మీరైన చెప్పండి



అమ్మ నాన్న లెవురో ఎరికలేని దాన్ని
కడుపార ఓ పూటబువ్వ నెరగని దాన్ని
చింపిరి జుట్టుతో మురికి బట్టలతో
చెత్తలో తిరుగుతూ చిత్తు ఏరేదాన్ని

కవిగాడి మాటలకు కోపమోచ్చిందండి
యివరంగ సెపుతాను ఇనుకోండి కూసింత.

కడుపులో ఆకలి, కండ్లలో నీళ్ళతో
కాళ్ళలో వణుకుతో మనసులో ఆశతో
మండేటి ఎండలో కుండీలు ఎతికితికి
పంది గతికిన పాసియిస్తరైనా లేక
కడుపు సేతట్టుకొని గొడెంటనీల్గితే
కారున్న ఇంటిలో, జోడున్న(?) అయ్యేరు
సెయ్యెట్టి పిలిసిండు బువ్వెడత రమ్మండు.

ఎదేదో సెప్పిండు సేస్తె బువ్వెట్టిండు
టీవి సూపెట్టిండు, పక్క సూపెట్టిండు
తప్పేదో ఒప్పేదో నాకెట్ట తెలుసుద్ది
తిండి దొరికిందీడ బతుకు పరిసిందీడ
నా బతుకు నేనిట్ట బతుకుతావుంటే
కవిగాడు వచ్చిండు కన్నీరు కార్చిండు
నాకేదో అయినట్టు బెంగగా సూసిండు
ఆ సూపు నాలోన చితిమంట రేపింది
అడుగడుగు ప్రశ్నలతో నన్ను నిలదీస్తోంది
మీరైన చెప్పండి తెలివున్న సదువొరులు
నేనేమి సెయ్యాల ఏ రీతి బతకాల
తప్పున్నదెక్కడా ? ఒప్పు సేసేదెలా?
నిప్పులా కాలేటి బతుకు దారులలో
చెప్పండి వెన్నెలెలా నింపాలి సారులూ...?


భన్వారీ దేవి, తారా చౌదరీ, రేవ్ పార్టీల కర్మాగారపు పని తనానికి ఆశ్చర్యపోతూ దేవ్ బెన్ గల్ ‘‘ స్ల్పిట్ వైడ్ ఓపెన్ ’’ స్పూర్తితో సిరి.కట్టా

http://www.facebook.com/groups/kavisangamam/permalink/419163221469769/

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి