‘‘నా కనులందు వెన్నె లలు
నర్తన మేమిటి చేసి పోయెనో
నాకపురీ విలాసినుల నాణెపు కాంతి
శరీర శోభతో’’...
ఈ పద్యం అనుభూతి పరాకాష్ఠ. కవిలో కవి పనిముట్టులో ఏ తాత్విక నేత్రం ఏమి దర్శిస్తుందో, అది భాషకు-అనుభూతికి మధ్య జరిపే సంగ్రామం; అదే కవిత్వం. విశ్వసృష్టి మనిషి తర్కానికి ప్రతిబింబం కాదు. కవి భావనామయ సందర్భానికి దాని అవసరాలనుబట్టి సాగిస్తున్న నిర్మాణం ఎలా కవిత్వమైపోతుందో ఇంద్రగంటి శ్రీకాంతశర్మ పరిచయం చేయగలరు.
సాహితీ ప్రపంచంలో సుపరిచితులైన ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు. కవి పండిత కుటుంబంలో, ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారి తనయులుగా 1944లో తూ.గో జిల్లాలో జన్మించారు, దాదాపు అన్ని సాహితీ ప్రక్రియలనూ స్పృశించినట్టే కనపడతారు. అపురూపమైన భావావేశం వీరి సొంతం. ఆవేశాన్నైనా, ఆవేదననైనా అక్షరాల్లో లయబద్దంగా అమర్చగల్గడం, పాఠకుల మనసులతో పాటు, మెదళ్ళనీ రచనల ద్వారా కదిలించగలగడం వీరి ప్రత్యేకతలు. వీరి సతీమణి ఇంద్రగంటి జానకీబాల గారూ రచయితగా సుప్రసిద్ధులే. రేడియో వినే అలవాటు ఉన్న వారందరికీ, "సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ.." అంటూ ఆమె గొంతులో ఆహ్లాదంగా సాగిపోయిన గీతం ఈ పాటికే గుర్తొచ్చి ఉంటుంది.

తనయులు ఇంద్రగంటి మోహన కృష్ణ( తెలుగు సినిమా దర్శకులు మొహనకృష్ణ గారి సారధ్యంలో 2004 ఎన్నో అవార్డులు పొందిన వీరి మొదటి సినిమా గ్రహణం, 2006 లో వచ్చిన మాయాబజార్ ,2008 లో అల్లరి చేసిన అష్టాచెమ్మా 2011 క్రికెట్ ఆడిన గోల్కొండ హైస్కూల్ గుర్తుండే వుంటాయి.
విజయవాడ రేడియో స్టేషన్ శ్రోతలందరికీ అప్పటికీ, ఇప్పటికీ గుర్తుండి పోయిన తిరునాళ్ళకు తరలొచ్చే కన్నె పిల్లలా పాట ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు రాసిందే పాట గురించి కొన్ని మాటలు. ..............
1982-83 ప్రాంతాల్లో ఆయన విజయవాడ వస్తే రేడియో కేంద్రం వాళ్ళు ఆయన చేత ఒక పాటను (తిరునాళ్ళకు తరలొచ్చే కన్నెపిల్లలా …) చేయించుకున్నారు. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి రచనకు
విజయరాఘవరావుగారు బాణీ కడితే,
పద్మశ్రీ, శ్రీరంగం గోపాలరత్నం గొప్పగా పాడారు.
తిరునాళ్ళకు తరలొచ్చే కన్నెపిల్లలా (2)
మెరుపులతో మెరిసింది వానకారు.
నీలిమొయిలు వాలుజడకు చినుకే చేమంతి
కట్టుకున్న పచ్చదనం పట్టు పరికిణీ (తిరునాళ్ళకు)
తెలివెన్నెల వేకువలో తానమాడి
అడవిదారి మలుపుల్లో అదరిచూసి
కొండతిరిగి కోనతిరిగి గుసగుసలాడి.
తరగల మువ్వల గలగల నాట్యమాడి. (తిరునాళ్ళకు)
చిగురేసిన చిరుకొమ్మలు ఊగిఊగి పోతే
చిలిపిగ జడివానవేళ చక్కిలిగిలి పెట్టి
పకపక పువ్వుల నవ్వులు నవ్విస్తూ వస్తూ
బాటవెంట సంబరాలు పంచిపంచి పెడుతూ (తిరునాళ్ళకు)
కొంటెకుర్ర కారు వెనక జంటనడక నడిచి
విరహంతో వేదనతో వారి మనసు కలచి
అంతలోన మంచి కలలు కనుల చిలకరించి
జరిగి జరిగి దౌదౌవ్వుల పిలిచి పిలిచి నిలిచి. (తిరునాళ్ళకు)
రామం గారు (S.B శ్రీరామమూర్తి) ఆ పాట పుట్టుక మీద “ఒక పాట పుట్టింది” పేరుతో డాక్యుమెంటరీ చేసారు.
ఈ పాటను దీని గురించి వివరాలను క్రింది లింకులో చూడొచ్చు. జ్ఞాపకం లాంటి ఈ పాట వినొచ్చు
http://www.eemaata.com/em/issues/201201/1903.html
► తెలుగు పొట్టి కథలకు "కథానిక" అనే అద్భుతమైన పేరు సూచించి, ఆ సాహితీ ప్రక్రియకు ఒక సమున్నత స్థానాన్ని కల్పించిన శ్రీ. హనుమచ్ఛాస్త్రి గారి వారసత్వాన్ని నిలబెట్టడంతో పాటు, అర్థవంతమైన రచనలెన్నో చేసి, సాహితీ ప్రియులకు షడ్రసోపేతమైన విందునిచ్చిన శ్రీకాంత శర్మ గారి వంటి మహనీయులను, అప్పుడప్పుడూ కవిత్వపు సాయంత్రాల మిషతో తలచుకోవడం, కలుసు కోవడం సాహీతీ కుటుంబాలకు ఒక మరపు రాని జ్ఞాపకమే.
1982 లో కృష్ణావతారం సినిమా కోసం రాసిన పాట ‘‘ చిన్నారి నవ్వు చిట్టి తామర పువ్వు ’’ కెవి మహదేవన్ సంగీత సారద్యంలో చేసారు.
1983 లో నెలవంక చిత్రానికి గాను రెండు పాటలను రమేశ్ నాయుడు సంగీతంలో రాసారు అవి
‘‘ కనుబొమ్మల పల్లకిలోన ’’ రెండోది ‘‘ సొగసరి బొమ్మ... కోయిలాలో.. ఎగిసి ఎగిసి పడకే కోయిలాలో ..’’

1984 లో రావుగోపాల రావు చిత్రానికి రమేశ్ నాయుడు గారి సంగీతంలోనే రాసిన ‘‘ కులుకులమ్మ చూసిందిరో ఓర ఓర చూపు... సొగసులమ్మ నవ్విందిరో దోర దోర నవ్వు ’’ అంటూ అల్లరిగా కొంచెం కథానాయకిని పొగుడుతూ మృదువుగా సాగుతుంది ఈ పాట.
మిత్రులు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి గురించి టపా రాసినందుకు ధన్యవాదాలు!అతనిది అనుభూతి కవిత్వం అని ఆ రోజుల్లో అనేవారు!జానకీబాలగారు కూడా భానుమతిమీద ఒక చిన్న పుస్తకం రచించారు!ఇక మోహనకృష్ణ గురించి ఈ తరానికి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు!!!!హనుమత్ శాస్త్రి గారిని నిజామాబాద్ ఇందూరు భారతి వేదికద్వారా అలనాడు సన్మానించుకునే భాగ్యం మాకు కలిగింది!ఇటీవలే కవి సగమంసభలో పక్కపక్కన కూర్చుని శ్రీకాంత్ శర్మగారితో అలనాటి ముచ్చట్లు ముచ్చటించుకున్నాము!మీ టపాకు ఒక దీపావళి పటాకు!
రిప్లయితొలగించండిధన్యవాదాలు సూర్య ప్రకాశ్ సర్.. మీ స్పందనకు వెలిగాయి సంతోషపు మతాబులు.
రిప్లయితొలగించండి