కడక్ నాధ్ కోళ్ళు

The Kadaknath is an Indian breed of chicken local to the Madhya Pradesh area, where it is known as "Kali masi" ("fowl having black flesh"). The Kadaknath is popular mainly for its adaptability, and the good-tasting black meat,which is believed to infuse vigor. Its color stems from the deposition of melanin pigment.



The birds are completely black: black plumage with a greenish iridescence, black legs and toe nails, black beak and tongue, black comb and wattles, black meat and bones and even dark organs.

Due to the meat's alleged medicinal properties, it is in high demand. To save the breed from extinction, the state government started a Kadaknath poultry breeding program involving 500 BPL families, who were to receive financial support and assistance.

కడకనాథ్ క్రాస్ కోళ్ళనే కారీ శ్వామా  అనికూడా అంటారు.
  • ప్రాంతీయంగా ‘కలమాశి’ అంటారు, అంటే దీని అర్ధం నల్లని మాంసం కలది – మధ్యప్రదేశ్ లోని జాబ్యూ మరియు ధర్ జిల్లాలు, రాజస్థాన్ మరియు గుజరాతీ సరిహద్దు ప్రాంతాలలో సుమారు 800 చ. మైళ్ళ విస్తీర్ణంలో వ్యాపించి వుంటాయి.
  • వీటిని ఎక్కువగా కొండ జాతులు, ఆదివాసి ప్రజలు, గ్రామీణ ప్రాంతాలలో పెంచుతారు. దీనిని పవిత్ర మైన జాతిగా గుర్తించి, దీపావళి పండుగలో దేవునికి నైవేధ్యంగా పెడతారు.
  • రోజుల కోడి పిల్ల నీలం రంగు నుంచి నలుపు వరకు ఉండి, వీపు మీద ముదురు రంగు గీతలు ఉంటాయి. ఈ జాతి మాంసం నల్లగా ఉన్నా, దీనికి చాలా ఔషధ విలువలతోపాటు.సెక్సు సామర్ధ్యాన్ని పెంచుతుందని నమ్ముతారు
  • ఆదివాసీ దీని రక్తాన్ని చాలా దీర్ఘ కాల జబ్బులకు ఉపయోగిస్తారు.
  • గ్రుడ్లు, మాంసం లో ప్రొటీన్లు (25.47%) మరియు ఇనుము ఎక్కువగా ఉంటుంది.
  • 20 వారాల వయస్సులో 920గ్రాముల బరువు ఉంటుంది.
  • గ్రుడ్లు పెట్టే వయస్సు – 180 రోజులు.
  • సంవత్సరనికి గ్రుడ్ల ఉత్పత్తి – 105
  • 40 వారాల వయస్సుకి గ్రుడ్ల బరువు 49 గ్రా
  • గ్రుడ్లు పెట్టే సామర్థ్యం - 55%






కోళ్ళలో ఇతర రకాలు.....................

కారీ నిర్ బీక్ ( అసీల్ క్రాస్)
  • అసీల్ అంటే ‘స్వచ్ఛత’ అని అర్థం. ఈ జాతి కోళ్ళు బాగా బలంగా, ఠీవితో తట్టుకునే శక్తి ఎక్కువగా, దెబ్బలాడే గుణం కలిగి ఉంటాయి.
  • ఈ జాతి కోళ్ళకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పుట్టినిల్లు.
  • ఈ కోళ్ళ చాలా పెద్దవిగా, అందంగా ఉంటాయి.
  • పుంజులు 3 నుండి 4 కిలోల వరకు బరువు ఉండి, పెట్టలు 2 నుండి 3 కిలోల ఉంటాయి.
  • గ్రుడ్లు పెట్టే వయస్సు 196 రోజులు
  • సంవత్సరములో గ్రుడ్లు ఉత్పత్తి -92
  • 40 వారాల వయస్సులో గ్రుడ్ల బరువు 50గ్రా.
హితకారీ (నేకడ్ నెక్ క్రాస్)
  • ఈ జాతి పెద్దగా ఉండి పొడవైన ఈకలు లేని మెడ ఉంటుంది.
  • మగ కోడిలో పరిపక్వ దశకు వచ్చే సరికి మెడ భాగం ఎర్రగా మారుతుంది.
  • కేరళ లోని త్రివేండ్రం దీనికి పుట్టినిల్లు.
  • 20 వారాలు వయస్సులో దాని బరువు 1005 గ్రా
  • గ్రుడ్లు పెట్టే వయస్సు 201 రోజులు.
  • గ్రుడ్ల ఉత్పత్తి సంఖ్య 99 సంవత్సరానికి
  • 40 వారాలు వయస్సులో గ్రుడ్లు బరువు 54 గ్రా
  • గ్రుడ్లు పెట్టే సామర్థ్యం - 66%
ఉపకారి (ఫ్రిజెల్ క్రాస్)
  • దేశవాళీ కోడిలాగా ఉండి, ఉష్ణ ప్రాంతాలకు, బాగా అలవాటు పడి, రోగనిరోధక శక్తి బాగా ఉండి, మంచి పెరుగుదల, ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది.
  • పెరటిలో పెంచేందుకు బాగా అనువైనది.
  • ఉపకారి కోళ్ళ వివిధ వాతావరణ పరిస్ధితులకు అనువైన రకాలు
  • కడకనాధ్ x డెహలామ్ రెడ్
  • అసిల్ x డెహలామ్ రెడ్
  • నేకడ్ నెక్ x డెహలామ్ రెడ్
  • ఫ్రిజిల్ x డెహలామ్ రెడ్
  • గ్రుడ్లు పెట్టేందుకు వయస్సు – 170-180 రోజులు.
  • వార్షిక గ్రుడ్ల ఉత్పత్తి – 165 నుండి180 గ్రుడ్లు
  • గ్రుడ్ల బరువు – 52 నుండి 55గ్రా
  • బ్రౌను రంగు గ్రుడ్లు
  • గ్రుడ్లు నాణ్యత బాగుంటుంది.
  • బతకగల సామర్థ్యం 95%
బ్రాయిలర్లు
కారీబ్ర్ –విషాల్ ( కారీబ్రో -91
  • రోజుల పిల్ల బరువు – 43 గ్రా
  • 2. ఆరు వారాల వయస్సు ఉన్న కోడి బరువు – 1650 - 1700గ్రా
  • 3. ఏడు వారాల వయస్సు ఉన్న కోడి బరువు- 2100-2200గ్రా
  • డ్రెసింగ్ శాతం 75%
  • బతకగల సామర్థ్యం 97-98%
  • ఆరు వారాలకు ఫీడ్ కన్వర్షెన్ నిష్పత్తి  1.94 -2.20
కారీ – రైన్ బ్రో (బి-77)
  • రోజుల పిల్ల బరువు –41 గ్రా
  • ఆరు వారాల వయస్సు ఉన్న కోడి బరువు – 1300 గ్రా
  • ఏడు వారాలు వయస్సు ఉన్న కోడి బరువు- 1600 గ్రా
  • డ్రెసింగ్ శాతం 73%
  • బతకగల సామర్థ్యం 98-99%
  • ఆరు వారాలకు ఫీడ్ కన్వర్షెన్ నిష్పత్తి 2.3
కారీబ్రో – ధనరాజు ( రంగులది)
  • రోజుల పిల్ల బరువు –46 గ్రా
  • ఆరు వారాల వయస్సు ఉన్న కోడి బరువు – 1600-1650 గ్రా
  • ఏడు వారాల వయస్సు ఉన్న కోడి బరువు- 2000-2150 గ్రా
  • డ్రెసింగ్ శాతం 73%
  • బతకగల సామర్థ్యం 98-99%
  • ఆరు వారాలకు ఫీడ్ కన్వర్షెన్ నిష్పత్తి 1.90-2.10
కారీబ్ర్ – మృత్యుంజయ్ (కారీ నేకడ్ నెక్)
  • రోజుల పిల్ల బరువు –42 గ్రా
  • ఆరు వారాల వయస్సు ఉన్న కోడి బరువు – 1650-1700 గ్రా
  • ఏడు వారాల వయస్సు ఉన్న కోడి బరువు- 2000-2150 గ్రా
  • డ్రెసింగ్ శాతం 77%
  • బతకగల సామర్థ్యం 97-98%
  • ఆరు వారాలకు ఫీడ్ కన్వర్షెన్ నిష్పత్తి 1.9-2.0
క్వయిల్
ప్రస్తుత కాలంలో జపనీస్ క్వయిల్ ఒక సంచలనం సృష్టించింది. దేశంలో చాలా చోట్ల గ్రుడ్లకు మరియు మాంసం కొరకు దీని పెంపకాన్ని వ్యాపారపరంగా చేపడుతున్నారు.
వినియోగదారుల నుండి ఈ విధమైన నాణ్యమైన మాంసానికి మంచి గిరాకీ వుంది
ఈ పక్షుల పెంపకం లాభసాటిగా ఉంటుంది దానికి కారణాలు :
  • సంవత్సరానికి వీటి ఉత్పత్తి మూడు నుంచి నాలుగు తరాల వరకు జరుగుతుంది.
  • రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ.
  • వ్యాక్సిన్ లు వేయనవసరం లేదు.
  • తక్కువ నేల  అవసరమవుతుంది.
  • పెంచడం సులభం
  • తొందరగా పరిణితి చెందుతుంది.
  • 42 రోజుల వయస్సు లోనే ఇవి గ్రుడ్లు పెడతాయి.
కారీ ఉత్తమ్
  • గ్రుడ్లు పొదిగే శాతం 60-76%
  • నాలుగు వారాలకు బరువు 150గ్రా
  • ఐదు వారాలకు బరువు 170-190గ్రా
  •  నాలుగు వారాలకు మేత తినే సామర్ధ్యం 2.51
  • ఐదు వారాలకు మేత తినే సామర్ధ్యం 2.80
  • రోజు వారీ తినే మేత సామర్ధ్యం 25-28గ్రా
కారీ ఉజ్వల్
  • గ్రుడ్లు పొదిగే శాతం 65%
  • నాలుగు వారాలకు బరువు 140గ్రా
  • ఐదు వారాలకు బరువు 170-175గ్రా
  • ఐదు వారాలకు మేత తినే సామర్ధ్యం 2.93
  • రోజు వారీ తినే మేత సామర్ధ్యం 25-28గ్రా
కారీ శ్వేత
  • గ్రుడ్లు పొదిగే శాతం 50-60%
  • నాలుగు వారాలకు బరువు 135గ్రా
  • ఐదు వారాలకు బరువు 155-165గ్రా
  • నాలుగు వారాలకు మేత తినే సామర్ధ్యం 2.85
  • ఐదు వారాలకు మేత తినే సామర్ధ్యం 2.90
  • రోజు వారీ తినే మేత సామర్ధ్యం 25గ్రా
కారీ పరల్ (కారీ ముత్యం)
  • గ్రుడ్లు పొదిగే శాతం 65-70%
  • నాలుగు వారాలకు బరువు 120గ్రా
  • రోజు వారీ తినే మేత సామర్ధ్యం 25గ్రా
  • 50% గ్రుడ్లు ఉత్పత్తి చేసే వయస్సు 8-10 వారాలు
గునియా కోళ్ళు(గిన్ని కోళ్ళు)
  • చిన్న, సన్న కారు రైతులకు పెంచుటకు అనువైనది.|స్వేచ్చగా తిరిగి జీవించే జాతి
  • కాదంబరి, చితంబరి, శ్యేతాంబరి అను రకాలు అందుబాటులో ఉన్నాయి.
ముఖ్య లక్షణాలు
  • చాలా దిట్టమైన పక్షి
  • ఏలాంటి వాతావరణానికైనా అనువైనది.
  • కోడికి వచ్చే చాలా జబ్బులను తట్టుకోగలదు
  • వీటి పెంపకం చాలా సులభతరం
  • మైకోటాక్సిన్ మరియు ఎఫ్లటాక్సిను తట్టుకోగలదు
  • అన్ని రకాల మేతను తింటుంది
  • గ్రుడ్లు పెంకు గట్టిగా ఉన్నందువల్ల, పగలటం తక్కువగా వుండి, ఎక్కువ రోజులు నిల్వ వుంటాయి.
  • దీని మాంసం లో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి మరియు క్రొవ్వు శాతం తక్కువగా ఉంటుంది.
ఉత్పత్తి లక్షణాలు
  • 8 వారాలకు బరువు  500 -550 గ్రా
  • 12 వారాలకు బరువు  900-1000 గ్రా
  • మొదటి గ్రుడ్డు పెట్టేటప్పుటికి వయస్సు 230-250 రోజులు
  • గ్రుడ్డు బరువు 38-40గ్రా
  • గ్రుడ్లు ఉత్పత్తి 100-120
  • గ్రుడ్లు పెట్టే సామర్ధ్యం 70 – 75 %
  • గ్రుడ్లు పొదిగే సామర్ధ్యం 70 - 80%

కామెంట్‌లు