పుస్తకాల అల్మరా తెరిస్తే
ప్రపంచపు కిటికీ తీసినట్టే
ఓ చల్లటి గాలి మెల్లగా
ఒరుసుకుంటూ వెళుతుంది.
ఇక పొత్తన్ని తెరిస్తే
ఓ ముద్దుల పురాతన తాత
బుజ్జగింపులతో తలనిమిరినట్లే వుంటుంది.
అక్షరాల వెంట పరుగెడుతుంటే,
సత్తువ పెరిగి లోపటి జవసత్త్వాలు
ఇనుమడిస్తూ సెగలెత్తిస్తుంది.
భాష వెనుక బావం
ఎదలో ఇంకినపుడల్లా
తెలియని జల ఏదో
ఊరుతూ ఉరుకుతూ ఊరిస్తుంది.
ఆత్మీయత అచ్చొత్తుకుని
అనుభవాల పొరలెత్తే
అనుంగు మిత్రుల సాహచర్యం కూడా
దాచిన పుస్తకమంతటి
కమ్మటి వాసనలు వీస్తుంది.
అందుకేనేమో.
సిరి.కట్టా**27-07-2012
( అమ్మని, పుస్తకాన్ని యిష్టపడని వారు ఎవరుంటారు, కవితా వస్తువు పాతదే కాని నేను కూడా నా మాటల్లో చెప్పాలని పించింది.)http://www.facebook.com/groups/kavisangamam/permalink/426604380725653
ప్రపంచపు కిటికీ తీసినట్టే
ఓ చల్లటి గాలి మెల్లగా
ఒరుసుకుంటూ వెళుతుంది.
ఇక పొత్తన్ని తెరిస్తే
ఓ ముద్దుల పురాతన తాత
బుజ్జగింపులతో తలనిమిరినట్లే వుంటుంది.
అక్షరాల వెంట పరుగెడుతుంటే,
సత్తువ పెరిగి లోపటి జవసత్త్వాలు
ఇనుమడిస్తూ సెగలెత్తిస్తుంది.
భాష వెనుక బావం
ఎదలో ఇంకినపుడల్లా
తెలియని జల ఏదో
ఊరుతూ ఉరుకుతూ ఊరిస్తుంది.
ఆత్మీయత అచ్చొత్తుకుని
అనుభవాల పొరలెత్తే
అనుంగు మిత్రుల సాహచర్యం కూడా
దాచిన పుస్తకమంతటి
కమ్మటి వాసనలు వీస్తుంది.
అందుకేనేమో.
సిరి.కట్టా**27-07-2012
( అమ్మని, పుస్తకాన్ని యిష్టపడని వారు ఎవరుంటారు, కవితా వస్తువు పాతదే కాని నేను కూడా నా మాటల్లో చెప్పాలని పించింది.)http://www.facebook.com/groups/kavisangamam/permalink/426604380725653
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి