Monday, 6 June 2016

టెక్ సంగమం పరిచయం

కవిమిత్రులకు కొన్ని సాంకేతికాంశాలలో సూచనలందించేదుకు ఈ శీర్షికను నిర్వహిస్తున్నాం.

టెక్ సావీల నుంచి టాబ్లెట్ పై ఓనమాలేమో కానీ ఒపెరా మినీ ఎక్కడుందో వెతుక్కునే వారి వరకూ వేర్వేరు స్థాయిల సాంకేతిక కవులు మన కవిసంగమం గ్రూపులో వున్నారు. 

ఫేస్ బుక్ సామాజిక మాధ్యమంలో జరుగుతున్న సాహితీవ్యవసాయానికి చేదోడుగా వుండేందుకు అవసరమైనన్ని విశేషాలను మాత్రం వారానికి ఒక్కటి చొప్పున్న ముచ్చటించుకుందాం. శీర్షిక నిర్వాహకునిగా కట్టా శ్రీనివాస్ వ్యవహరిస్తున్నప్పటికీ ఆయా అంశాలలో మరింత సులభమైన, సూటిగా ఉపయోగ పడే పద్దతులుంటే పార్టిసిపెంట్స్ టీచర్లుగా కొత్త అంశాలను మిత్రులతో పంచుకోవచ్చు.

దీనిలో చర్చద్దామని ముసాయిదాగా అనుకుంటున్న అంశాలివి. మరేమైనా మార్పులూ చేర్పులూ వుంటే సూచించండి.

1) కవిసంగమం లోని సాంకేతిక కవితా సేద్యానికి ఆలంబన ఫేస్ బుక్ కాబట్టి ఫేస్ బుక్ అకౌంట్ ఏర్పాటు చేసుకోవడం దానిని నిర్వహించుకోవడం, కవిసంగమంలో సభ్యత్వం పొందటం ప్రాధమిక అంశం

2) తెలుగులో టైపు చేయడం ఎలా?

3) రిమోట్ లాగ్ అవుట్, సెక్యూరిటీ అంశాలలో అవసరమైన జాగ్రత్తలు

4) కాపీ పేస్టు, ఎంబెడ్, సేవ్ యూ ఆర్ ఎల్ టేకింగ్ డేట్ స్టాంప్ సెర్చ్ వగైరా అంశాలు

5) బ్లాగు నిర్వహణ తో బ్యాక్ అప్ ఎలా చేసుకోవచ్చు.

6) వికీ సభ్యులుగా మనం ఏలా మారాలి ఏమేం చేయోచ్చు.

7) ఫాంట్ కన్వర్షన్

8) ఈ బుక్ రీడింగ్ అండ్ పబ్లిషింగ్

9) మిత్రుల సూచనల మేరకు మరికొన్ని అంశాలు

అంటే కంప్యూటర్లూ, టాబ్ లూ, మొబైల్ ఫోన్ల జనరల్ టెక్నికల్ అంశాలకోసం కాకుండా ఈ శీర్షిక కేవలం ఆన్ లైన్లో కవిత్వం రాస్తున్న మిత్రులకు మరింత సహాయకారిగా వుండేదుకు అవసరమైన సూచనలు మాత్రమే చేస్తుందన్నమాట.

జయహో కవిత్వం

క్లిక్ అండ్ డాట్
బై ఫర్ దిస్ వీక్ మరికొన్ని మాటలు పంచుకునేందుకు క్రింద వున్న కామెంట్ బాక్స్ బోగీలోో కలుద్దాం.

కవిసంగమం లింకు

ఫేస్ బుక్

Tweets

లంకెలు