ఓ గుర్తింపుల
సభా తటాకంలో
కొన్ని కప్పలూ, మరికొన్ని చేపలూ..
లొడ లొడ లాడుతూ,
ఈదు లాడుతున్న వేళ
మెత్తటి కాగితప్పడవలా
అలజడేం లేకుండా చోచ్చుకువచ్చాడతడు.
అభిమన్యుడై
తన మొహంలో ఏ తహ తహా లేదు.
తన తాహతుకు తగ్గ విధి నిర్వహణ తప్ప.
అస్తిత్వాన్ని సమస్టిలోనే స్థాపించి,
అలసిన మెదళ్ళకు స్వాంతన చేకుర్చేందుకు,
తానే ఒక
తామరాకు పై కన్నీటి బొట్టైకదులుతున్నాడు.
పేరేమిటో, ఊరేమిటో, మరేం చదివాడో
తిన్నాడో,లేదో మదివున్నవాడో కాదో.
అనవసరాంశం సభాంశీభూతాలకు,
సభనుంచి చెదురుతూ ఓరగా అతనికై
వెతుకులాడే చూపులకు ఆ మొహం మాత్రం దొరకదు.
ఇతడు
తన కదలిక అలజడి కాకుండా
వంగి వంగి అలలేవీ రాకుండా ఈదులాడుతున్నాడు.
జితేంద్రియత్వం సాధించిన మునిలా
మౌన ముద్రను వీడకుండానే విధినిర్వహిస్తూ
ఇంతకీ నీకంటే సభికులే మేదావులా ?
ఇంత గాంభీర్యాన్ని తేన్చుతున్నందుకు..
http://www.facebook.com/groups/kavisangamam/permalink/422676184451806/
సభా తటాకంలో
కొన్ని కప్పలూ, మరికొన్ని చేపలూ..
లొడ లొడ లాడుతూ,
ఈదు లాడుతున్న వేళ
మెత్తటి కాగితప్పడవలా
అలజడేం లేకుండా చోచ్చుకువచ్చాడతడు.
అభిమన్యుడై
తన మొహంలో ఏ తహ తహా లేదు.
తన తాహతుకు తగ్గ విధి నిర్వహణ తప్ప.
అస్తిత్వాన్ని సమస్టిలోనే స్థాపించి,
అలసిన మెదళ్ళకు స్వాంతన చేకుర్చేందుకు,
తానే ఒక
తామరాకు పై కన్నీటి బొట్టైకదులుతున్నాడు.
పేరేమిటో, ఊరేమిటో, మరేం చదివాడో
తిన్నాడో,లేదో మదివున్నవాడో కాదో.
అనవసరాంశం సభాంశీభూతాలకు,
సభనుంచి చెదురుతూ ఓరగా అతనికై
వెతుకులాడే చూపులకు ఆ మొహం మాత్రం దొరకదు.
ఇతడు
తన కదలిక అలజడి కాకుండా
వంగి వంగి అలలేవీ రాకుండా ఈదులాడుతున్నాడు.
జితేంద్రియత్వం సాధించిన మునిలా
మౌన ముద్రను వీడకుండానే విధినిర్వహిస్తూ
ఇంతకీ నీకంటే సభికులే మేదావులా ?
ఇంత గాంభీర్యాన్ని తేన్చుతున్నందుకు..
http://www.facebook.com/groups/kavisangamam/permalink/422676184451806/
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఏ కప్పల సబా తటాకంలోనైనా తప్పకుండా కనిపించే కాగితం పడవ మీరు ఆనవాలు పట్టిన బిస్కట్లబ్బాయి.సామన్యదృశ్యాన్నిఅసామాన్యంగా ఆవిష్కరించిన మీ క్షరాలలో కవిత్వం ఎన్ని పాళ్ళుందొ...సామాన్య జీవి మీద అన్ని పాళ్ళు ఆర్తి కనిపిస్తోంది.కవికి ఊండాల్సిన కెమేరా కన్నుఇదేనని నా భావన.మీలాంటి కవులే నేటి మన సామాజికావసరం. చిన్న సూచన;స్వాంతన తప్పు పదమ్. సాంత్వన సరిఅయిన పదం. ముద్దుపళనిది 'రాధికా సాంత్వనము'
రిప్లయితొలగించండి