కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచనా

1

ఏం చేస్తే..
సంతోషం హ్రుదిలో నిండుతుంది?

తళుకు బెళుకుల తక్కెడలో తారట్లాటొద్దు.
చేసుకుంటూ పో......... పని.



2

ఎలా వుంటే
ధైర్యం వెన్నుతడుతుంది ?
తావీజులేవో వుంటాయని తఖరారు పడొద్దు
కండకే కాదు, గుండెకూ సానపట్టేది ......... పని.

3

ఏ క్రమత్వంతో
ఆరోగ్యం స్థిరమౌతుంది ?
దేశ, విదేశీ విధానాలతో దిమ్మరివై పోవద్దు.
నిరంతర చైతన్య పూరకం పని.

4

ఏ స్వాంతనలో
దు:ఖం ఉపశమిస్తుంది ?
కన్నుతుడిచే చేయి, వెన్ను నిమిరే వొడికోసం
అంగట్లో అంగలార్చకు,
పోటెత్తే ప్రవాహంతో మరకల్ని తడిపేది ......... పని.

5

ఏ ప్రయత్నంలో
విజయం వరిస్తుంది ?
శిక్షణా కేంద్రాల శివారులలో మునకలేయోద్దు.
తానే అందలమై అలరించేది ......... పని.

6

ఎంతటి ప్రచారంతో
ప్రతిష్ట ఇనుమడిస్తుంది ?
వందిమాగదుల పోషణలో వున్నది హరించుకోవద్దు.
పరిఢవిల్లే ఫలితంతో పల్లకీ ఎక్కించేది ......... పని.



7

మరి

8

ఏ సాధనలో
ప్రశాంతత మదినిండా వెల్లివిరుస్తుంది ?
ప్రపంచాన్ని వదిలేసి మౌనంలో సమాధికావద్దు.
సమూహత్వం సిద్దించుకుని నీవే పనివై శబ్దిస్తే చాలు.

9

ఏ పద పదఘట్టన
పసతో కవిత్వం పనలెత్తుతుంది ?
జనాంతికంలో పునరావ్రుతి దోషంలేని పదం
......... పని. ......... పని. ......... పనే.


కామెంట్‌లు

  1. మంచి పద్యం శ్రీ...మనసును పని మీదకు ఉద్యుక్త పరిచే సాధనంగా ఉంది.
    నీ బ్లాగ్ చాలా అందంగా తీర్చావ్ శ్రీ...నా మనసు వదిలి పోతున్నా....

    రిప్లయితొలగించండి
  2. పని తనము ప్రదర్శించారు
    -v.murali(Dalinaidu)

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి