రేవుకొచ్చిన జీవితాలు

ఈ రోజు
తారట్లాడుతూ
రేవులో మునకేసి
దొరికిందో గాలిపటం

బద్రంగా పట్టుకున్న
రెండు చేతుల కళ్ళుకప్పి
కొట్టుకొచ్చినట్లుంది.

మొన్న బైకు జోరులో
ప్రాణాల్ని హోరెత్తించి.
రింగురోడ్డు కి అవుటర్ గా చరించింది.

నిన్న
ఎర్రటి పబ్బు దీపపు
చీకటిలో
చిందేసి తడిసింది.

నోట్ బుక్కు తెగచింపి
ప్రేమలేఖ పడవలొదిలింది.
పసి గొట్టాలకు నికోటిన్
నల్లరంగు పూసింది.

ఆకాశంలో తలెత్తుకెగరాల్సిన
రోజిలా తెగిపడి రేవులో తేలింది.

అనుబందపు దారం జారిందంటే
గాలివాటపు జీవితం ఏ దరీ చేరదుగా మరి.


http://www.facebook.com/groups/kavisangamam/permalink/411967775522647/

కామెంట్‌లు