భజనలూ, భుజకీర్తులూ
భాగ్య సంపదై భాసించేందుకు
కప్పల తక్కెడ తోక్కిసలాటలో
గంపగుత్తగా ఇస్తున్నార్ట.
చిడతలూ, బుర్రకధలూ
చెప్పుకుంటూ శోభిల్లేందుకు
తప్పని తిప్పల తాయిలాలతో
తయారుగానే వుంటుండాలట.
భాగ్య సంపదై భాసించేందుకు
కప్పల తక్కెడ తోక్కిసలాటలో
గంపగుత్తగా ఇస్తున్నార్ట.
చిడతలూ, బుర్రకధలూ
చెప్పుకుంటూ శోభిల్లేందుకు
తప్పని తిప్పల తాయిలాలతో
తయారుగానే వుంటుండాలట.
వందిమాగదుల వందనాలకై
వందల వరదలు వదలాల్సిందేనట.
బట్రాజ, భజంత్రీలకై
భవధీయులై భజించాల్సిందేనట.
ముంజేతి కంకణాలూ
ముంగిట్లో మంగళారతులు
ముందస్తుగా మాకనుకుంటేనే
మంది బలంతో మజా వస్తుందట
అంగట్లో నీ తూకం
వ్యర్దాలతో వేసుకుంటావా ?
ముంగిట్లో ఓ అర్ధం
సమర్ధతతో వెతుక్కుంటావా?
తెలుసుకునేదీ, తేల్చుకునేదీ
ఎవరో కాదు... నీలో నువ్వే
నీతో నువ్వే...
http://www.facebook.com/groups/kavisangamam/permalink/427192700666821/
సిరి.కట్టా
చాల బాగుంది మీ భావము .
రిప్లయితొలగించండిమా అమ్మా చినప్పుడు వందిమగతులు,బాజా భజంత్రీలు కావాలిరా నీకూ
అంటూ తిడుతో లేపిన తీపి గుర్తులు జ్ఞాపకానికి వచ్చేయ్యండీ.