దొంగకుక్కలు తిరుగుతున్నవేళ

నిర్లజ్జగా నిస్సిగ్గుతో,సంశయమేం లేకుండా దొంగపిల్లులు మ్యావ్ మనికూడా అనకుండానే
పాలుపంచుకున్న భావాలను తాగేసి ముతితుడుచుకు పోతున్నాయి.

కాకితో కష్టపడిపొదిగించే
కొకిల గొప్పదై జనంనెత్తిన కూచుంటోంది.
చల్లగాదోచుకెళ్లి దొరనని దొంగమూతి తుడుచుకునే దొంగకుక్కకు
అంతకన్నా అడుక్కోవటం నయమని చెప్పేవాడులేడు.


నీదికాని మొహాన్ని తగిలించుకోవాలని చూస్తే,
ఓనాటికి నీకంటూ చూపేందుకేమీ మిగలదు
వున్నా తుపుక్కున ఊసేందుకే తప్ప 
వెతుక్కుని చూసేందుకెవరూ వాడరు దాన్ని.


కరువుకాలంలో అరువు బుర్రల్ని
పాడించాల్సిన రామకీర్తన రికార్డు చేయాల్సిందే
బరువు గా ఈడ్చే బతుకులకి
పరువుగా బతకటం కొంచెం నేర్పించాల్సిందే


పదిచోట్ల ఎత్తుకొచ్చి పరిశోధననుకునేవాడు
ఆసాంతం ఎత్తిపోతల పథకంపై గుత్తాధిపత్యం ప్రకటిస్తున్నాడు.
నేతిబీర లాంటి నిప్పుకోడి జాతి జీవుడా
వెలలేని నీ తలని దాచుకునేందుకు ఎడారి ఇసుక లేదు సమాధి మన్ను తప్ప


► 05 - FEB - 2013 ◄

కామెంట్‌లు