ఏడ భేఫికర్ గుండె ఖుల్లం ఖుల్లా గుంటదో.
ఏడ మోరెత్తుకుని బెదుర్లేక బతక లేస్తమో.
ఏడ తెల్వి ఏ ఒక్కని సోత్తయి పొదో.
ఏడనయితే జమానా జిందగీ మొత్తం బరాబర్ ఇరుకు గదుల్లెక్క ఇడగొట్టుకు పొదో.
యాడ్నతే గొంతునొచ్చే ప్రతిమాటా సచ్చం గుంటదో.
గలేమిల్నకి పుర్శత్ చేతులు పూరా సాపుకుని అలాయ్ బలయ్ అంటయో.
సచ్చమైన పంటకాల్వలెక్క కొట్టే అలగ్ సొంచాయిన్చుడు బుద్ధి,
పాసిపోయిన పాతలవాట్ల ఇసుకపర్ర లోంకి
ఇంకిపోకండుంటదో.
యాడైతే నా బుర్రా బుద్ధిని సచ్ సొంచాయిన్చుడు లోకి, నిజానం నెరువు తరీకా తొవ్వల్లోకి నువ్ నడ్పుతవో.
అసొంటి బాజాప్తా బతుకుల్లోకి
ఓరయ్యా! ఆడనే నా దేసానికి తెల్లారనియ్యి.
Original : Ravindranath Tagore
Telangana language : Katta srinivas
ఫేస్ బుక్ పోస్టు లింకు:

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి