|| అబూ బెన్ ఆదాం ౹౹
అబూ బెన్ ఆదాం. ( నీలాంటోళ్లు ఇబ్బడి ముబ్బడవ్వాలే భాయ్ )
పురసత్ గా పనుకున్నోడు కాస్తా రాత్రిల పూసిక్కిన లేచిండు.
పండు ఎన్నెల పడగ్గదిల పరుసుకొనుడు జూసిండు.
మల్లెలపై మంచు మెరిసినట్లు జిగేలంటుంటే మురిసిండు.
బంగారు ఫుస్కమ్ ల దేవకన్య ఆరామ్ గా రాసుకోనుడు జుస్తే జరంత ధైర్నం పెరిగి
"ఏం రాస్తున్నవ్ అక్క దాన్ల" అని సొంచాయించిండు.
నిమ్మళంగా తలెత్తి కమ్మని గొంతుతో సెప్పింది కదా.
" దేవున్ని ఇష్ట పడేటోళ్ల పేర్లు రాస్తన్న తమ్మి" అని
" మరి నా పేరు ఉన్నదేమో సూడ్రాదే" వుండబట్టలేక ఊగులాడతా ఆడిగిండు.
లిష్టంతా జూసి కరుగ్గా సెప్పింది అబ్బే దీన్లో లేత్తియ్,
కొంచెం గొంతు తగ్గించినా జబర్దస్త్ గా ఏమన్నడంటే " గట్లయితే.... నా పేరు ఆయన జమానా లోని మనుషుల్ని ప్రేమించే చిట్టాలో నన్న రాయరాదే" గీమాలిండు.
సర్లేపో! అని రాసి గబాల్న మాయమయ్యింది.
తర్వాతి రాత్రి జిగేల్మనే ఎలుగుల్ల ఆ యక్క మల్లా వొచ్చింది.
దేవుడు ఎవర్ని ఇష్టంగా ప్రేమిస్తున్నడో ఆ చిట్టా సుతా దెచ్చింది.
దాంట్ల అబూ గాని పేరే ముంద్గల ముంద్గల రాసుంది.
English || Abou Ben Adhem ||
BY LEIGH HUNT
తెలంగాణ || అబూ బెన్ ఆదాం|| కట్టా శ్రీనివాస్
Independence day quotes in telugu
రిప్లయితొలగించండిNice.
రిప్లయితొలగించండి👌👌👌🙂
రిప్లయితొలగించండి