కొంచెం బుర్రకానీ పనిచేయాలే కానీ ఇది అసాధ్యమేం కాదు


Post by Katta Srinivas.

పర్యావరణ గణపతి విగ్రహాలను గురించి ఇప్పటికే మీకు చాలా తెలిసేవుంటుంది.
నేనా విషయాన్ని ఇప్పుడు చెప్పబోవటంలేదు.
లంచ్ బ్రెక్ లో కాచిగూడా గుండా వస్తున్నపుడు
తయారీ దశలో వున్న గణపతి విగ్రహం కనిపించింది.
అక్కడ చిన్న పసుపు రంగు వస్త్రపు పేలిక నన్ను ప్రత్యేకంగా ఆకర్షించింది.
పనిలో ఇంత లోతైన భాద్యతాయుతమైన శ్రద్ద కలగాలంటే దేవుడనే భావన తప్ప మరో మార్గంలేదా అనికూడా అనిపించింది.
.................
రక్తమాంసాలతో తిరుగుతున్న మనుషుల మానగౌరవం కాసులో పేర్పిడిలో లెక్కలేకుండా పోతున్న దశలో
మనసులో గౌరవించగలిగే సున్నిమైన కోణమంటూ మిగుల్చుకున్న వారికి
మట్టిబొమ్మలోనూ దేవుడినీ, అతని గౌరవాన్నీ చూడగలిగే మానసిక నేత్రాలున్న రోజుకూలీ పనివాళ్ళలో నిజంగా దేవుడు కనిపించినట్లయ్యింది. (మరికొన్ని ఫోటోలు పర్యావరణ గణపతుల తయారీ కేంద్ర దగ్గరివి)

కామెంట్‌లు