ కపిల రాంకుమార్ గారికి, (తెలంగాణ సోయి పత్రికకు ప్రత్యేక ధన్యవాదాలతో....

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి