చట్టిగ్రామ గాదె రామలింగేశ్వర స్వామి

 ఎక్కడెక్కడి విశేషాలనో భలేగా చెప్పి ఆశ్చర్యానికి లోను చేస్తారు బాబాయి

Nagulapalli Jaganmohanrao

గారు. భోపాల్ వెళ్ళినప్పుడు భోజ్ పూర్ లో మహా మహా శివుడిని చూసి బావుందన్నారుగా అలాంటి పెద్ద కాదు కాదు పే...ద్ద... శివలింగం ఇంకోటి చూపిస్తానని నన్ను కొండవీటి గోపివరప్రసాద్ గారిని నిన్న ఛత్తీస్ ఘడ్ వైపు తీసుకెళ్లారు.

అప్పుడప్పుడో బోజరాజు అనేక నిలువులెత్తు శివలింగాన్ని భోజ్ పూర్ లో ప్రతిష్టించడానికి ఎంత ప్రయాసపడి ఉంటాడో రాతి బండలపై రాయించిన పూర్తి బ్లూ ప్రింట్ నిర్మాణంలో చాలా పనులు జరగలేదని తెలియజేస్తున్నాయి. కానీ ఇక్కడ మామూలుగా నిలబడ్డ సహజ సిద్ధమైన నిలువు రాతి బండలో శివలింగాన్ని చూసారు ఇక్కడి వాళ్ళు. కొద్దిగా అడవిలోకి నడవాల్సి ఉంది కాని ప్రత్యేక పర్యాటక ఆకర్షణ మాత్రమే కాక ఆధ్యాత్మిక క్షేత్రంగా కూడా పేరు పొందుతోంది.
తూగోజి చింతూరు మండలం చట్టిగ్రామ పరిసరాల్లో గాదె రామలింగేశ్వర స్వామి పేరుతో ఈ ఆలయ నిర్వహణ చేస్తున్నారు. తెలంగాణలో అయితే ముష్టిబండ గ్రామంలో ఇలా పెద్ద శివలింగంగా సహజ శిలను మలచడం గమనించాను.

కామెంట్‌లు