ఒకదినం ఫోన్ల మాట్లాడ్తాంటే
కిసుక్కున ఎక్కిరిస్తా ఇనబడిందో మాట.
"లంజది" అంటూ
ఇజ్జత్ దీసేటి గా సంకరమాట నన్ను ఎనక్కిదోసేసింది.
యాడకో ఎర్కేనా?
మొరాయిస్తా పోయెటి మీ పీతబుర్ర రైల్లా
ఎన్కాల సీటుకి.
అసలైతే ఆడోళ్ళకి మాత్రమే అనే ఆ పెద్దసీటు
గది నీ ఇరుకు బుర్ర ఇముడ్చుకోలేంది.
గది నీ బేశరమ్ పరేషాన్ల కంటే శానాశానా పొడుగైంది.
అందని అంగూర్ అయిన ప్రతి ఆడదాన్ని
వేరుపడేశి ఎకశకాలు పోనీకి
బజారుదీ అనే సూపు నీ సొల్లునోటి కన్నుది.
రంగులేసుకుని సొంగ కార్సుకుంటా
నీ కోసం సూశేటి గుంపేలేగదా అనుకుంటున్నవా సానోళ్ళంటే
ఇనుకోరా బిడ్డా... నీకో ముచ్చట జెప్త.
నువ్వు అగమయ్యిందన్న ఆడదే
నీ సభ్యసమాజానికి ఎదురునిలవగల పంతులమ్మ.
ఆమె వెయ్యి పనులు జేసే వందచేతుల దుర్గమ్మ
నీ సంజాయిషీలను ఫికర్ జేసే పొద్దుకూడా లేదాయమ్మకి.
ఔ భయ్! ఆమెకి వందల కోట్ల యాపరముంది సచ్ రే.
అదంతా నీ ఎదవ సోది అనుమానాలు, పనికిమాల్న ఏతుల మీదనే తెల్సా.
సాని అంటే గోరోజనపు పుర్సత్
కోర్కె
సానిది కాదని చెప్తే...
'కాదు' అనే అర్ధముంటది.
'అవును'ని మాత్రం మడిచి చేసంచిలో పెట్టుక తిరుగుతది.
సానిదే కానీ సూతరామూ మంచిది.
కనికరమంటే ఎరిగినది.
సానిదే బిడ్డల కోసం నిద్దర వదిలేస్తది.
తనకోసం సోంచాయిస్తా ఉంటది.
దొమ్మరిదే నిన్ను ఎదగనిచ్చే దొరసాని
భోగందయితే తనకోసం లోగుడ్డలు తనే కొంటది
తనేవి మెచ్చుతదో అయ్యే ఏసుకుంటది.
తన గుండె బద్దలయితదేమోనని బెంగవడదు.
నీపై గుబులయితుందని చెప్పనీకి
భయపడదు.
సానిది ఒక ఊరుమ్మడి సనుకట్టు ఆబోతు.
నిన్నొదిలేశిన ఏ ఆడదాన్ని తిట్టాలన్నా
నీ నోటికొచ్చేటిది ఒకటే మాట 'లం..
జ.. ది..'
అందుకే నువ్వింకోసారి
నా దిక్కు సూడాలనుకున్నప్పుడు
నాకోసం పూలు తేవాలనుకున్నపుడు.
నా ముఖమెంక జూడు.
నా కండ్లలోన్కి చూడు.
నా గుడ్డల్లోకి
నా చమడాలోకి
నా రందిలోకి
నా చెప్పుల్లోకి
నా గొంతులోకి
నా చెడ్డలోకి
నా త్యాగంలోకి
నా ఇవాళ్టిలోకి
నా గతంలోకి
నా పోరాటంలోకి
నా కాలంలోకి
నా ప్రేమలోకి
నా ఎల్తూరులోకి
నా మనసులోకి
నా ఇజ్జత్ లోకి
అచ్చంగా నేనంటే నాలోకి
మొకంల మొకం బెట్టి తొంగిచూసి
దమ్ముంటే అప్పుడు రాయ్ రా బాడకావ్
పంపే ఎర్ర గులాబీల మీన
"లంజదాని కోస౦" అని.
శృతిహాసన్ యూట్యూబ్ లోని కవిత లింకు ఇది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి